కామినేని వైద్య విజ్ఞాన సంస్థ
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
కామినేని వైద్య విజ్ఞాన సంస్థ (Kamineni Institute of Medical Sciences; KIMS) ప్రసిద్ధి చెందిన వైద్య కళాశాల. ఇది నల్గొండ జిల్లాలో నార్కెట్‌పల్లి గ్రామంలో ఉంది. ఈ కళాశాలను అనుబంధంగా 1050-పడకల ఆసుపత్రి నడపబడుతున్నది. ఇది జాతీయ రహదారి 9 మీద హైదరాబాద్ పట్టణం నుండి సుమారు 80 కిలోమీటర్లు (50 మైళ్లు) దూరంలో ఉంది. ఇది ఈ ప్రాంత పేదప్రజలను ఉన్నతమైన వైద్య సేవలను అందిస్తున్నది. ఇక్కడకు మన రాష్ట్రం నుండే కాక ఇతర దేశాల నుండి కూడా విద్యార్థులు వైద్యంలో డిగ్రీ (M.B., B.S.) కోసం వస్తారు. ఇది కాళోజి నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంకు అనుంబంధంగా పనిచేస్తుంది.
నినాదం | "విద్య ప్రాచీన గుప్తధనం" జ్ఞానం దాచిన ధనం treasure |
---|---|
రకం | వైద్య కళాశాల |
స్థాపితం | 1999 |
అండర్ గ్రాడ్యుయేట్లు | ప్రతి సంవత్సరం 150 మంది |
స్థానం | నార్కెట్‌పల్లి, తెలంగాణ, భారతదేశం |
కాంపస్ | గ్రామీణ ప్రాంతం |
అనుబంధాలు | కాళోజి నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం |
జాలగూడు | "www.kimsmedicalcollege.com" |
స్థాపన
మార్చుఈ వైద్య సంస్థను శ్రీ కామినేని సూర్యనారాయణ గారు కామినేని విద్యా సంఘం (Kamineni Education Society) లో భాగంగా 1999 సంవత్సరంలో ప్రారంభించారు. మొదటి దఫా 100 మంది వైద్య విద్యార్థులు ఇందులో నమోదు చేసుకున్నారు. తర్వాత ఈ సంఖ్య 150 కి పెరగడమే కాకుండా కొన్ని శాఖలలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులను ప్రారంభించారు.
ప్రధానోపాధ్యాయులు
మార్చు- డా. రాజేంద్ర బాబు (1999 – 2006)
- డా. సి. జి. విల్సన్ (2006 – ప్రస్తుతం)