కార్తీక్స్ ది కిల్లర్

కార్తీక్స్ ది కిల్లర్ 2021లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీమతి లలిత సమర్పణలో యాదవ్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్ పై ఆవుల రాజు యాదవ్ & సంకినేని వాసు దేవ రావు నిర్మించిన ఈ సినిమాకు చిన్నా దర్శకత్వం వహించాడు. కార్తీక్ సాయి, డాలీషా, నేహా దేశ్ పాండే హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 3న విడుదలైంది. ఈ సినిమా విడుదలైన తొలిరోజు ఉదయం ఆట ఉచితంగా ప్రదర్శించారు.[1]

కార్తీక్స్ ది కిల్లర్
దర్శకత్వంచిన్నా
నిర్మాతఆవుల రాజు యాదవ్ & సంకినేని వాసు దేవ రావు
తారాగణంకార్తీక్ సాయి, డాలీషా, నేహా దేశ్ పాండే
కూర్పునాని
సంగీతంసిద్దార్థ్ వాట్కిన్స్‌
చిన్నా (బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్)
నిర్మాణ
సంస్థ
యాదవ్ ప్రొడక్షన్ హౌస్
విడుదల తేదీ
3 సెప్టెంబర్ 2021
దేశం భారతదేశం
భాషతెలుగు

ధ్రువ (కార్తిక్) ప్రాస్ మ్యాక్స్ యాడ్ ఏజెన్సీ ఓనర్, అతను నచ్చిన ప్రతి అమ్మాయితో రొమాన్స్ చేస్తుంటాడు. ధ్రువ తల్లి ద్వారా పరిచయమైన అమ్మాయి దీక్ష(డాలీషా) తో ప్రేమలో పడతాడు. ఇంతలో దీక్ష కు వీసా రావడంతో అమెరికా వెళ్లి కొంతకాలానికి ఇండియాకు తిరిగి వచ్చి కార్తీక్ తో కలిసి అరకు లోని ఒక గెస్ట్ హౌస్ కు వెళ్తుంది. అక్కడ దీక్ష కనిపించకుండా పోతుంది. ఎంత వెతికిన దీక్ష ఆచూకీ దొరకదు కనిపించదు. దీక్ష కంటే ముందే అరకులో చాలామంది అమ్మాయిలు ఇలాగే కనిపించకుండా పోయారని, అతిదారుణంగా హత్యకు గురయ్యారనే విషయం వెలుగులోకి వస్తుంది. ఈ మిస్టరీని చేధించడానికి రుద్రా (నేహా దేశ్ పాండే) పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ కోసం నియమితుడైతాడు. ఆ తరువాత జరిగే కొన్ని నాటకీయ పరిణామాల మధ్య అసలు ఈ హత్యలను చేస్తోంది ఎవరు ? ఎందుకు చేస్తున్నారు ? హత్యలకు కారణం ఏంటి ? అమ్మాయిలను చంపుతున్న ఆ వ్యక్తిని పోలీసులు ఎలా కనిపెట్టారు ? అనేది మిగిలిన సినిమా కథ.

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్: యాదవ్ ప్రొడక్షన్ హౌస్
  • నిర్మాత: ఆవుల రాజు యాదవ్ & సంకినేని వాసు దేవ రావు
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: చిన్నా
  • సంగీతం: సిద్దార్థ్ వాట్కిన్స్‌
  • సినిమాటోగ్రఫీ: గడ్డం ఏడుకొండలు
  • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: తోట సతీష్
  • ఎడిటర్: నాని కాసర గడ్డ

మూలాలు

మార్చు
  1. Eenadu (26 August 2021). "ఉదయం ఆట ఉచితం - Telugu News The Killer Released On September 3". Archived from the original on 8 September 2021. Retrieved 8 September 2021.
  2. Andrajyothy (5 September 2021). "నా పదేళ్ల కష్టమిది! కార్తీక్‌ సాయి". Archived from the original on 8 September 2021. Retrieved 8 September 2021.