కామన ప్రభాకరరావు
కామన ప్రభాకర్ రావు ( Telugu: కామన ప్రభాకర రావు ), భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. కామన ప్రభాకరరావు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరఫున మండపేట శాసనసభ నియోజకవర్గానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. [1]
కామన ప్రభాకర్ రావు | |
---|---|
నియోజకవర్గం | మండపేట శాసనసభనియోజకవర్గం |
వ్యక్తిగత వివరాలు | |
జననం | మండపేట, తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ భారతదేశం | 1962 మే 25
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ |
జీవిత భాగస్వామి | సత్యవాణి |
సంతానం | ఇద్దరు కొడుకులు |
సామాజిక సేవ
మార్చు- ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జీవితకాల సభ్యునిగా ప్రభాకరరావు పనిచేశారు & గోదావరికి భారీ వరదలు వచ్చినప్పుడు 600 మంది గోదావరి వరద బాధితులకు సహాయం చేశారు. నాగార్జున ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్, కాకినాడ అనే వ్యాపార సంస్థను ప్రభాకర్ రావు నడుపుతున్నాడు.
- విద్య, ఆరోగ్యం మహిళా సాధికారత, రక్తదాన శిబిరాలపై పనిచేసే స్వచ్ఛంద సంస్థ, Dr.DNR భవన్ ట్రస్ట్; Dr.DNR భవన్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్‌కు అనుబంధంగా ఉంది), ఇది మండపేటలోని పేద ప్రజలకు ఉచిత కంప్యూటర్ విద్యను అందిస్తుంది.
రాజకీయ జీవితం
మార్చు- కామన ప్రభాకర్ రావు, 1978లో కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగానికి నాయకత్వం వహించారు ఇందిరా గాంధీ, తో కలిసి జనతా పార్టీ ప్రభుత్వంపై విచారణకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు.
- 1993-94 వరకు కామన ప్రభాకర్ రావు ఆలమూరు నియోజకవర్గ విద్యుత్ సలహా కమిటీ చైర్మన్ గా పనిచేశాడు.
- తూర్పుగోదావరి జిల్లా 1993-94 వరకు కాంగ్రెస్ కమిటీ సభ్యుడుగా పనిచేశాడు.
- 1994-99 మండల పరిషత్ ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడుగా పనిచేశాడు.
- 1994-99 ఏడిత నుండి ఎంపీటీసీ సభ్యుడుగా పనిచేశాడు.
- తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ 1993-98 జిల్లా కన్వీనర్ గా పని చేశాడు
- 1986-89 తూర్పుగోదావరి జిల్లా యూత్ కాంగ్రెస్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేశాడు.
- 1990-94 తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ
- 2000-2007 వరకు తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేశాడు.
- 2003 నుంచి 206 వరకు, తూర్పుగోదావరి జిల్లా టెలికాం అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా పనిచేశాడు,
- 2002-2013 వరకు ఆంధ్రప్రదేశ్ పిసిసి సభ్యుడిగా పని చేశాడు.
- 2003-2004 పిఠాపురం నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా పనిచేశాడు.
- 2006లో జరిగిన పెద్దాపురం సామర్లకోట మున్సిపాలిటీలకు ఎన్నికల ఇన్‌ఛార్జ్ .
- 2006 జనవరి నెలలో హైదరాబాద్‌లో జరిగిన ఏఐసీసీ సర్వసభ్య సమావేశానికి రిసెప్షన్ కమిటీ సభ్యుడుగా పనిచేశాడు
- 2009 ఎన్నికల్లో రంపచోడవరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ, అభ్యర్థి విజయంలో కీలక పాత్ర పోషించారు.
రాష్ట్ర విభజనకు అనుకూలం
మార్చుఆంధ్రప్రదేశ్ విభజన అంశంలో పార్టీ ప్రయోజనాలకు విరుద్ధంగా పనిచేస్తున్న ఎంపీలను సస్పెండ్ చేస్తూ ఏఐసీసీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు పీసీసీ కార్యదర్శి కామన ప్రభాకరరావు ఓ ప్రకటనలో తెలిపారు. [2]
- ↑ "'Common man' gets Congress ticket - ANDHRA PRADESH". The Hindu. 2014-04-15. Retrieved 2016-06-18.
- ↑ "'A wrong decision' - ANDHRA PRADESH". The Hindu. 2014-02-12. Retrieved 2016-06-18.