కామారెడ్డి పెద్దచెరువు


కామారెడ్డి పెద్దచెరువు తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా కేంద్రానికి కిలోమీటర్ దూరంలో ఉంది. 1897లో నిజాం కాలంలో నిర్మించిన ఈ చెరువుకు దీనిని వారసత్వ సాగునీటి నిర్మాణ (హెచ్‌ఐఎస్) అవార్డుకు ఎంపికచేయడం జరిగింది.[1]

కామారెడ్డి పెద్దచెరువు
Kamareddy Pedda Cheruvu.jpeg
కామారెడ్డి పెద్దచెరువు
ప్రదేశంకామారెడ్డి జిల్లా , తెలంగాణ
రకంచెరువు
ప్రవహించే దేశాలుభారతదేశం

నిర్మాణం - సాగుబడిసవరించు

కామారెడ్డి చుట్టుపక్కలవున్న గ్రామాలలోని ప్రజలకు సాగు, తాగునీటి ఇబ్బందులు రాకుండా, వర్షపు నీటిని నిలువ ఉంచడానికి 1897లో ఆరో నిజాం మహబూబ్ అలీఖాన్ హయాంలో దోమకొండ సంస్థానముకు చెందిన రాజ మల్లారెడ్డి బహద్దూర్ దేశాయ్ ఈ చెరువును నిర్మించాడు.[2] 14 మీటర్ల ఎత్తుతో 175 ఎంసిఎఫ్‌టి సామర్థంతో నిర్మించిన ఈ చెరువు 858 ఎకరాల పంటకు సాగునీరు అందిస్తుంది. కామారెడ్డి, సారంపల్లి, క్యాసంపల్లె, ఉగ్రవాయి గ్రామాల పరిధిలో ఉన్న ఈ చెరువు స్థానికులకు తాగునీటి అందిస్తూ, మత్సకారులకు చేపల పెంపకంలో ఉపయోగపడుతుంది.

వారసత్వ సాగునీటి నిర్మాణంగా ఎంపికసవరించు

కెనడాలోని సస్కటూన్‌లో 2018 ఆగష్టు 12నుండి 17వరకు జరిగిన 69వ ఐఈసీ సమావేశంలో తెలంగాణ నీటిపారుదలశాఖ పంపిన ప్రతిపాదనల్ని పరిశీలించి ఈ చెరువును వారసత్వ సాగునీటి నిర్మాణంగా ఎంపికచేశారు.[3]

మూలాలుసవరించు

  1. నమస్తే తెలంగాణ (10 September 2018). "చెక్కుచెదరని నిర్మాణం.. సదర్‌మాట్". Archived from the original on 10 September 2018. Retrieved 11 September 2018.
  2. నమస్తే తెలంగాణ (10 September 2018). "నిజాంసాగర్ కన్నా ముందటి చెరువు". Archived from the original on 11 September 2018. Retrieved 11 September 2018.
  3. నమస్తే తెలంగాణ (10 September 2018). "సదర్‌మాట్, కామారెడ్డి పెద్దచెరువు వారసత్వ నిర్మాణాలు". Archived from the original on 10 September 2018. Retrieved 11 September 2018.