హనుమకొండ

తెలంగాణ రాష్ట్రంలోని హన్మకొండ జిల్లా, హన్మకొండ మండలానికి చెందిన నగరం

హన్మకొండ లేదా హనుమకొండ, తెలంగాణ రాష్ట్రంలోని హన్మకొండ జిల్లా, హన్మకొండ మండలానికి చెందిన నగరం.[1] 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత వరంగల్ జిల్లాలో, ఇదే మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటు చేసిన వరంగల్ గ్రామీణ జిల్లా లోకి చేర్చారు. [2][3] ఆ తరువాత 2021 లో, వరంగల్ పట్టణ జిల్లా స్థానంలో హనుమకొండ జిల్లాను ఏర్పాటు చేసినపుడు ఈ గ్రామం, మండలంతో పాటు కొత్త జిల్లాలో భాగమైంది.[3]

హన్మకొండ
వరంగల్ పరిసరాలు
హన్మకొండ విహంగ వీక్షణం
హన్మకొండ విహంగ వీక్షణం
హన్మకొండ is located in Telangana
హన్మకొండ
హన్మకొండ
తెలంగాణలో హన్మకొండ స్థానం, భారతదేశం
హన్మకొండ is located in India
హన్మకొండ
హన్మకొండ
హన్మకొండ (India)
నిర్దేశాంకాలు: 18°01′00″N 79°38′00″E / 18.0167°N 79.6333°E / 18.0167; 79.6333Coordinates: 18°01′00″N 79°38′00″E / 18.0167°N 79.6333°E / 18.0167; 79.6333
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహన్మకొండ
నగరంహన్మకొండ
ప్రభుత్వం
 • ప్రభుత్వ రకంనగరపాలక సంస్థ
భాష
 • అధికారతెలుగు
కాలమానంUTC+5:30 (IST)
పిన్‌కోడ్
506002
ప్రాంతీయ ఫోన్ కోడ్+91–870]]
భారత వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్లుTS–03
హన్మకొండ ఒక జైన మత క్షేత్రంగా వర్ధిల్లింది

గణాంకాలుసవరించు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం పట్టణ జనాభా - మొత్తం 4,27,303 - పురుషులు 2,14,814 - స్త్రీలు 2,12,489

గ్రామ చరిత్రసవరించు

చారిత్రక ప్రశస్తి కలిగిన ఈ గ్రామానికి అనుముకొండ అనే పేరు ఉండేది. కాలక్రమంలో అది హనుమకొండగా మారింది. కాకతీయ సామ్రాజ్యం ఏర్పడక ముందు హనుమకొండ రాజధానిగా చేసుకొని పోరంకి పుంతలాదేవి పాలించారు.సైన్యాధ్యక్షుడుగా పోరంకి అంకమరాజు పనిచేశాడు.వీరి ఖడ్గం ఈనాటికీ హైదరాబాద్ సాలార్జంగ్ మ్యూజియంలో భద్రంగా ఉంది.పూర్వకాలంలో ఈ ప్రాంతం జైన మత క్షేత్రంగా వర్ధిల్లింది. కాకతీయుల కాలంలో హన్మకొండ ఒక ప్రధాన కేంద్రంగా భాసిల్లింది. ఇది కాకతీయుల ఏలుబడిలో మొదటి తాత్కాలిక రాజధానిగా కొంతకాలం ఇక్కడి నుండే పరిపాలన సాగించారు. ఇక్కడ ఎంతో విశిష్టత కలిగిన వేయి స్తంభాల గుడి, పద్మాక్షి దేవాలయం, సిద్ధేశ్వర ఆలయం, సిద్ధి భైరవ దేవాలయం ఉన్నాయి.[4]

హన్మకొండ పట్టణం అయినప్పటికీ బతుకమ్మ, దసరా విషయంలో మాత్రం పల్లెలకంటే గొప్పగా పండుగలను జరుపుకుంటారు.

కేసీఆర్‌ భవన్‌సవరించు

హనుమకొండ పట్టణంలోని శాయంపేట క్రాస్‌రోడ్డు వద్ద మడివేలు మాచీదేవుడు కల్చరల్‌ ఎడ్యుకేషన్‌ సోషల్‌ కాంప్లెక్స్‌ (కేసీఆర్‌ భవన్‌) నిర్మించబడుతోంది. ఈ భవన్‌ మొదటి అంతస్తు నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం 2018లో 1.95 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. పైఅంతస్తు కోసం అదనంగా 1.30 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ప్రతిపాదనలను అందజేయగా, వాటిని పరిశీలించిన ప్రభుత్వం స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ రెండోదఫాగా 1.30 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. ఈ మేరకు 2023 జనవరి 11న ఉత్తర్వులు జారీ అయ్యాయి.[5]

గ్రామ ప్రముఖులుసవరించు

మూలాలుసవరించు

  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2017-11-18. Retrieved 2018-01-23.
  2. "వరంగల్ గ్రామీణ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
  3. 3.0 3.1 G.O.Ms.No. 74, Revenue (DA-CMRF) Department, Dated: 12-08-2021.
  4. నమస్తే తెలంగాణ, బతుకమ్మ, ఆదివారం సంచిక (9 September 2018). "సిద్ధులగుట్ట సిద్ధ భైరవ ఆలయం". అరవింద్ ఆర్య పకిడే. Archived from the original on 13 September 2018. Retrieved 13 September 2018.
  5. telugu, NT News (2023-01-12). "కేసీఆర్‌ భవన్‌కు రూ.1.30 కోట్లు". www.ntnews.com. Archived from the original on 2023-01-17. Retrieved 2023-01-17.
  6. Andhrajyothy (23 May 2021). "ఉప'కుల'పతులు". www.andhrajyothy.com. Archived from the original on 28 May 2021. Retrieved 28 May 2021.

వెలుపలి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=హనుమకొండ&oldid=3806298" నుండి వెలికితీశారు