కాంగ్‌పోక్‌పి జిల్లా

భారతదేశంలోని మణిపూర్ రాష్ట్ర కొత్త జిల్లా.

కాంగ్‌పోక్‌పి జిల్లా, భారతదేశంలోని మణిపూర్ రాష్ట్ర కొత్త జిల్లా. 2016, డిసెంబరు నెలలో సేనాపతి జిల్లాలో భాగమైన సదర్ హిల్స్ ప్రాంతం నుండి ఏర్పాటుచేయబడింది.[1][2][3][4][5][6]

కాంగ్‌పోక్‌పి జిల్లా
మణిపూర్ రాష్ట్ర జిల్లా
భారతదేశంలోని మణిపూర్ లో ప్రాంతం ఉనికి
భారతదేశంలోని మణిపూర్ లో ప్రాంతం ఉనికి
Coordinates: 25°09′N 93°58′E / 25.15°N 93.97°E / 25.15; 93.97
దేశం భారతదేశం
రాష్ట్రంమణిపూర్
ముఖ్య పట్టణంకాంగ్‌పోక్‌పి
భాషలు
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
Vehicle registrationఎంఎన్
Websitehttps://dckpidistrict.gov.in/

కాంగ్‌పోక్‌పి పట్టణంలో జిల్లా ప్రధాన కార్యాలయం ఉంది. ఇది రాష్ట్ర రాజధాని ఇంఫాల్ నగరానికి 45 కి.మీ.ల దూరంలో ఉంది.[7]

జనాభా మార్చు

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, ఈ జిల్లాలో 36,000 గృహాలు ఉన్నాయి. ఇక్కడ సుమారు 1,93,744 మంది జనాభా ఉన్నారు. అత్యధిక జనాభా కలిగిన జిల్లాల్లో 7వ స్థానంలో ఉంది. ఇందులో 96% జనాభా గ్రామీణ ప్రాంతంలో, 4% జనాభా పట్టణ ప్రాంతంలో నివసిస్తున్నారు. ఈ మొత్తం జనాభాలో 80% మంది షెడ్యూల్ తెగలు, 20% మంది సాధారణ ప్రజలు ఉన్నారు. జిల్లా జనాభాలో 98,908 (51%) మంది పురుషులు, 94,836 (49%) మంది స్త్రీలు ఉన్నారు. ఇక్కడ స్త్రీ పురుష నిష్పత్తి 989:1000 ఉంది. జిల్లా అక్షరాస్యత 85% కాగా, ఇది రాష్ట్ర సగటు 76.94% కంటే ఎక్కువగా ఉంది. ఇందులో పురుషులు అక్షరాస్యత 89% కాగా, స్త్రీల అక్షరాస్యత 80.34% గా ఉంది.[7]

మతం మార్చు

ఇక్కడి జనాభాలో క్రైస్తవులు 79.90%, హిందువులు 17.68%, బౌద్ధులు 0.92%, ముస్లింలు 0.45%, సిక్కులు 0.06%, జైనులు 0.02%, ఇతరులు 0.96% ఉన్నారు.

తెగలు మార్చు

ఈ జిల్లాలో తడౌ కుకి 52.85%, నేపాలీ 15.96%, వైఫీ 5.08%, తంఖుల్ 5.02%, లియాంగ్మీ 3.56%, యిమ్‌చుంగ్రే 2.64%, ఇతరులు 14.9% ఉన్నారు.

ఉప విభాగాలు మార్చు

ఈ జిల్లా 9 ఉప విభాగాలు ఉన్నాయి.[7]

  1. కాంగ్‌పోక్‌పి (అత్యధిక జనాభా)
  2. సైకుల్ (2వ అత్యధిక జనాభా)
  3. సైతు గంఫాజోల్
  4. తుజాంగ్ వైచాంగ్
  5. చంపై
  6. కాంగ్‌చప్ గెల్జాంగ్
  7. బుంగ్టే చిరు
  8. ద్వీపం
  9. లుంగ్టిన్

పర్యాటక ప్రాంతాలు మార్చు

  1. సింగ్డా డ్యామ్ (కాంగ్‌చుప్ గెల్జాంగ్ ఉప విభాగం)
  2. లీమారామ్ వాటర్ ఫాల్ (బుంగ్టే చిరు ఉప విభాగం) - సడు చిరు జలపాతం

రవాణా మార్చు

  1. 2వ జాతీయ రహదారి
  2. 37వ జాతీయ రహదారి

పరిపాలన మార్చు

ఈ జిల్లాలో 534 గ్రామాలు ఉన్నాయి. ఈ జిల్లాలో మూడు (సైకుల్ - 46, కాంగ్‌పోక్‌పి - 47, సైతు - 48) అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.

మూలాలు మార్చు

  1. "7 new districts formed in Manipur amid opposition by Nagas". India Today. 2016-12-09. Retrieved 11 January 2021.
  2. "Manipur Creates 7 New Districts". NDTV. 2016-12-09. Retrieved 11 January 2021.
  3. "New districts to stay, says Manipur CM". The Hindu. 2016-12-31. Retrieved 11 January 2021.
  4. "Manipur Chief Minsiter [sic] inaugurates two new districts amid Naga protests". 2016-12-16. Retrieved 11 January 2021.
  5. "Simply put: Seven new districts that set Manipur ablaze". The Indian Express. 2016-12-20. Retrieved 11 January 2021.
  6. Utpal Parashar (2017-01-05). "Creation of new districts could be game-changer in Manipur polls". Hindustan Times (opinion). Retrieved 11 January 2021.
  7. 7.0 7.1 7.2 "DC Kangpokpi District, Government of Manipur - District Profile". dckpidistrict.gov.in. Archived from the original on 12 జనవరి 2021. Retrieved 11 January 2021.

ఇతర లంకెలు మార్చు