కాపర్(I) ఫ్లోరైడ్

కాపర్ (I) ఫ్లోరైడ్ ఒక రసాయన సమ్మేళనం.ఇది ఒక అకర్బన రసాయన సంయోగ పదార్థం.రాగి, ఫ్లోరిన్ మూలక పరమాణు వుల సంయోగం వలన ఏర్పడిన రసాయన పదార్థం.ఈ కాపర్ (I) ఫ్లోరైడ్ యొక్క రసాయన సంకేత పదం CuF. 1933 లో స్పెలేరైట్ రకపు స్పటిక అణునిర్మాణం కలిగి ఉన్నదని తెలియచెయ్యడం జరిగినది[2] .ఈ సమ్మేళన పదార్థంలో ఉన్నటువంటి ఫ్లోరిన్ ఋనాత్మకవిద్యుత్వత్వం కలిగి ఉన్నందున, ఇది రాగిని ఎల్లప్పుడూ +2 ఆక్సీకరణ స్థితిలోనే ఆక్సికరిస్తుంది.[3] ఫ్లోరైడ్ యొక్క సంక్లిష్ట రూప పదార్థాలైన [(Ph3P) 3CuF] వంటి వాటిని గుర్తించి, వాటి లక్షణాలను కూడా విశ్లేషణ చేసారు.

కాపర్(I) ఫ్లోరైడ్
Unit cell, ball and stick model of copper(I) fluoride
పేర్లు
IUPAC నామము
Copper(I) fluoride
Systematic IUPAC name
Fluorocopper[1]
ఇతర పేర్లు
Cuprous fluoride
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [13478-41-6]
పబ్ కెమ్ 3084153
SMILES F[Cu]
ధర్మములు
CuF
మోలార్ ద్రవ్యరాశి 82.54 g·mol−1
సాంద్రత 7.1 g cm−3
నిర్మాణం
స్ఫటిక నిర్మాణం
sphalerite
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
☒N verify (what is checkY☒N ?)
Infobox references

ఇతర పేర్లు మార్చు

IUPAC పపేరు ఫ్లోరోకాపర్(fluorocopper).దీనిని సాధారణంగా కుప్రస్ ఫ్లోరైడ్ అనికూడా వ్యవహరిస్తారు.

భౌతిక లక్షణాలు మార్చు

కాపర్ (I) ఫ్లోరైడ్ యొక్క అణుభారం 82.54 గ్రాములు/మోల్.25°Cవద్ద ఈ సమ్మేళన పదార్థం యొక్క సాంద్రత 7.1 గ్రాములు/సెం.మీ3.

సంశ్లేషణ-చర్యాశీలత మార్చు

కాపర్(II) ఫ్లోరైడ్‌ను క్షయికరించడం ద్వారా కాపర్ (I) ఫ్లోరైడ్‌ను తయారుచెయ్యుదురు. ఏర్పడిన కాపర్(I) ఫ్లోరైడ్‌ను స్థిరీకరించనిచో, సాధారణ వాతావరణంపరిస్థితిలో, కాపర్ (I) క్లోరైడ్‌వలె కాకుండా, కాపర్ (I) ఫ్లోరైడ్ అసమ పాళ్ళలో 1:1 నిష్పత్తిలో కాపర్ (II) ఫ్లోరైడ్,, రాగిగా విఘటనం చెందును.

2CuF → Cu + CuF2

ఈఈరకమైన అసమపాళ్ళ వ్యత్యాసమువలన కాపర్(II) ఫ్లోరైడ్ క్రమంగా క్రయాన్ రంగులోకి మారును.

ఇవికూ డా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. "Copper Monofluoride - PubChem Public Chemical Database". The PubChem Project. USA: National Center for Biotechnology Information.
  2. Ebert, F.; Woitinek, H. (1933). "Kristallstrukturen von Fluoriden. II. HgF, HgF2, CuF und CuF2". Z. anorg. allg. Chem. 210 (3): 269–272. doi:10.1002/zaac.19332100307.
  3. Greenwood, Norman N.; Earnshaw, Alan (1997). Chemistry of the Elements (2nd ed.). Butterworth-Heinemann. pp. 1183–1185. ISBN 0080379419.