కార్బన్ డయాక్సైడ్
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
కార్బన్ డయాక్సైడ్ వాయువు వాతావరణంలో విస్తారంగా లభించే ఒక వాయువు. దీన్నే బొగ్గుపులుసు వాయువు అని కూడా అంటారు. వృక్షాలు, జంతువులు శ్వాసించడం, ఇంధనాలు మండటం, పదార్థాలు పులియడం వల్ల ఈ వాయువు ప్రధానంగా ఏర్పడుతుంది. కిరణజన్య సంయోగ క్రియలో వృక్షాలు ఈ వాయువును లోనికి పీల్చుకుని ఆక్సిజన్ వాయువును వెలువరిస్తాయి.
| |||
పేర్లు | |||
---|---|---|---|
ఇతర పేర్లు | |||
గుర్తింపు విషయాలు | |||
సి.ఎ.ఎస్. సంఖ్య | [124-38-9] | ||
పబ్ కెమ్ | 280 | ||
యూరోపియన్ కమిషన్ సంఖ్య | 204-696-9 | ||
కెగ్ | D00004 | ||
వైద్య విషయ శీర్షిక | Carbon+dioxide | ||
సి.హెచ్.ఇ.బి.ఐ | CHEBI:16526 | ||
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య | FF6400000 | ||
ATC code | V03 | ||
SMILES | O=C=O | ||
| |||
బైల్ స్టెయిన్ సూచిక | 1900390 | ||
జి.మెలిన్ సూచిక | 989 | ||
3DMet | B01131 | ||
ధర్మములు | |||
CO2 | |||
మోలార్ ద్రవ్యరాశి | 44.01 g·mol−1 | ||
స్వరూపం | Colorless gas | ||
వాసన | Odorless | ||
సాంద్రత | 1562 kg/m3 (solid at 1 atm and −78.5 °C) 770 kg/m3 (liquid at 56 atm and 20 °C) 1.977 kg/m3 (gas at 1 atm and 0 °C) | ||
ద్రవీభవన స్థానం | −78.5 °C; −109.2 °F; 194.7 K | ||
బాష్పీభవన స్థానం | −56.6 °C; −69.8 °F; 216.6 K | ||
1.45 g/L at 25 °C, 100 kPa | |||
బాష్ప పీడనం | 5.73 MPa (20 °C) | ||
ఆమ్లత్వం (pKa) | 6.35, 10.33 | ||
వక్రీభవన గుణకం (nD) | 1.1120 | ||
స్నిగ్ధత | 0.07 cP at −78.5 °C | ||
ద్విధృవ చలనం
|
0 D | ||
నిర్మాణం | |||
స్ఫటిక నిర్మాణం
|
trigonal | ||
linear | |||
ఉష్ణగతిక రసాయన శాస్త్రము | |||
నిర్మాణము మారుటకు కావాల్సిన ప్రామాణిక ఎంథ్రఫీ ΔfH |
−393.5 kJ·mol−1 | ||
ప్రామాణిక మోలార్ ఇంథ్రఫీ S |
214 J·mol−1·K−1 | ||
విశిష్టోష్ణ సామర్థ్యం, C | 37.135 J/K mol | ||
ప్రమాదాలు | |||
సంబంధిత సమ్మేళనాలు | |||
ఇతరఅయాన్లు | {{{value}}} | ||
ఇతర కాటయాన్లు
|
Silicon dioxide Germanium dioxide Tin dioxide Lead dioxide | ||
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |||
verify (what is ?) | |||
Infobox references | |||
గాలిలో దీని గాఢత 0.03 శాతం ఉంటుంది. ఈ శాతం పెరిగినపుడు గ్రీన్‌హౌస్ ప్రభావం వల్ల వాతావరణం వేడెక్కుతుంది. గ్రీన్‌హౌస్ వాయువుల్లోకెల్లా ఇది అతి ముఖ్యమైంది. మోటారు వాహనాలు ఉపయోగించడం వల్ల, పర్యావరణంలో CO2 గాఢత పెరుగుతుంది.
సాధారణ పద్ధతుల్లో సున్నపు రాయిని లేదా సోడియం బైకార్బోనేట్లను వేడి చేసి వియోగం చెందించి CO2 వాయువును తయారు చేస్తారు. రసాయన శాస్త్ర పద్ధతుల్లో చలువరాతి ముక్కలపై గాఢ హైడ్రోక్లోరిక్ ఆమ్లంపై చర్య జరిపి CO2 ను తయారు చేస్తారు.
భౌతిక ధర్మాలు
మార్చు- ఇది రంగులేని పుల్లని వాసన ఉన్న వాయువు.
- గాలికంటే బరువైనది.
రసాయన ధర్మాలు
మార్చు- ఇది సున్నపు తేటను పాలలా తెల్లగా మారుస్తుంది.
- సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం లోకి దీన్ని పంపినపుడు మొదట సోడియం కార్బొనేట్ ఏర్పడుతుంది. అదే ద్రావణం లోకి CO2 ని అధికంగా పంపినపుడు సోడియం బైకార్బొనేట్ ఏర్పడుతుంది.
ఉపయోగాలు
మార్చు- ఇది నీటిలో కరిగినపుడు కార్బోనిక్ ఆమ్లం ఏర్పడుతుంది.
- దీన్ని నిప్పును ఆర్పే యంత్రాల్లో ఉపయోగిస్తారు.
- దీని మిశ్రమమైన కార్బోజన్ ను కాలుష్యానికి గురైన రోగికి శ్వాస కోసం ఉపయోగిస్తారు.
- సాల్వే విధానంలో సోడియం కార్బొనేట్ తయారీలో ముడి పదార్థంగా ఉపయోగపడుతుంది.