కాంగ్రా శైలి చిత్రకళ
కాంగ్రా శైలి చిత్రకళ (ఆంగ్లం: Kangra painting) హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా జిల్లా లో 1780 లో ఉద్భవించిన ఒక చిత్రకళా శైలి.[1]
చరిత్ర
మార్చు1751 నుండి 1774 వరకు కాంగ్రా ను పరిపాలించిన రాజా ఘమండ్ చంద్ కళాప్రేమికుడు కాదు. అయితే అతని మనుమడు రాజా సంసార్ చంద్ (1775-1823) కు రాచకార్యాలతో బాటు, కళలపై కూడా మక్కువ ఉండటంతో కాంగ్రా శైలి 1780 లో ఉద్భవించింది. [2] సంసార్ చంద్ పాలనలో కాంగ్రా శైలి చిత్రకారులు భాగవత పురాణం లోని దృశ్యాలను చిత్రీకరించటం తో ఈ శైలి ప్రాచుర్యం లోకి వచ్చింది.[2]
శైలి
మార్చుకాంగ్రా శైలి ముఘల్ శైలి, హిందువుల ఆకాంక్షల అపూర్వ సంగమం. [1] పాశ్చాత్య శైలుల ప్రభావం నేరుగా కాకపోయినా, వాటి ఛాయలు అక్కడక్కడా తొణికిసలాడుతుంటాయి. లయబద్ధమైన గీతలు, అధికమైన సహజత్వ పాళ్ళు, స్త్రీ స్వభావం గల ఆకారాలు, అమాయకత్వం లోనే ఒలికే శృంగార రసం కాంగ్రా శైలి ప్రత్యేకతలు.
పతనం
మార్చుదాదాపు 25 ఏళ్ళ వరకు ఒక వెలుగు వెలిగిన కాంగ్రా శైలి చిత్రకళ 1806 లో నేపాల్ నుండి వచ్చిన గుర్ఖాలు ఈ ప్రదేశాన్ని ఆక్రమించుకోవటంతో కనుమరుగు అయ్యింది.[3]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 Archer 1956, p. 2.
- ↑ 2.0 2.1 Archer 1956, p. 4.
- ↑ Archer 1956, p. 5.
- Archer, William George. (1956). The Faber Gallery of Oriental Art Kangra Painting. Faber and Faber Ltd.