కాక్సీనియా (లాటిన్ Coccinia) పుష్పించే మొక్కలలో ఒక ప్రజాతి. వీనిలో ముఖ్యమైనది దొండ కాయ. కాక్సీనియా పంట తేమ ,వెచ్చని వాతావరణ పరిస్థితులలో పెరుగుతుంది. 20 ° C నుండి 32 ° C వరకు ఉష్ణోగ్రత పరిధి దాని పెరుగుదల, నాణ్యత , దిగుబడికి ఉత్తమమైనది. ఈ కూరగాయను ఏడాది పొడవునా సాగు చేయవచ్చు.

కాక్సీనియా
Coccinia grandis
Scientific classification
Kingdom:
Division:
Class:
Order:
Family:
Subfamily:
Tribe:
Subtribe:
Genus:
కాక్సీనియా

జాతులు
Synonyms
కాక్సినియా
దొండ మొక్క
కాక్సినియా
దొండకాయలు

చరిత్ర

మార్చు

దొండ కాయను కాక్సీనియా పంట వేసే సమయం వర్షాకాలం,వేసవి కాలం ( జూన్,జులై ఫిబ్రవరి,మార్చ్ ) . కాక్సీనియా మొక్క ( దొండ కాయ ) పంట వేయడానికి ఇసుక నేలలు, నీటిని త క్కువ నిల్వ చేసే నేల ను మంచివి. 6.0 - 6.5 యొక్క నేల pH కూరగాయల యొక్క మంచి దిగుబడి నాణ్యత మైన పంట వస్తుంది. కాక్సీనియా మొక్కలు వేసిన తర్వాత 3 నెలల వ్యవధి లో పంట రావటం జరుగుతుంది. కాక్సీనియా ఒక మొక్క సుమారు 5 కిలోల దొండకాయలను ఇస్తుంది. మెరుగైన వ్యవసాయ పద్ధతులతో హెక్టారుకు సగటున 12 నుండి 15 టన్నుల దొండ కాయల దిగుబడి పొందవచ్చు [1] దొండ కాయలను పంట వేయడమే కాకుండా ఇళ్ళలో కూడా పెంచ వచ్చును.కాక్సీనియా పంటను భారతదేశంలో దక్షిణ, తూర్పు ,పశ్చిమ ప్రాంతాలలో విస్తృతంగా పండిస్తారు.కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ఈ పంటను వేస్తారు. [2]

ఉపయోగములు

మార్చు

దొండ కాయ ఉత్పత్తి ఆహారమునకే గాక మందులలో ఉపయోగిస్తారు .దొండ కాయలు నారింజ-ఎరుపు తో ఉండటం వలన శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ ప్రభావాలను కలిగి ఉంటుంది. వీటిలో వుండే సపోనిన్లు, ఫ్లేవనాయిడ్లు ,టెర్పెనాయిడ్లు వంటి ఫైటోన్యూట్రియెంట్స్ ఉన్నాయి. ఇవి గుండె,క్యాన్సర్, మధుమేహం , వంటి వ్యాదుల మందులలో వాడతారు [3] [4]

మూలాలు

మార్చు
  1. "ICAR-CCARI". agrigoaexpert.res.in. Archived from the original on 2020-08-06. Retrieved 2020-08-16.
  2. "Ivy Gourd Farming (Tindora Farming) | UserSpecial" (in ఇంగ్లీష్). Archived from the original on 2020-09-27. Retrieved 2020-08-16.
  3. "Can Ivy Gourd Treat Diabetes and High Cholesterol?". Verywell Health (in ఇంగ్లీష్). Retrieved 2020-08-27.
  4. "A Compendious Write-Up on Coccinia grandis" (PDF). globalresearchonline.net/. 2019-02-01. Retrieved 2020-08-27.{{cite web}}: CS1 maint: url-status (link)