జాతీయ రహదారి 2

(జాతీయ రహదారి 2 (భారతదేశం) నుండి దారిమార్పు చెందింది)

జాతీయ రహదారి 2 భారతదేశంలోని జాతీయ రహదారి. ఇది అస్సాంలోని దిబ్రూగఢ్ నుండి మిజోరం లోని తుపాంగ్ వరకు నడుస్తుంది.[1] ఈ జాతీయ రహదారి అస్సాం, నాగాలాండ్, మణిపూర్, మిజోరం రాష్ట్రాల గుండా వెళుతుంది. దీని పొడవు 1,325.6 కిమీ (823.7 మై).[2] జాతీయ రహదారుల సంఖ్యను మార్చడానికి ముందు, NH-2 కు పాత జాతీయ రహదారులు 37, 61, 39, 150, 54 ఇలా అనేక సంఖ్యలు ఉండేవి.[3]

Indian National Highway 2
2
National Highway 2
పటం
ఎరుపు రంగులో జాతీయ రహదారి 2
Namdang stone bridge.JPG
ఎన్‌హెచ్ 2, 1703 లో నిర్మించిన నమ్‌దాంగ్ రాతి వంతెనపై గుండా పోతుంది
మార్గ సమాచారం
Part of AH1 AH2
నిర్వహిస్తున్న సంస్థ ఎన్‌హెచ్‌ఏఐ
పొడవు1,325.6 కి.మీ. (823.7 మై.)
ముఖ్యమైన కూడళ్ళు
ఉత్తర చివర ఎన్‌హెచ్ 15 in Dibrugarh
Major intersections
దక్షిణ చివరతుయ్‌పాంగ్
ప్రదేశము
దేశంభారతదేశం
రాష్ట్రాలుఅసోం, నాగాలాండ్, మణిపూర్, మిజోరం
ప్రాథమిక గమ్యస్థానాలుశివసాగర్, ఝాంజి, అంగురి, మోకోక్‌చంగ్, వోఖా, కొహిమా, ఇంఫాల్, చురచంద్‌పూర్, సాసారం, సెలింగ్, సెర్‌చిప్, లాంట్‌లాయ్
రహదారి వ్యవస్థ
ఎన్‌హెచ్ 701A ఎన్‌హెచ్ 102

మార్గం వివరణ

మార్చు

ఎన్‌హెచ్2 దిబ్రూగఢ్, శివసాగర్, అమ్గురి, మోకోక్‌చుంగ్, వోఖా, కోహిమా, ఇంఫాల్, చురచంద్‌పూర్, సెలింగ్, సెర్చిప్, లాంగ్ట్‌లై, తుపాంగ్‌ల గుండా వెళ్తుంది

రహదారి కూడళ్ళు

మార్చు
  ఎన్‌హెచ్ 15 దిబ్రూగఢ్ వద్ద మొదలు[4]
  ఎన్‌హెచ్ 215 మోరన్‌హాట్ వద్ద
  ఎన్‌హెచ్ 702C శివసాగర్ వద్ద
  ఎన్‌హెచ్ 715 ఝాంజీ వద్ద.
  ఎన్‌హెచ్ 702 చంటోంగియా వద్ద.
  ఎన్‌హెచ్ 702D మోకోక్‌చంగ్ వద్ద.
  ఎన్‌హెచ్ 202 మోకోక్‌చంగ్ వద్ద
  ఎన్‌హెచ్ 702A మోకోక్‌చంగ్ వద్ద
  ఎన్‌హెచ్ 29 కొహిమా వద్ద
  ఎన్‌హెచ్ 102A తడూబీ వద్ద
  ఎన్‌హెచ్ 129A మారాం వద్ద
  ఎన్‌హెచ్ 202 ఇంఫాల్ వద్ద
  ఎన్‌హెచ్ 102 ఇంఫాల్ వద్ద
  ఎన్‌హెచ్ 37 ఇంఫాల్ వద్ద
  ఎన్‌హెచ్ 137A ఇంఫాల్ వద్ద
  ఎన్‌హెచ్ 102B చురచంద్‌పూర్ వద్ద
  ఎన్‌హెచ్ 306A వెర్టెక్ వద్ద
  ఎన్‌హెచ్ 6 సెలింగ్ వద్ద
  ఎన్‌హెచ్ 302 తెరియట్ వద్ద
  ఎన్‌హెచ్ 502A లాంట్‌లాయ్ వద్ద
  ఎన్‌హెచ్ 502 వీనస్ సాడిల్ వద్ద

రహదారి సంఖ్యలు మార్చడానికి ముందు

మార్చు
 
పాత ఎన్‌హెచ్ 2

జాతీయ రహదారుల సంఖ్యలను మార్చడానికి ముందు ఇది ఢిల్లీ నుండి కోల్‌కతా వరకు హర్యానా, ఉత్తర ప్రదేశ్, బీహార్ రాష్ట్రాల గుండా వెళ్ళేది.

ఈ మార్గంలో ఫరీదాబాద్, మథుర, ఆగ్రా, కాన్పూర్, అలహాబాదు, వారణాసి, ముఘల్ సరాయ్, ఔరంగాబాద్, ధన్‌బాద్, అసన్‌సోల్, దుర్గాపూర్, మొదలైన చారిత్రక పట్టణాల గుండా సాగేది.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Rationalization of Numbering Systems of National Highways" (PDF). Govt of India. 28 April 2010. Retrieved 21 Aug 2011.
  2. "State-wise length of National Highways (NH) in India". Ministry of Road Transport and Highways. Retrieved 4 May 2019.
  3. "New Numbering of National Highways notification - Government of India" (PDF). The Gazette of India. Retrieved 4 May 2019.
  4. "State-wise length of National Highways (NH) in India". Ministry of Road Transport and Highways. Retrieved 4 May 2019.