కాకతీయ జంతు ప్రదర్శనశాల

(కాకతీయ జూ పార్క్ నుండి దారిమార్పు చెందింది)

కాకతీయ జంతు ప్రదర్శనశాల భారతదేశం లోని తెలంగాణ రాష్ట్రంలోని హన్మకొండ జిల్లా, హనుమకొండలో ఉంది.[1] ఈ జంతు ప్రదర్శన శాల 50 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. దీనిని 2010 లో "సెంట్రల్ జూ అథారిటీ ఆఫ్ ఇండియా" జాతీయ జంతుప్రదర్శన శాలగా మార్చింది. ఇది 2013 నుండి సెంట్రల్ అథారిటీ ఆఫ్ ఇండియా అమలులోకి తెచ్చింది.[2] ఈ పార్కు అతి అందమైన సీతాకోక చిలుకల పార్కు. కాకతీయ జూ పార్క్ వరంగల్ పట్టణ జిల్లా,హనుమకొండ మండలం హనుమకొండ పట్టణంలోని హంటర్ రోడ్‌లో ఉంది.దీనిని వరంగల్ వన విజ్ఞాన కేంద్రం అని కూడా అంటారు.

వరంగల్ జంతు ప్రదర్శనశాల
సింహం, కాకతీయా జూలాజికల్ పార్కు, వరంగల్
ప్రారంభించిన తేదీ1985
ప్రదేశమువరంగల్, తెలంగాణ, భారత దేశము
విస్తీర్ణము50 acres
Membershipsసెంట్రల్ అథారిటీ ఆఫ్ ఇండియా

విశేషాలు

మార్చు

సామాన్య ప్రజానీకానికి వన్యసంరక్షణ గురించి తెలపడానికి ఈ కాకతీయ జూ పార్క్ ఏర్పాటు చేయబడింది. తెలంగాణ అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ జూ పార్క్ లో వివిధ రకాల జంతువులతో పాటు చాలా మొక్కలను కూడా పెంచుతున్నారు. ఈ పార్కు దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇందులో జింకలు, లేళ్లు, దుప్పులు, కోతులు, ఎలుగుబంట్లు మొదలగు జంతువులు; చిలుకలు, పావురాలు, నిప్పుకోళ్లు, నెమళ్లు వంటి పలురకాల పక్షులు; తాబేళ్లు, మొసళ్ల వంటి సరీసృపాలు సంరక్షించబడుతున్నాయి. ఈ పార్కులో వన్య సంరక్షణ గురించి పర్యాటకులకు తెలిజేసేందుకు అధికారుల పర్యవేక్షణలో నిర్వహిస్తున్న ప్రత్యేక కేంద్రాలు కూడా ఉన్నాయి. ఈ పార్కును ప్రతి రోజు సుమారు 500 మంది పర్యాటకులు సందర్శిస్తుంటారు.

మూలాలు

మార్చు
  1. "Warangal zoo to become National Park - The New Indian Express". Archived from the original on 2014-09-07. Retrieved 2014-10-06.
  2. "Warangal zoo to become National Park". Archived from the original on 2014-02-22. Retrieved 2014-10-06.

వెలుపలి లంకెలు

మార్చు

మూస:వరంగల్లు పట్టణ జిల్లా విషయాలు