మండపేట

మండపేట డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, మండపేట మండలం లోని పట్టణం

మండపేట (మాండవ్యపురం), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, కోనసీమ జిల్లా, మండపేట మండలానికి చెందిన పట్టణం, మండలకేంద్రం.. ఇది A-గ్రేడ్ పురపాలక సంఘం. ఇది చుట్టుపక్కల గ్రామాలకు వాణిజ్య, వినోద కేంద్రం. బియ్యం మిల్లులకు, ఇతర వ్యవసాయానుబంధ కర్మాగారాలకు ఇది ప్రసిద్ధి.

పట్టణం
Map
నిర్దేశాంకాలు: 16°54′N 81°54′E / 16.9°N 81.9°E / 16.9; 81.9Coordinates: 16°54′N 81°54′E / 16.9°N 81.9°E / 16.9; 81.9
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాడాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా
మండలంమండపేట మండలం
విస్తీర్ణం
 • మొత్తం21.65 km2 (8.36 sq mi)
జనాభా వివరాలు
(2011)[1]
 • మొత్తం56,063
 • సాంద్రత2,600/km2 (6,700/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1033
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( 8855 Edit this on Wikidata )
పిన్(PIN)533308 Edit this on Wikidata
జాలస్థలిEdit this at Wikidata

పేరు వ్యుత్పత్తిసవరించు

మండపేట అనే పేరు మాండవ్యపురం అనే పేరుకి వికృతి. మాండవ్య ముని ఈ ప్రాంతంలో తపస్సు ఆచరించడం వలన దీనికి ఆ పేరు స్థిరపడింది. సతీ సుమతి,గౌతముడు, యగ్నవల్కుడు, అగస్త్యుడు వంటి గొప్ప గొప్ప తపో సంపన్నుల భూమి ఇది. దీనికి నిదర్శనంగా వాతపెస్వరం (తాపేశ్వరం), ఇల్వలపాడు (ఇప్పనపాడు) వంటి పల్లెలు కనిపిస్తాయి.

చరిత్రసవరించు

 
మండపేట పురపాలక సంఘ ముఖ ద్వారం

మధ్యయుగాల్లో పావులూరి మల్లన వంటి గణిత శాస్త్ర కోవిదులు, తన దాతృత్వానికి బ్రిటిష్ రాణి చేత ప్రశంసలందుకున్న డొక్కా సీతమ్మ వంటి వారితోపాటు, బలుసు సాంబమూర్తి వంటి స్వతంత్ర యోధులు ఇక్కడి వారే.

భౌగోళికంసవరించు

జిల్లా కేంద్రమైన అమలాపురం నుండి ఉత్తర దిశగా 48 కి.మీ. దూరంలో వుంది.

జనాభా గణాంకాలుసవరించు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ పట్టణ జనాభా మొత్తం 56,063.

పట్టణ స్వరూపంసవరించు

 
మెయిన్‌ రోడ్.
 
R.C.చర్చ్.

పట్టణంలో కలువపువ్వు సెంటర్, రాజారత్న సెంటర్, రథం సెంటర్ ప్రధాన కూడళ్లు.

కలువపువ్వు సెంటర్సవరించు

ఈ కూడలి నుండి ఒక రోడ్డు రావులపాలెం దిశగా, ఒకటి ఏడిద వైపు, ఒకరోడ్డు వల్లూరివారి వీధికి, ఒకటి మర్కెట్‌కు, మరొకటి రామచంద్రపురం వైపునకూ వెళ్తాయి, ఇంకో రెండు రోడ్లు ఊరిలోనికి వెళతాయి.

రాజారత్న సెంటర్సవరించు

దాదాపు అన్ని సినిమాహాలులకు, నారాయణ, చైతన్య, శశి వంటి విద్యా సంస్థలకు ఈ కూడలి మీదుగా వెళ్లాలి

రథం సెంటర్సవరించు

ఇక్కడ శ్రీ అగస్తేశ్వర స్వామి వారి (రథం గుడి) గుడి ఉన్న కారణంగా ఈ సెంటర్ కి రథం సెంటర్ అని పేరు వచ్చింది.

పరిపాలనసవరించు

మండపేట పురపాలక సంఘం పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది.

రవాణా సౌకర్యాలుసవరించు

మండపేట రహదారులతో అనుసంధానించబడి ఉంది. ఆలమూరు వైపు వెళ్ళే రహదారి కోల్కతా నుండి చెన్నై వెళ్ళే ఎన్.హెచ్ 16ను జొన్నాడ వద్ద కలుస్తుంది. ద్వారపూడి, యానాం మధ్య నడిచే ఎస్.హెచ్ 102 మండపేట ద్వారా వెళుతుంది. ఈ రహదారి మండపేటను ద్రాక్షారామ, రామచంద్రపురం, తాపేశ్వరం, ద్వారపూడి నుండి ఎస్.హెచ్ 40 మీదుగా రాజమండ్రిని కలుపుతుంది. మండపేటను దుళ్ళ, కపిలేశ్వరపురం, జొన్నాడలతో కలిపే రోడ్లు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాష్ట్ర రహదారులుగా ఉన్నాయి. కాకినాడ జిల్లా కేంద్రమైన కాకినాడ నుండి విజయవాడ, చెన్నై, బెంగళూరు, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలకు వెళ్ళే ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు మండపేట మీదుగా వెళ్తాయి.

మండపేటకి సమీప రైల్వే స్టేషన్ 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ద్వారపూడి వద్ద ఉంది. 26 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజమండ్రి రైల్వే స్టేషన్ మండపేటకు అత్యంత సమీపంలో గల ప్రధాన రైల్వే స్టేషన్.


ప్రముఖులుసవరించు

ఇవీ చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. 1.0 1.1 ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల జనగణన దత్తాంశ సమితి - పట్టణాలు (2011), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q58768667, archived from the original on 15 March 2018

వెలుపలి లంకెలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=మండపేట&oldid=3626672" నుండి వెలికితీశారు