కామారెడ్డి జిల్లా

తెలంగాణ లోని జిల్లా

కామారెడ్డి జిల్లా, తెలంగాణలోని 33 జిల్లాలలో ఒకటి.[2] కామారెడ్డి అనే పేరు సా.శ. 1600 నుండి 1640 కాలంలో దోమకొండ కోటను పరిపాలించిన “చిన్న కామిరెడ్డి” నుండి ఈ పేరు వచ్చింది. ఈ ప్రదేశం పూర్వె కోడూరుగా పిలువబడేది. ప్రస్తుతం కిష్టమ్మ గుడి దగ్గర ఈ గ్రామం ఉంది. 2016 అక్టోబరు 11న కొత్తగా అవతరించిన ఈ జిల్లాలో కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి అనే 3 రెవెన్యూ డివిజన్లు, 22 మండలాలు, 450 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[2] 44వ నెంబరు జాతీయ రహదారిపై ఉన్న కామారెడ్డి పట్టణం ఈ జిల్లా పరిపాలన కేంద్రంగా మారింది. ఇందులోని అన్ని మండలాలు మునుపటి నిజామాబాదు జిల్లాలోనివే.

Kamareddy district
Temple at Domakonda fort
Temple at Domakonda fort
పటం
Kamareddy district
Country India
StateTelangana
HeadquartersKamareddy
Mandalas23
Government
 • District CollectorShri Jithesh V Patil IAS
 • Parliament constituencies1
విస్తీర్ణం
 • Total3,652 కి.మీ2 (1,410 చ. మై)
జనాభా
 (2015)
 • Total10,04,259
 • జనసాంద్రత277.2/కి.మీ2 (718/చ. మై.)
Demographics
 • Literacy56.51
 • Sex ratio1033
Time zoneUTC+05:30 (IST)
Vehicle registrationTS–17[1]
కామారెడ్డి జిల్లా

జిల్లా గణాంకాలు

మార్చు

కామారెడ్డి జిల్లా విస్తీర్ణం: 3,667 చ.కి.మీ., జనాభా: 9,74,227, అక్షరాస్యత: 48.49 శాతంగా ఉన్నాయి.

భౌగోళికం

మార్చు

జిల్లా 3,652.00 చదరపు కిలోమీటర్లు (1,410.05 చ. మై.) విస్తీర్ణంతో రాష్ట్రంలో 15వ అతిపెద్ద జిల్లాగా నిలిచింది.[3] కామారెడ్డికి ఉత్తరాన నిజామాబాద్ జిల్లా, తూర్పున రాజన్న సిరిసిల్ల, సిద్ధిపేట జిల్లాలు, దక్షిణాన సంగారెడ్డి, మెదక్ జిల్లాలు, పశ్చిమ-నైరుతిలో వరుసగా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన నాందేడ్ జిల్లా, బీదర్ జిల్లాలు సరిహద్దులగా ఉన్నాయి.

జనాభా

మార్చు

2011 భారత జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 974,227 మంది ఉన్నారు. జనాభాలో రాష్ట్రంలోని జిల్లాల్లో 15వ స్థానంలో ఉంది.[4][5] మొత్తం జనాభాలో షెడ్యూల్డ్ కులాలు 15.77%, షెడ్యూల్డ్ తెగలు 8.41% ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 72.87% జనాభా తెలుగు, 9.73% ఉర్దూ, 8.57% లంబాడీ, 3.89% మరాఠీ, 3.23% కన్నడ వారి మొదటి భాషగా మాట్లాడేవారు ఉన్నారు.[6]

జిల్లాలోని మండలాలు

మార్చు

తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 230 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016 ప్రకారం ఈ విభాగంలలో 22 (ఇరవై రెండు రెవెన్యూ మండలాలు ఉన్నాయి.

గమనిక:* పునర్య్వస్థీకరణలో భాగంగా జిల్లాలో  కొత్తగా ఏర్పడిన మండలాలు (6)

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Telangana New Districts Names 2016 Pdf TS 31 Districts List". Timesalert.com. 11 October 2016. Retrieved 11 October 2016.
  2. 2.0 2.1 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 230 Revenue (DA-CMRF) Department, Dt: 11-10-2016
  3. "New districts". Andhra Jyothy.com. 8 October 2016. Archived from the original on 25 డిసెంబరు 2018. Retrieved 8 October 2016.
  4. District census 2011: Nizamabadby mandals
  5. "Archived copy". Archived from the original on 8 July 2017. Retrieved 16 January 2017.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  6. 2011 Census of India, Population By Mother Tongue

వెలుపలి లంకెలు

మార్చు