భక్తాపూర్
భక్తాపూర్ (నేపాలీ: भक्तपुर) నేపాల్ లోని పురాతన నగరం, పర్యాటక ప్రదేశం. ఇది నేపాల్ రాజధాని ఖాట్మండు నుండి 13 కి.మీ.ల దూరంలో ఉంది. దీనిని 'భడ్‌గావ్' అని కూడా అంటారు. ఈ నగరం ఖాట్మండు లోయలోని మూడు నగరాలలో అత్యంత సాంస్కృతిక సంపదకు ప్రసిద్ధి చెందింది. భక్తపూర్ ప్యాలెస్ ప్రపంచ వారసత్వ జాబితాలో ఉంది.[1]
భక్తాపూర్
भक्तपुर | |
---|---|
నగరం | |
Coordinates: 27°40′20″N 85°25′40″E / 27.67222°N 85.42778°E | |
దేశం | నేపాల్ |
ప్రావిన్స్ | బాగమతి ప్రావిన్స్ |
జిల్లా | భక్తాపూర్ |
Government | |
• మేయర్ | సునీల్ ప్రజాపతి (ఎన్ డబ్ల్యుపిపి) |
• డిప్యూటీ మేయర్ | రజని జోషి (ఎన్ డబ్ల్యుపిపి) |
విస్తీర్ణం | |
• Total | 16.89 కి.మీ2 (6.52 చ. మై) |
జనాభా (2011) | |
• Total | 81,728 |
• జనసాంద్రత | 4,800/కి.మీ2 (13,000/చ. మై.) |
• మతం | హిందూ బౌద్ధం |
Time zone | UTC+05:45 (నేపాల్ ప్రామాణిక సమయం (ఎన్.ఎస్.టి)) |
పిన్‌కోడ్ | 44800 |
ప్రాంతపు కోడ్ | 01 |
చరిత్ర
మార్చుసా.శ.15 శతాబ్దం చివరలో, నెవార్ మల్లార్ రాజ్యానికి భక్తాపూర్ రాజధానిగా ఉంది. 1767లో మల్లార్ రాజవంశానికి చెందిన జయప్రకాష్ మల్లా, గూర్ఖా రాజ్యం రాజు పృథ్వీ నారాయణన్ షా మధ్య కీర్తిపూర్ యుద్ధంలో భక్తాపూర్ రాజు జయప్రకాష్ మల్లా ఓడిపోయాడు. ఖాట్మండు లోయలోని మూడు ప్రధాన నగరాలు ఖాట్మండు, లలిత్‌పూర్, భక్తాపూర్, వాటి పక్కనే ఉన్న గ్రామీణ ప్రాంతాలు గూర్ఖా రాజు పృథ్వీ నారాయణన్ షా పాలనలోకి వచ్చాయి.[2]
జనాభా
మార్చు2011 నేపాల్ జనాభా లెక్కల ప్రకారం, భక్తపూర్ నగరంలో 83,658 జనాభా ఉంది.[3] ఈ నగరంలో ఎక్కువ మంది ప్రజలు నెవార్ ప్రజలు, ఇక్కడ నెవారి భాష, నేపాలీ భాష ఎక్కువగా మాట్లాడతారు. జనాభాలో ఎక్కువ మంది హిందువులు, బౌద్ధులు ఉన్నారు. భక్తపూర్ లో పురాతన నేపాల్ సంస్కృతి, వాస్తుశిల్పం, చారిత్రక కట్టడాలు, కళాఖండాలు, కుండలు, అల్లికలు, దేవాలయాలు, కొలనులు, మతపరమైన పండుగలను చూడడానికి విదేశీ పర్యాటకులు ఎక్కువగా వస్తారు.
పర్యాటక ప్రదేశాలు
మార్చుభక్తపూర్ అర్బన్ స్క్వేర్
మార్చుపురాతన నగరం భక్తపూర్‌లో భక్తపూర్ అర్బన్ స్క్వేర్, దౌమతి స్క్వేర్, దత్తాత్రేయ స్క్వేర్, కుమ్మరి చతురస్రం అనే నాలుగు చతురస్రాలు ఉన్నాయి. ఖాట్మండు లోయలో, భక్తపూర్ అర్బన్ స్క్వేర్ ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణ. ఖాట్మండులో ఉన్న నాలుగు ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో ఇది ఒకటి.[4] భక్తపూర్ ప్యాలెస్, 1427లో మల్లా రాజవంశానికి చెందిన రాజు యత్స మల్లార్ చేత నిర్మించబడింది, అందమైన చెక్కతో 55 చెక్క కిటికీలు ఉన్నాయి. రాజా రంజిత్ మల్లార్ చేత నిర్మించబడిన భక్తపూర్ ప్యాలెస్ బంగారు తలుపులు కాళి, గరుడ, ఇతర దేవతల చిత్రాలతో చెక్కబడి ఉన్నాయి. భక్తపూర్ రాజు రాజభవనానికి కుడివైపున పశుపతినాథ్ ఆలయం ఉంది.
నయతపోల దేవాలయం
మార్చునయతపోల బౌద్ధ దేవాలయం భక్తపూర్ నగరంలోని తవమతి స్క్వేర్‌లో ఐదు అంచెల పగోడా శైలిలో నిర్మించబడింది. ఈ ఆలయాన్ని నేపాలీ రాజు భూపతింద్ర మల్లా (1701-1702) 5 మాసాల్లో నిర్మించాడు. ఇది తాంత్రిక దేవత అయిన సిద్ధి లక్ష్మి ఆలయం.[5]
భైరవనాథ దేవాలయం
మార్చుభక్తపూర్లోని భైరవనాథ ఆలయానికి మూడు అంచెల గోపురం ఉంది. దీనిని మల్లా రాజవంశ రాజు జగత్ జ్యోతి మల్లార్ నిర్మించాడు.
దత్తాత్రేయ దేవాలయం
మార్చుఇది శివుని అంశ అయిన దత్తాత్రేయ ఆలయం, ఈ ఆలయానికి మూడు అంచెల గోపురం, యాభై నాలుగు చెక్క కిటికీలు, విస్తృతమైన శిల్పాలు ఉన్నాయి. దీనిని మల్లా రాజవంశానికి చెందిన యక్ష మల్లార్ (సా.శ. 1428 - 1482) నిర్మించాడు.
చంగు నారాయణ్ ఆలయం
మార్చుచంగు నారాయణ్ ఆలయం ఒక పురాతన హిందూ దేవాలయం. ఇది ఖాట్మండు లోయలోని చంగు నారాయణ గ్రామానికి తూర్పు వైపున ఉన్న కొండమీద ఉంది. విష్ణువుకు అంకితం చేయబడిన చంగు నారాయణ్ ఆలయం భక్తాపూర్‌కు ఉత్తరాన ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయాన్ని సా.శ. 4వ శతాబ్దంలో నిర్మించారు. ఈ ఆలయం నేపాల్‌లోని తొమ్మిది ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో ఒకటి.[6] [7]
కైలాష్‌నాథ్ మహాదేవ్ విగ్రహం
మార్చుకైలాసనాథ్ మహాదేవ్ శివుని విగ్రహం ప్రపంచంలోనే ఎత్తైంది. ఈ విగ్రహం ఎత్తు 143 అడుగులు. ఇది నేపాల్‌లోని ఖాట్మండు నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. విగ్రహాల నిర్మాణ పనులు 2004లో ప్రారంభించి 2012లో పూర్తిచేశారు. విగ్రహ ప్రతిష్ఠాపన 2012 జూన్ 21న జరిగింది. ఈ విగ్రహం ప్రపంచంలోని ఎత్తులో ఉన్న అన్ని విగ్రహాల జాబితాలో 32వ స్థానంలో ఉంది. దీన్ని రాగి, సిమెంట్, జింక్, ఉక్కుతో తయారు చేసారు.
భూకంపాలు
మార్చు1934 భూకంపం వల్ల భక్తాపూర్ అర్బన్ స్క్వేర్ దెబ్బతింది. 1934 భూకంపానికి ముందు మూడు బ్లాకులతో దేవాలయాలు ఉండేవి. 1934 భూకంపం సమయంలో 99 గేట్లతో ఉన్న భక్తపూర్ ప్యాలెస్ 6 గేట్లతో మాత్రమే మిగిలివుంది.
2015 ఏప్రిల్ 25 ఉదయం 11.56 గంటలకు వచ్చిన భూకంపం రిక్టర్ స్కేల్ మీద 7.8 ఉంది. భక్తపూర్ నగరంలోని పురాతన దేవాలయాలు, రాజభవనాలు, స్మారక చిహ్నాలు భారీగా దెబ్బతిన్నాయి. ప్రపంచ వారసత్వ ప్రదేశం అయిన భక్తాపూర్ అర్బన్ స్క్వేర్ బాగా పాడయింది. 2015 లో వచ్చిన భూకంపం కారణంగా నగరంలోని 116 వారసత్వ సంపదలు పాడయ్యాయి. వాటిలో 67 పూర్తిగా పాడవ్వగా 49 పాక్షికంగా పాడయ్యాయి. భూకంపం యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చబడిన భక్తపూర్ దర్బార్ స్క్వేర్‌ను తీవ్రంగా దెబ్బతీసింది. ఈ విపత్తులో తలేజు దేవాలయం ప్రధాన ప్రాంగణం పాడయ్యింది.[8][9]
చిత్రమాలిక
మార్చు-
భక్తపూర్ వీధి
-
రాత్రుల్లో భక్తపూర్ నగరం
-
దర్బార్ స్క్వేర్
-
భక్తపూర్ దర్బార్ వద్ద రాజు భూపతింద్ర మల్లా విగ్రహం
-
నెమలి కిటికీ
-
తౌమధి స్క్వేర్లోని నయతపోల ఆలయం
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "Bhaktapur | Nepal | Britannica". britannica.com. Retrieved 2021-12-05.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ Shrestha, Nirsara; Shrestha, Sangeeta; Khadka, Deepak; Shrestha, Arjun; Suwal, Barsha; Sharma, Samata; Shrestha, Rajan (2020-06-18). "Clinical and epidemiological study in patients with glaucoma in tertiary eye center, Bhaktapur". dx.doi.org. Retrieved 2021-12-05.
- ↑ "Nepal: Municipal Division (Districts and Local Units) - Population Statistics, Charts and Map". www.citypopulation.de. Retrieved 2021-12-05.
- ↑ my experience with the world heritage sites of Kathmandu Valley. Vajra Publications in association with Eco Himal. ISBN 9937-506-01-8. OCLC 220423271.
- ↑ www.thelongestwayhome.com. "Guide to the Nyatapola Temple, Bhaktapur, Nepal". www.thelongestwayhome.com. Retrieved 2021-12-05.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ UNESCO. Oxford Music Online. Oxford University Press. 2001.
- ↑ "Introducing Changu Narayan Temple". www.lonelyplanet.com. Retrieved 2021-12-05.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Nepal's Kathmandu valley treasures: Before and after". BBC News. 2015-04-27. Retrieved 2021-12-05.
- ↑ "Nepal earthquake 2015". AccessScience. Retrieved 2021-12-05.
{{cite web}}
: CS1 maint: url-status (link)