ఐలవరం, బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

ఐలవరం
—  రెవెన్యూయేతర గ్రామం  —
ఐలవరం is located in Andhra Pradesh
ఐలవరం
ఐలవరం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: అక్షాంశ రేఖాంశాలు: 16°04′39″N 80°45′23″E / 16.077377°N 80.756507°E / 16.077377; 80.756507
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా బాపట్ల
మండలం భట్టిప్రోలు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 522259
ఎస్.టి.డి కోడ్ 08648

గ్రామంలో విద్యా సౌకర్యాలుసవరించు

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలసవరించు

గత సం. 10వ తరగతిలో 100% ఫలితాలు సాధించిన ఈ పాఠశాలకు "రామినేని ఫౌండేషన్" పురస్కారం దక్కింది. ప్రధానోపాధ్యాయులు శ్రీ మోటూరు వాసుదేవరావు, 15-10-2013న గుంటూరులో ఈ పురస్కారం అందుకున్నారు. ఈ పాఠశాలకు ఈ పురస్కారం రావడం ఇది 3వ సారి.

ఈ పాఠశాల దినదినాభివృద్ధి చెందుచున్నది. 1934లో ప్రాథమిక పాఠశాలగా గుర్తింపు పొందినది. విద్యార్థుల సంఖ్య పెరగడంతో, 1981లో గ్రామానికి చెందిన శ్రీ అందె వరదయ్య సహకారంతో, ఉన్నత పాఠశాలగా గుర్తింపు సాధించింది. ఈ పాఠశాల ప్రస్తుతం 600 మంది విద్యార్థులతో విరాజిల్లుతున్నది. 2014, ఫిబ్రవరి-20న పాఠశాల వార్షికోత్సవం వైభవంగా జరుగనున్నది. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలలో, ఈ పాఠశాలకు ఒక ప్రత్యేకత ఉంది. పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించి ద్వితీయ స్థానం, వరుసగా మూడు సార్లు 100% ఉత్తీర్ణత సాధించింది. మారుమూల గ్రామంలో పాఠశాల ఉన్నప్పటికీ, చుట్టుప్రక్క గ్రామాలయిన భట్టిప్రోలు, అబ్బనగూడవల్లి, కోనేటిపురం, కనగాల, పెద్దవరం, సూరేపల్లి తదితర గ్రామాలనుండి విద్యార్థులు చదువుకోవడానికి ఇక్కడకు వస్తున్నారు. క్రమశిక్షణతో కూడిన విద్య, అనుభవం కలిగిన ఉపాధ్యాయులతో పాఠశాల కొనసాగుచున్నది. ఆంగ్లభాషలోనూ ప్రత్యేకంగా విద్యార్థులను తీర్చిదిద్దుచున్నారు. ఈ పాఠశాల విద్యార్థులు ఐ.ఐ.ఐ.టి.లో గూడా ప్రవేశాలు సాధించుచున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఉపకార వేతనాల ప్రతిభా పరీక్షలో ఈ పాఠశాలనుండి, 52 మంది విద్యార్థులు పరీక్షలు వ్రాయగా, 32 మంది విద్యార్థులు ఎంపికై, జిల్లాలోనే ప్రథమ స్థానం కైవసం చేసుకున్నారు. విద్యతోపాటు ఈ పాఠశాలలో విద్యార్థులకు ఎన్.సి.సి., మరియూ క్రీడలలో గూడా శిక్షణ ఇస్తున్నారు.

గ్రామ పంచాయతీసవరించు

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, చల్లపల్లి మాణిక్యం సర్పంచిగా ఎన్నికైనారు.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలుసవరించు

  1. శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి దేవస్థానం.
  2. శ్రీ రుక్మిణీ, సత్యభామా సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం:- ఐలవరం గ్రామములోని ఈ ఆలయంలో, విగ్రహాల పునఃప్రతిష్ఠాకార్యక్రమాలు, 2014, మార్చి-18, మంగళవారం ఉదయం వైభవంగా జరిగినవి. స్వామివారిని గరుడవాహనంపై అలంకరించి, గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు హారతులు స్వీకరించారు. బాజాభజంత్రీలు, బాణాసంచా కాలుస్తూ విగ్రహాల ఊరేగింపు జరిగింది. 17వ తేదీ రాత్రి శాంతికళ్యాణం కనులపండువగా నిర్వహించారు. నూతన గరుడవాహనం, మకరతోరణాలకు సంప్రోక్షణ చేశారు. మహిళలు స్వామివారి గీతాలు ఆలపించుచూ కోలాటం చేశారు. ఉత్సవ విగ్రహాలను దివి శ్రీమన్నారాయణాచార్యులు, అర్చక కుటుంబసభ్యుల విరాళాలతో తయారు చేయించారు. గరుడ విగ్రహాన్ని నందిపాటి వంశీయులు అందించారు.
  3. శ్రీ కామాక్షీ అమ్మవారి ఆలయం.
  4. శ్రీ అయ్యప్పస్వామివారి ఆలయం:
  5. శ్రీ రామమందిరం.
  6. శ్రీ పైడమ్మతల్లి ఆలయం.
  7. శ్రీ జొన్నాదుల రెడ్డెంకమ్మ తల్లి ఆలయం.

ప్రధాన పంటలుసవరించు

వరి, అపరాలు, కాయగూరలు

ప్రధాన వృత్తులుసవరించు

వ్యవసాయం, వ్యసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులుసవరించు

కౌతరపు వెంకటేశ్సవరించు

ఈ గ్రామానికి చెందిన కౌతరపు వెంకటేశ్ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పి.హెచ్.డి చేస్తున్నారు. వీరు ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యునెస్కో (UNESCO) ఆధ్వర్యంలో ఇటలీలో మే 6-2013 నుండి మే-17, 2013 వరకు నిర్వహించనున్న "ఉపగ్రహ సమాచార వ్యవస్థ -- ఐనో ఆవరణం వల్ల కలిగే పరిణామాలు" సదస్సుకు హాజరయ్యెందుకు ఎన్నికయ్యారు.

వీరు ఆంధ్రా విశ్వవిద్యాలయంలో "భారత భూభాగంలో ఉపగ్రహ సమాచార సాంకేతిక వ్యవస్థ" అను అంశం పై పి.హెచ్.డి. పూర్తి చేసారు. తరువాత బ్రెజిలు దేశంలో అయనోస్పియర్ ప్రభావాలపై ఒక సంవత్సరంపాటు పరిశోధన చేసారు. వీరు చేసిన కృషికి గుర్తింపుగా, అమెరికాలోని ఇంటర్ నేషనల్ యూనియన్ ఆఫ్ రేడియో సైన్సెస్ అను సంస్థ వారు, వీరికి "యువ శాస్త్రవేత్త (young scintist)" పురస్కారాన్ని ప్రకటించారు.

వంగర రామస్వామిసవరించు

ప్రముఖ రంగస్థల నటులు. వీరు పూలరంగడు, బ్రహంగారి జీవిత చరిత్ర, భావనాఋషి జీవిత చరిత్ర మొదలగు నాటకాలలో నటించినారు. ఆకాశవాణి, దూరదర్శన్ లలో పలు నాటకాలను ప్రదర్శించినారు. పలు బహుమతులు, పురస్కారాలు అందుకున్నారు. వీరు 68 సంవత్సరాల వయస్సులో, 2017, జులై-17న, పరమపదించినారు.

గ్రామ విశేషాలుసవరించు

ఈ గ్రామానికి చెందిన శ్రీ మాచర్ల వీరేంద్ర అను స్వర్ణకారుడు, క్రికెట్ ప్రపంచ కప్-2015 నమూనా, భారతదేశ పటం, బ్యాట్, బాల్, వికెట్లను 1.1 గ్రాముల బంగారంతో తయారుచేసి వార్తలకెక్కినారు. వీరు గతంలో ఐ.పి.ఎల్. 20-20 కప్ లను గూడా ఇదే విధంగా తయారుచేసారు.

మూలాలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=ఐలవరం&oldid=3673125" నుండి వెలికితీశారు