కామారెడ్డి

తెలంగాణ, కామారెడ్డి జిల్లా, కామారెడ్డి మండలం లోని పట్టణం

కామారెడ్డి, తెలంగాణ రాష్ట్రం, కామారెడ్డి జిల్లా, కామారెడ్డి మండలానికి చెందిన పట్టణం.[1]

ఈ పట్టణం 7 వ నెంబర్ జాతీయ రహదారిపై ఉంది. హైదరాబాదు నుంచి ఈ పట్టణం 110 కి.మీ.దూరంలో ఉత్తరం వైపు ఉంది.వ్యాపార పరంగా ఈ పట్టణం మంచి అభివృద్ధిలో ఉంది. చక్కెర, బెల్లం, వరి, పసుపు ఇక్కడి ప్రధాన ఉత్పత్తులు.

గ్రామ చరిత్రసవరించు

1830లో కామారెడ్డి ప్రాంతాన్ని సందర్శించిన యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య ఆనాటి కామారెడ్డిని వర్ణించారు. భిక్నూరు మొదలుకొని కామారెడ్డి చేరే ృవరకూ రేగడినేల ఉండేదని, వర్షాకాలం కావడంతో అడుసులోకి ప్రయాణిస్తున్న తమ కాళ్ళు దిగబడి ప్రయాణం యాతన అయిందని వ్రాశారు. ఆనాటికి గ్రామం వసతిగా ఉండేదని, అంగళ్ళు గ్రామంలో ఉండేవని వ్రాశారు. గ్రామానికి మంచినీటి చెరువు వసతి కూడా ఉందని ప్రస్తావించారు. దీనిని కామారెడ్డి పెద్దచెరువు పిలుస్తారు.[2]

పూర్వపు రాజు కామినేని పుల్లారెడ్డి పేరు మీదుగా ఈ పట్టణానికి కామారెడ్డి అనే పేరు వచ్చింది. ఈ గ్రామాన్ని 1830 కాలంలో కామారెడ్డి పేటగా వ్యవహరించేవారు. క్రమంగా పేట లుప్తమై కామారెడ్డి అని వ్యవహరిస్తున్నారు. కోడూరు అనే పిలిచేవారు హనుమాన్ గుడి ఉండేది. క్రమంగా కామారెడ్డి అయింది.

రవాణాసవరించు

రైలు రవాణాసవరించు

కామారెడ్డి దక్షిణ మధ్య రైల్వే మండలపు, హైదరాబాద్ విభాగపు, కాచిగూడ-మన్మాడ్ మార్గములో నున్నది. దీని స్టేషన్ కోడ్: KMC

మూలాలుసవరించు

  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-10-22. Retrieved 2018-08-09.
  2. వీరాస్వామయ్య, యేనుగుల (1941). కాశీయాత్రా చరిత్ర (PDF) (మూడవ ముద్రణ ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. Retrieved 26 November 2014. CS1 maint: discouraged parameter (link)

వెలుపలి లంకెలుసవరించు