కామన్‌వెల్త్ క్రీడలు

కామన్‌వెల్త్ క్రీడలు నాలుగేళ్ళకు ఒకసారి జరిగే అంతర్జాతీయ క్రీడా పోటీలు.[a] ఇవి కామన్‌వెల్త్ దేశాల మధ్య జరుగుతాయి. ఇవి మొదటిసారిగా 1930 లో జరిగాయి. 1942, 1946 లో రెండవ ప్రపంచ యుద్ధం కారణంగా జరగకపోవడం తప్పిస్తే అప్పటి నుండి ప్రతి నాలుగేళ్ళకు ఒకసారి ఖచ్చితంగా నిర్వహించబడుతూ వస్తున్నాయి.

1930 నుంచి 1950 దాకా వీటిని బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్ అని పిలిచే వారు. 1954 నుంచి 1966 మధ్యలో బ్రిటిష్ ఎంపైర్ అండ్ కామన్‌వెల్త్ గేమ్స్ అని పిలిచే వారు. 1970 నుంచి 1974 మధ్యలో బ్రిటిష్ కామన్‌వెల్త్ గేమ్స్ అని పిలిచారు. తర్వాత ఇప్పుడున్న పేరు స్థిరపడింది. 2002 నుంచి అంగ వికలురు కోసం కూడా పోటీలు చేర్చారు. అలా ఇది అందరినీ కులుపుకున్న మొదటి ప్రపంచ ఆటలపోటీగా నిలిచింది.[5] 2018 లో ఈ పోటీలలో మహిళలకు పురుషులతో సమానంగా పోటీలు జరిగాయి. నాలుగేళ్ళ తర్వాత పురుషుల కంటే మహిళలకే ఎక్కువ విభాగాల్లో పోటోలు జరిగిన మొదటి అంతర్జాతీయ ఆటల పోటీలుగా పేరు గాంచాయి.[6]

ఇప్పటిదాకా ఈ క్రీడలను తొమ్మిది దేశాలకు (ఇంగ్లండ్, వేల్స్, స్కాట్లాండు ను వేర్వేరు దేశాలుగా పరిగణించి) చెందిన 20 నగరాలలో నిర్వహించారు. అన్నింటికన్నా ఎక్కువగా ఆస్ట్రేలియా ఐదు సార్లు (1938, 1962, 1982, 2006, 2018) నిర్వహించింది. ఆక్లాండ్ (1950, 1990), ఎడిన్‌బర్గ్ (1970, 1986) నగరాలు ఒకసారి కన్నా ఎక్కువ సార్లు ఈ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చాయి.

గమనికలు

మార్చు
  1. which also refers itself as the Friendly Games[1][2] or simply the Comm Games.[3][4]

మూలాలు

మార్చు
  1. "History of the Games". Gold Coast 2018 Commonwealth Games. Archived from the original on 14 December 2021. Retrieved 14 December 2021.
  2. Keating, Steve (2022-07-31). "'Friendly Games' have an edge when India play Pakistan at cricket". Reuters (in ఇంగ్లీష్). Retrieved 2023-04-17.
  3. "Comm Games Chairman Peter Beattie Apologies For Closing Ceremony Blunder". Triple M (in ఇంగ్లీష్). Retrieved 2022-12-07.
  4. Allan, Steve. "COMM GAMES UNDERWAY FOR COAST ATHLETES | NBN News" (in ఆస్ట్రేలియన్ ఇంగ్లీష్). Retrieved 2022-12-07.
  5. "Para-Sports at the Commonwealth Games". Commonwealth Sport (in ఇంగ్లీష్). Retrieved 2023-05-20.
  6. "Gender Equality | Commonwealth Games Federation". thecgf.com (in ఇంగ్లీష్). Archived from the original on 9 March 2023. Retrieved 29 January 2020.