కుకుర్బిటేసి
మొక్కల కుటుంబం
కుకుర్బిటేసి (ఆంగ్లం: Cucurbitaceae) కుటుంబంలో దాదాపు 110 ప్రజాతులు, 840 జాతులు ఉన్నాయి. ఈ మొక్కలు ఎక్కువగా ఉష్ణమండల ప్రాంతాలలో ఉన్నాయి.
కుకుర్బిటేసి | |
---|---|
Hodgsonia male plant | |
Scientific classification | |
Kingdom: | |
Division: | |
Class: | |
Order: | |
Family: | కుకుర్బిటేసి |
కుటుంబ లక్షణాలు
మార్చు- నులితీగెలతో ఎగబ్రాకే మొక్కలు.
- లఘు పత్రాలు, హస్తాకార జాలాకార ఈనెల వ్యాపనము.
- పత్రగ్రీవంలో ఏర్పడే ఏకలింగపుష్పాలు.
- అండకోశోపరిక, సౌష్టవయుత, పంచభాగయుత పుష్పాలు.
- ఆకర్షణ పత్రాలు 5, సంయుక్తము.
- కేసరాలు 5, సంయోజకము, పరాగకోశాలు మెలితిరిగి 'S' ఆకారంలో ఉంటాయి.
- అండాశయము నిమ్నము, త్రిఫలదళయుతము, కుడ్య అండాన్యాసము.
- పెపో ఫలము.
ముఖ్యమైన మొక్కలు
మార్చు- బ్రయోనాప్సిస్ (Bryonopsis) : బ్రయోనాప్సిస్ లాసినియోస - లింగపొట్ల
- కుకుమిస్ (Cucumis) :
- కుకుమిస్ మెలో : కరుబూజా, నక్క దోసకాయలు
- కుకుమిస్ సటైవస్ : కీరా దోసకాయ
- కుకుర్బిట (Cucurbita) : కుకుర్బిట మాక్సిమా : తియ్య గుమ్మడి
- కాక్సినియా Coccinia) : కాక్సినియా కార్డిఫోలియా : దొండ
- మొమోర్డికా (Momordica) :
- ట్రైకోసాంథిస్ (Trichosanthes) :
- ట్రైకోసాంథిస్ అంగ్విన : (పొట్ల)
- ట్రైకోసాంథిస్ డయోక : పొటల్స్
- లాజినేరియా (Lagenaria) : లాజినేరియా వల్గారిస్ : (సొర లేదా ఆనప)
- లుఫ (Luffa) :
- సిట్రుల్లస్ (Citrullus) : సిట్రుల్లస్ వల్గారిస్ : పుచ్చ, వెర్రి పుచ్చ
- సిషియం (Sechium) : సిషియం ఎడులె : బెంగుళూరు వంకాయ
- బూడిదగుమ్మడి
మూలాలు
మార్చు- బి.ఆర్.సి.మూర్తి: వృక్షశాస్త్రము, శ్రీ వికాస్ పబ్లికేషన్స్, 2005.