రవిప్రకాష్

తెలుగు సినీ నటుడు

రవిప్రకాష్ ఒక సినీ నటుడు.[1] తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సుమారు 125 కి పైగా చిత్రాల్లో నటించాడు.[2] ముందుగా వైద్యవిద్యనభ్యసించి తర్వాత ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన శుభవేళ అనే చిత్రంలో కథానాయకుడిగా తన నట ప్రస్థానాన్ని ప్రారంభించాడు. తర్వాత ఎక్కువగా సహాయ పాత్రల్లో నటించాడు. ముఖ్యంగా రవిప్రకాష్ ఘర్షణ, అతడు, వేదం సినిమాల్లో పోషించిన పోలీసు ఆఫీసరు పాత్రలతో ప్రేక్షకులకు చేరువయ్యాడు. తమిళంలో వానం, పయనం, మాట్రాన్ లాంటి సినిమాల్లో నటించాడు.

రవిప్రకాష్
జననం
దుగ్గిరాల రవి

(1978-12-04) 1978 డిసెంబరు 4 (వయసు 45)
విజయవాడ
విద్యఎం. బి. బి. ఎస్
వృత్తినటుడు

వ్యక్తిగత విశేషాలు

మార్చు

రవిప్రకాష్ అసలు పేరు దుగ్గిరాల రవి.[3] స్వస్థలం విజయవాడ. తండ్రి జిల్లా కోర్టులో పనిచేసేవాడు. తర్వాత విశాఖపట్నంలోనే వ్యాపారస్తుడిగా స్థిరపడ్డారు. తల్లి గృహిణి. ప్రాథమిక విద్య నుంచి పీజీ దాకా విశాఖపట్నంలో చదువుకున్నాడు. సామాజిక సేవ స్ఫూర్తితో వైద్యవిద్య చదవాలనుకున్నాడు. 2000 లో ఎం. బి. బి. ఎస్ పూర్తయింది. చదివే సమయంలో స్నేహితుల సలహా మేరకు నట శిక్షకుడు సత్యానంద్ దగ్గర శిక్షణ తీసుకున్నాడు.[4] వైద్యవృత్తిలోకి రాకమునుపే సరదాగా సినిమాల్లో అవకాశం కోసం ఫోటోలు పంపించాడు. సినిమా అవకాశం రావడంతో ఆ రంగంలోకి ప్రవేశించాడు.

ఈయనకు ఒక అక్క. ఆమె అమెరికాలో నివసిస్తోంది.[5] ఇతని భార్య, ఆమె కుటుంబం మొత్తం వృత్తిరీత్యా వైద్యులే.[6]వీరికి ఒక బాబు.

కెరీర్

మార్చు

2000లో రమణ దర్శకత్వంలో ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన శుభవేళ అనే చిత్రంలో కథానాయకుడిగా తన నట ప్రస్థానాన్ని ప్రారంభించాడు. రమణ, దర్శకుడు తేజ స్నేహితుడు కావడంతో ఈ సినిమా నిర్మాణంలో ఆయనే కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాలో సిబ్బంది పొరపాటు వల్ల పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూ వల్ల రవికాంత్ అనే పేరుతో అచ్చైంది. తర్వాత రవిప్రకాష్ అని పేరు మార్చుకున్నాడు. అయితే ఈ సినిమా ఆశించినంతగా ఆడలేదు. తర్వాత హైదరాబాదులో గాంధీ ఆసుపత్రిలో రెండు సంవత్సరాలు హౌస్ సర్జన్ చేయడం కోసం గ్యాప్ తీసుకున్నాడు. పెద్దగా శిక్షణ లేకుండా మొదటి సినిమా నటించడం వల్ల నటనలో మరిన్ని మెలకువలు తెలుసుకోవడం కోసం మరోసారి పలు విభాగాల్లో శిక్షణ పొంది తన నైపుణ్యాలు మెరుగుపరుచుకున్నాడు. 2002 లో జయంత్ సి. పరాన్జీ దర్శకత్వంలో వచ్చిన ఈశ్వర్, వై. వి. ఎస్. చౌదరి దర్శకత్వంలో నందమూరి హరికృష్ణ కథానాయకుడిగా వచ్చిన సీతయ్య సినిమాల్లో చెప్పుకోదగ్గ పాత్రలు పోషించాడు. 2004 లో తమిళ దర్శకుడు గౌతం మీనన్ దర్శకత్వంలో వెంకటేష్ కథానాయకుడిగా తమిళ రీమేక్ చిత్రం ఘర్షణలో అతను పోషించిన పోలీసు ఆఫీసరు పాత్ర అతనికి మంచి గుర్తింపునిచ్చింది. తర్వాత అలాంటి పాత్రలు చాలా నటించాడు. 2005 లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అతడు సినిమాలో రవి ప్రకాష్ పోషించిన సి.బి.ఐ ఆఫీసరు పాత్ర కూడా అతనికి గుర్తింపు తెచ్చిపెట్టింది.

2010 లో క్రిష్ దర్శకత్వంలో వచ్చిన వేదం సినిమాలో కూడా పోలీసు అధికారి పాత్ర పోషించాడు. ముస్లింలందరినీ ఒకే గాటనకట్టి అనుమానించి చివరికి మానవత్వమే గొప్ప అని తెలుసుకునే పాత్ర.

సినిమాలు

మార్చు

తెలుగు సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమాలు పాత్ర గమనికలు
2000 శుభవేళ సూర్య
2002 ఈశ్వర్
2003 సీతయ్య శ్రీనివాస్ నాయుడు
ఒకరికి ఒకరు షారుఖ్
2004 ఘర్షణ పోలీసు అధికారి
2005 మొదటి సినిమా
అమలాపురం నుండి 123
అతడు రవి
2006 షాక్ శేఖర్ స్నేహితుడు
అనుకోకుండా ఒక రోజు మహేష్
మాయాజాలం వంశీ సోదరుడు
ఒక వి చిత్రమ్ సుప్రజ భర్త
సైనికుడు
స్టాలిన్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్
2007 చంద్రహాస్ సోహైల్
అతిధి రవి
2008 ఆటడిస్తా జగన్ అన్నయ్య
బలాదూర్ వరుడు
చింతకాయల రవి కార్తీక్
2009 ఇందుమతి
ఫిట్టింగ్ మాస్టర్ అశోక్
మల్లి మల్లి
నా స్టైల్ వేరు
గణేష్ జస్ట్ గణేష్ ప్రకాష్
2010 వేదం శివరామ్
సింహా ఆనంద్ ప్రసాద్
వైకుంటపాళి మూర్తి
ప్రస్థానం
పంచాక్షరి
మనసారా... యువ కుట్టి
2011 వైకుంటపాళి మూర్తి
గగనం ఫ్లైట్ కెప్టెన్ గిరీష్
సీమ టపాకై మనోజ్
దగ్గరగా దూరంగా హరి
దూకుడు రవి ప్రకాష్ IPS
సోలో రవి
2012 ఇష్క్ ప్రభు
జులాయి ధనుష్కోటి
దేనికైనా రెడీ నరసింహ నాయుడు సోదరుడు
కృష్ణం వందే జగద్గురుమ్ పట్టాభి
గబ్బర్ సింగ్
ఏటో వెళ్ళిపోయింది మనసు హరీష్
సారొచ్చారు రవి
2013 బాద్షా రాధా కృష్ణ సింహా
అత్తారింటికి దారేది సిద్ధప్ప నాయుడు కొడుకు
ఇద్దరమ్మాయిలతో
దూసుకెళ్తా రవి చందర్
2014 ప్రతినిధి ACP
రభస ఓబుల్ రెడ్డి సోదరుడు
ఆగడు భరత్ బావ
కఠినమైన చందు అల్లుడు
గోవిందుడు అందరివాడేలే బాచి సోదరుడు
2015 సన్నాఫ్ సత్యమూర్తి కుమారస్వామి నాయుడు
దాగుడుమూత దండాకోర్ హరి
సింహం రవీంద్ర
డైనమైట్ CI
రుద్రమదేవి
శ్రీమంతుడు డాక్టర్ గణేష్
బ్రూస్ లీ: ది ఫైటర్ రవి
కంచె జనార్దన్ శాస్త్రి
2016 నియంత ఇన్‌స్పెక్టర్ రసూల్
శ్రీరస్తు శుభమస్తు శివ
డిక్టేటర్
జనతా గ్యారేజ్ పోలీసు అధికారి దినేష్ కుమార్
నిర్మలా కాన్వెంట్ భూపతిరాజు తమ్ముడు
2017 శతమానం భవతి రాజు స్నేహితుడు
గౌతమీపుత్ర శాతకర్ణి గాన్దారాయ
కాటమరాయుడు రవి
కేశవ సీఐ రవి
మిస్టర్ రవి ప్రకాష్
బాబు బాగా బిజీ
కదిలే బొమ్మల కథ
మేడ మీద అబ్బాయి
రాజా ది గ్రేట్ పోలీసు అధికారి
2018 జై సింహా షామ్
రంగుల రత్నం కీర్తి తండ్రి
అంతకు మించి
అమ్మమ్మగారిల్లు సంతోష్ మేనమామ
శంభో శంకర
నీవెవరో అంధ గాయకుడు
గూడాచారి విజయ్
గీత గోవిందం పోలీస్ ఆఫీసర్ రవి
U మలుపు ప్రభాకర్
అరవింద సమేత వీర రాఘవ ఊసన్నా
వీర భోగ వసంత రాయలు డాక్టర్ సూర్య
టాక్సీవాలా శివ సోదరుడు
అమర్ అక్బర్ ఆంటోనీ చిదంబరం
2019 ఎన్టీఆర్: కథానాయకుడు డి. యోగానంద్
మజిలీ కోచ్ శ్రీను
మహర్షి పోలీసు అధికారి
రాక్షసుడు పోలీస్ ఆఫీసర్ శ్రవణ్
కౌసల్య కృష్ణమూర్తి PET టీచర్
మార్షల్
రాగాల 24 గంటల్లో పోలీస్ ఇన్‌స్పెక్టర్
కృష్ణ రావు సూపర్ మార్కెట్
హల్చల్
2020 వలయం పోలీస్ ఇన్‌స్పెక్టర్
2021 లక్ష్యం
రెడ్
కార్తీక్స్ ది కిల్లర్
ప్లాన్ బి
గమనం పోలీసు అధికారి రఘురాం
కపట నాటక సూత్రధారి
భగత్‌సింగ్‌ నగర్‌
2022 సన్ ఆఫ్ ఇండియా
అం అః
ఆచార్య శివుడు
సర్కారు వారి పాట అసిస్టెంట్ మేనేజర్ కృష్ణ మూర్తి
ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం పోలీసు ఎస్పీ
2023 అమిగోస్ ఎన్ఐఏ అధికారి రవి
కస్టడీ ఎస్‌ఐ రంగప్ప
2023 ఫ్యామిలీ స్టార్ గోవర్ధన్ సోదరుడు
జితేందర్ రెడ్డి
2024 కేసు నంబర్ 15

తమిళ చిత్రాలు

మార్చు
సంవత్సరం సినిమాలు పాత్ర ఇతర విషయాలు
2005 ఫిబ్రవరి 14
2008 సరోజ
2009 కాధల్న సుమ్మ ఇల్లై పోలీసు అధికారి
వెట్టైకారన్ చెన్నై పోలీస్ కమీషనర్
2011 పయనం ఫ్లైట్ కెప్టెన్ గిరీష్
వనం శివరామ్
2012 మాట్రాన్ దినేష్ తెలుగులో బ్రదర్స్
నీతానే ఎన్ పొన్వసంతం హరీష్
2013 ఎతిర్ నీచల్ కోచ్ రాజా సింగ్
తలైవా కేశవ్
2014 వల్లవనుక్కు పుల్లుమ్ ఆయుధం ధర్మము
మేఘా శ్రీనివాసన్
2016 పెన్సిల్ స్కూల్ చైర్మన్
2017 ముప్పరిమానం అనూష మేనమామ
వేరులి
2018 యూ టర్న్ ప్రభాకర్ తెలుగులో యూ టర్న్
2019 విశ్వాసం గౌతమ్ వీర్ వ్యక్తిగత సహాయకుడు
కప్పాన్ మహదేవ్ సహాయకుడు
2022 శవ డాక్టర్ సలీం రెహమాన్
2023 కస్టడీ ఎస్‌ఐ రంగప్ప

ఇతర భాషా చిత్రాలు

మార్చు
సంవత్సరం సినిమాలు పాత్ర భాష
2014 రాజాధిరాజ పోలీసు అధికారి మలయాళం
2015 గబ్బర్ ఈజ్ బ్యాక్ రవి హిందీ
2018 సీజర్ పోలీస్ ఆఫీసర్ రవి కన్నడ
2019 మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ సింధియా గ్వాలియర్ రాజు హిందీ

టెలివిజన్

మార్చు
సంవత్సరం పేరు పాత్ర వేదిక గమనికలు
2020 చదరంగం బాపినీడు ZEE5
2021 కుడి ఎడమైతే మహేంద్ర ఆహా
2022 9 అవర్స్ శివాజీ డిస్నీ+ హాట్‌స్టార్

మూలాలు

మార్చు
  1. "ఉత్తమ నటనపై దృష్టి". prajasakti.com. Retrieved 29 November 2017.[permanent dead link]
  2. "నోట్ల రద్దు ప్రభావం సినీ రంగంపై ఎక్కువే: నటుడు రవి ప్రకాశ్". andhrajyothy.com. ఆంధ్రజ్యోతి. Archived from the original on 7 డిసెంబరు 2016. Retrieved 29 November 2017.
  3. "Special chit chat with Actor Ravi Prakash". 10TV.
  4. "Rocking Ramulamma Show". 6TV.
  5. "Telugu actor Ravi Prakash Exclusive Interview". Youtube. Studio N News.
  6. "Interview with actor Ravi Prakash Part3". Cinegoer.

బయటి లింకులు

మార్చు