కార్టోశాట్-1 ఉపగ్రహం

కార్టోశాట్-1 (Cartosat-1) ఉపగ్రహం త్రిమితీయ చిత్రాలను తీసే సామర్ధ్యం కలిగిన మొదటి భారతీయ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం. ఈ ఉపగ్రహం పట /మానచిత్రాలను (Cartographic) తియ్యగలదు. ఉపగ్రహంలో అమర్చిన కెమెరాల విభాజకత (resolution) 2.5 మీటర్లు (ఒక చిన్న కారును గుర్తించగలదు). ఈ ఉపగ్రహాన్ని భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ వారు రూపకల్పన చేసి, ప్రయోగించారు. కార్టోశాట్ -1 ఉపగ్రహానికి డిజిటల్ ఎలివేషను నమూనాలను సృజించే సామర్థ్యం ఉంది. స్పష్ట నిజరూప చిత్రాలను రూపొందించగలదు. భౌగోళిక, భూగోళ సంబంధిత సమాచారాన్ని సేకరించటానికి అవసరమైన పరికరాలను ఈ ఉపగ్రహంలో అమర్చారు.

కార్టోశాట్-1
మిషన్ రకంCartography
ఆపరేటర్ISRO
COSPAR ID2005-017A Edit this at Wikidata
SATCAT no.28649
మిషన్ వ్యవధి5 years
అంతరిక్ష నౌక లక్షణాలు
తయారీదారుడుISRO
లాంచ్ ద్రవ్యరాశి1,560.0 కిలోగ్రాములు (3,439.2 పౌ.)
శక్తి46 watts
మిషన్ ప్రారంభం
ప్రయోగ తేదీMay 5, 2005, 04:45 (2005-05-05UTC04:45Z) UTC [1]
రాకెట్PSLV
లాంచ్ సైట్సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం SLP[2]
కక్ష్య పారామితులు
రిఫరెన్స్ వ్యవస్థGeocentric
రెజిమ్Sun-synchronous
Perigee altitude624 కిలోమీటర్లు (388 మై.)[3]
Apogee altitude626 కిలోమీటర్లు (389 మై.)[3]
వాలు97.81 degrees[3]
వ్యవధి97.07 minutes[3]
ఎపోచ్25 January 2015, 02:39:56 UTC[3]
 

ప్రయోగ వివరాలు

మార్చు

ఈ ఉపగ్రహాన్ని 2005 మే 5 న ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో ఉన్న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ఉపగ్రహ ప్రయోగకేంద్రం నుంచి అంతరిక్షంలోకి పంపారు. [4] ఈ ఉపగ్రహాన్ని PSLV-C6 వాహక నౌక ద్వారా అంతరిక్షంలోకి పంపించారు. ఉపగ్రహం కక్ష్య ఆవర్తన సమయం 97 నిమిషాలు. భూమి చుట్టూ ఒక రోజులో 14 ప్రదక్షిణలు చేస్తుంది. భూమినుండి కక్ష్య 618 కిలోమీటర్ల ఎత్తున ఉంది (సూర్యానువర్తన ధ్రువీయ కక్ష్య). ఉపగ్రహ జీవితకాలం 5 సంవత్సరాలు. ప్రయోగ సమయంలో ఉపగ్రహపు మొత్తం స్రవ్యరాశి (ఉపగ్రహం లోని ఇంధనంతో కలిపి) 1560 కిలోలు. భూమధ్య రేఖను దాటునపుడు స్థానిక సమయం 10:30 గంటలు.

ఉపగ్రహం

మార్చు

కార్టోశాట్ -1 లేదా ఐఆర్‌ఎస్–పి5 త్రిమితీయ దృష్టి కలిగి సూర్య స్థిరకక్ష్యలో తిరుగు, దేశపట రచనాసామర్ధ్యం కలిగిన, కార్టోశాట్ ఉపగ్రహ శ్రేణిలో మొదటి ఉపగ్రహం. ఈ ఊపగ్రహాన్ని రూపకల్పన చేసినది, తయారు చేసినది, అంతరిక్ష ప్రయోగం కావించినది, నిర్వహిస్తున్నది, ఇస్రో. ఈ ఉపగ్రహ ముఖ్య ఉద్దేశం దేశపట (Cartography) రచన. అందులోని Carto పదభాగాన్ని, satellite లోని Sat పదాన్ని కలిపి cartosat అని ఉపగ్రహానికి పేరు నిర్ణయించారు. ఈ ఉపగ్రహాన్ని పోలార్ సెటెలైట్ ప్రయోగ వాహనం (PSLV) శ్రేణికి చెందిన C6 ఉపగ్రహ వాహకనౌక (రాకెట్) ద్వారా అంతరిక్షములో ప్రవేశపెట్టారు. పీఎస్‌ఎల్‌వి ఉపగ్రహ వాహకనౌక- C6 కూడా ఇస్రోవారు రూపకల్పన చేసి, అభివృద్ధి పరచినదే.

126 రోజుల వ్యవధిలో మొత్తంభూగోళంయొక్క పర్యవేక్షణను 1867 ప్రదక్షిణలలో పూర్తి చేస్తుంది. [5] కార్టోశాట్-1 లో రెండు పాన్‌క్రోమాటిక్ (PAN) కెమరాలను అమర్చారు. ఇవి దృష్టి పరిధిలోని భూమియొక్క నలుపు తెలుపు త్రిమితీయ చిత్రాలని తీస్తాయి. కెమరాలు కవరు చెయ్యగల ప్రాంతపు వెడల్పు 30 కిలోమీటర్లు. అంతరిక్ష/ప్రదేశ సంబంధిత రిసోల్యూషన్ 2.5 మీటర్లు.

చరిత్ర

మార్చు

ఉపగ్రహం విజయవంతంగా భూమికి సంబంధించిన సమాచారాన్ని అందించింది. సమాచారాన్ని వివిధ నిష్పత్తిప్రమాణాల్లో 1:1 మిలియను నుండి 1:12,5 00 నిష్పత్తిప్రమాణం వరకు భూమికి పంపినది.

ప్రత్యేకతలు

మార్చు

పేలోడ్

మార్చు

ఈ ఉపగ్రహంలో 2.5 మీటర్ల అంతరిక్ష రిసోల్యుసన్‌ గల రెండు పాంక్రోమాటిక్ కేమరాలుండి, ఏకకాలంలో రెండు చిత్రాలను చిత్రీకరణ చెయ్యగలదు.ఒకటి ముందువైపు +26 డిగ్రిలతో, మరొకటి వెనుకనుండి -5 డిగ్రీల కోణంలో వెంటవెంటనే త్రిమితియ చిత్రీకరణ కావిస్తుంది. ఒకే దృశ్యాన్ని రెండు కెమరాలు చిత్రికరించు సమయ వ్యవధి 52 సెకండ్లు.[5] త్రిమితియస్థితిలో పోటోలను తీయునపుడు ఉపగ్రహం భూ భ్రమణానికి అనుగుణంగా ఉపగ్రహం కుడా తిరిగి ముందువైపు, వెనుక వైపు కెమరాలతో భూభాగాన్ని త్రిమితీయమగా చిత్రీకరణ కావించు సామర్ధ్యం కలిగిఉన్నది.ఒకే దృశ్యాన్ని ఏకకాలంలో రెండు కెమరాలు భిన్నమైన కోణంలో తీయులాగున కెమరాలను ఉపగ్రహం మీద అమర్చారు.ఉపగ్రహ చలనానికి అనుగుణంగా కెమరాలు అటు, ఇటు తిరుగు అమరిక ఉన్నందున ఒకేదృశ్యాన్ని పదేపదే చిత్రించువీలున్నది.

సమాచార సేకరణ

మార్చు

కార్టోశాట్ -1 ఉపగ్రహం సేకరించిన సమాచారాన్ని సం క్షేపితము (compressed), నిక్షిప్త సందేశంగా (encrypted), రూపనిరూపణ (formatted) కావించి భూమి మీదనున్న నేషనల్ రిమోట్ సెన్సింగ్‌ కేంద్రాలకు పంపగా అక్కడ ఈ సమాచారాన్నిపునర్నిర్మాణం కావించుతారు.ఉపగ్రహం మీదఅమర్చిన వర్తులాకారపు అటు, ఇటు తిరుగగల ఎంటెన్నా, అది సేకరించిన డేటాను భూసమాచార సేకరణకేంద్రాలకు పంపిస్తుంది.

దృశ్య సంబంధ పరికరాలు-శోధనిలు(optics-detectors)

మార్చు

ఉపగ్రహంలోని రెండు కెమారాల లోని ప్రతికెమరా మూడు ప్రతిఫలింపజేసెడు దూరదర్శక అద్దాలను కలిగిఉన్నది.ఈ అద్దాలు ప్రత్యే మైన జెరోడూర్ గాజుతో చెయ్యబడి మామూలు అద్దాలబరువులో 60%బరువు కలిగి ఉన్నాయి.ఈ అద్దాల ఉపరితలం 1/80 కచ్చితంగా నునుపు (polish) చెయ్యబడి, ఉపరిభాగం అల్యూమినియం ఆక్సైడ్ పూత కలిగి ఉంది.CCDని డిటెక్టరు/శోధనిగా వాడారు.[6]

అంతరిక్ష రిసోలుసన్

మార్చు
  • 2.5 మీ.పాన్క్రోమాటిక్ బాండ్ (0.5-0.85 µm)

తత్కాల రెసోల్యుసన్

మార్చు

కార్టోశాట్ 5 రోజులకు ఒకమారు పునర్దర్శనం చేస్తుంది.

30 km (PAN-F) and 25 km (PAN-A)

ఇవికూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. McDowell, Jonathan. "Launch Log". Jonathan's Space Page. Retrieved 15 December 2013.
  2. "ISRO: Cartosat-1". Archived from the original on 2010-04-19. Retrieved 2015-09-01.
  3. 3.0 3.1 3.2 3.3 3.4 "CARTOSAT-1 Satellite details 2005-017A NORAD 28649". N2YO. 25 January 2015. Retrieved 25 January 2015.
  4. "PSLV-C6 launched from Sriharikota". The Economic Times. India. 5 May 2005. Retrieved 18 September 2012.
  5. 5.0 5.1 "NRSC: Cartosat-1". Archived from the original on 2015-08-29. Retrieved 2015-09-01.
  6. Indian Remote Sensing Satellite Cartosat-1: Technical features and data products