హైడ్రోక్లోరిక్ ఆమ్లం

హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఒక బలమైన ఖనిజ ఆమ్లం. హైడ్రోజన్ క్లోరైడ్ వాయువును నీటిలో కరగించడం వలన హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఏర్పడును.స్వచ్ఛమైన హైడ్రోక్లోరిక్ ఆమ్లం రంగులేని ఘాటైన వాసన కలిగిన ద్రవ ఆమ్లం.హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని పలు పారిశ్రామిక పరిశ్రమలలో ఉపయోగిస్తారు.సహజంగా హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని గాస్ట్రిక్ ఆమ్లంలో(జీర్ణవ్యవస్థలో స్రవించు ఆమ్లం) లభిస్తుంది.

హైడ్రోక్లోరిక్ ఆమ్లం
పేర్లు
ఇతర పేర్లు
  • Muriatic acid
  • Spirits of salt[1]
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [7647-01-0]
యూరోపియన్ కమిషన్ సంఖ్య 231-595-7
ధర్మములు
స్వరూపం Colorless, transparent liquid
ఆమ్లత్వం (pKa) -6.3[2]
ప్రమాదాలు
R-పదబంధాలు R34, R37
S-పదబంధాలు (S1/2), S26, S45
సంబంధిత సమ్మేళనాలు
సంబంధిత సమ్మేళనాలు
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
☒N verify (what is checkY☒N ?)
Infobox references

ఇతిహాస పరంగా దీనిని అసిడియం సలిస్(acidum salis),మురియటిక్ ఆసిడ్(muriatic acid) అని వ్యవహారింపబడింది.ఈ ఆమ్లం రాతి ఉప్పు, గ్రీన్ విట్రియో(ఫెర్రస్(II)సల్ఫేట్) నుండి మొదట 15 వ శతాబ్ది లో(బాసిలియుస్ వలెంటిస్ చే)మొదట తయారుచేసినందున దీనిని స్పిరిట్ఆఫ్ సాల్ట్ కుడా వ్యవహరించేవారు.తరువాతి కాలంలో,17 వ శతాబ్ది మొదలు దీనిని మాములుఉప్పు(సోడియం క్లోరైడ్), సల్ఫ్యూరిక్ ఆమ్లంల రసాయన చర్య వలన (జాన్ రుడోల్ఫ్ గ్లాబేర్,17 వ శతాబ్ది) ఉత్పత్తి చేసెవారు.

పదవ్యుత్పత్తి/పుట్టుక

మార్చు

హైడ్రో క్లోరిక్ ఆమ్లాన్ని మొదట యురోపియన్ రసవేత్తలు/రసవాదులు(alchemists) స్పిరిట్ ఆఫ్ సాల్ట్ లేదా ఎసిడియం సాలిస్(అర్థం లవణ ఆమ్లం)అని పిలిచేవారు.ఈ రెండు పేర్లను ఇప్పటికిఉపయోగిస్తున్నారు.ఇతర భాషల్లో హైడ్రో క్లోరిక్ ఆమ్లాన్ని ఈ క్రింది విధంగా ఉచ్చారణ చేయుదురు.

  • జర్మనీ: Salzsäure
  • డచ్: Zoutzuur
  • స్విడిస్: Saltsyra
  • పోలిష్(Polish): kwas solny

వాయురూపంలో ఉండు హైడ్రో క్లోరైడ్‌ను మరిన్ ఆసిడ్ ఎయిర్(marine acid air)అని పిలుస్తారు.ఈ ఆమ్లానికి హైడ్రోక్లోరిక్ ఆమ్లం అను పేరును, 1814లో ఫ్రెంచి రసాయనవేత్త జోసెప్ లూయిస్ గెలుస్సాక్ కరారు చేసాడు[3] .

చరిత్ర

మార్చు

13 వ శతాబ్దికి చెందిన రసవేత్త /రసాయన శాస్త్రవేత్త సుడో గెబెర్(Pseudo-Geber)లో ఆక్వా రెజియా( నైట్రిక్ ఆమ్లం, హైడ్రోక్లోరిక్ ఆమ్లాలను మిశ్రమం)ను నైట్రిక్ ఆమ్లంలో సాల్ అమ్మోనియాను కరిగించి తయారు చేసినట్లుగా రాసాడు[4][5][6][7][8] అలాగే మరొక ఉదంతంలో 13వ శతాబ్ది చివర కాలానికి చెందిన బైజంటైన్ (Byzantine) మూలవ్రాత ప్రతిలో ఆక్వా రెజియాను గురించి ఉటంకించారు[9][10] .విడిగా హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్నిగురించి 16వ శతాబ్దిలో లిబవియుస్(Libavius)చెప్పినట్లుగా తెలుస్తున్నది. ఇతను లవణాన్ని మట్టి మూసలో వేడిచేసి తయారుచేసినట్టుగా తెలుస్తున్నది.మరికొందరు ఇతిహాస కారులు 15 వ శతాబ్దిలోనే జర్మన్ బెనెడిక్టిన్ మాంక్బాసిల్వాలెంటిన్ కనుగొన్నట్లు భావిస్తున్నారు/ అభిప్రాయ పాడుచున్నారు.ఆయన సాధారణ ఉప్పును, గ్రీన్ విట్రియోలను వేడి చెయ్యడం ద్వారా హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్నితయారు చేసాడు.

17వ శతాబ్దిలో జర్మనీకి చెందిన జోహన్ రుడోల్ఫ్ గ్లాబెర్(Johann Rudolf Glauber )అను శాస్త్రవేత్త మాన్ హెమ్ విధానంలో (Mannheim process)సోడియం సల్ఫేట్‌ను ఉత్పత్తిచేయుటకు సోడియం క్లోరైడ్ లవణాన్ని సల్ఫ్యూరిక్ఆమ్లంతో కలిపినపుడు,లవణంతో పాటు, ఉప ఉత్పత్తిగా హైడ్రోజన్ క్లోరైడ్ వాయువు వెలువడంగుర్తించాడు. 1772 లో ఇంగ్లాండుకు(లీడ్స్) చెందిన జోసెఫ్ ప్రిస్ట్లే శుద్ధమైన హైడ్రోజన్ క్లోరైడ్ ను ఉత్పత్తి చేసాడు. 1808లో ఇంగ్లాండుకుచెందిన మరో శాస్త్రవేత్త హంప్రీ డేవి హైడ్రోజన్ క్లోరైడ్ అనునది హైడ్రోజన్, క్లోరిన్ వాయువుల రసాయన సమ్మేళనంఅని నిరూపించాడు.

యూరప్లో పారిశ్రామిక విప్లవ సమయంలో, అక్కడ క్షార సంబంధిత పదార్థాల అవసరం పెరిగింది.నికోలస్ లెబ్లంక్(ఫ్రాన్స్) అనునతడు అతిచౌకగా భారి ప్రమాణంలో సోడియం కార్బోనేట్(సోడా యాష్)ను ఉత్పత్తి చేయు ఒక కొత్త పారిశ్రామిక ఉత్పత్తి విధానాన్ని కనుగొన్నాడు.ఈ లెబ్లంక్ ప్రక్రియలో సల్ఫ్యూరిక్ ఆమ్లం, సున్నపురాయి, బొగ్గును ఉపయోగించి సాధారణ ఉప్పు సోడా యాష్ గా పరివర్తన చెందునపుడు, హైడ్రోజన్ క్లోరైడ్ ఉప ఉత్పత్తిగా విడుదల అయ్యెది.బ్రిటిష్ ఆల్కలీ చట్టం 1863లో అమలుకు తెచ్చేవరకు, ఇలా ఏర్పడిన హైడ్రోజన్ క్లోరైడ్ వాయువును గాలిలోకి వదిలేవారు.ఈ చట్టం అమలుకు వచ్చిన తరువాత, వెలువడిన హైడ్రోజన్ వాయువును నీటిలో కరిగించి పారిశ్రామికస్థాయిలో హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని ఉత్పత్తి కావించడం ప్రారంభమైంది.

20 శతాబ్ది నుండి సోడా యాష్ ఉత్పత్తికి లెబ్లంక్ ప్రక్రియకు ప్రత్నామ్యాయంగా దీనికన్నా మెరుగైన సొల్వె(Solvay process)విధానాన్ని అవలంభించండమ్ మొదలైనది.ఈ విధానంలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉప ఉత్పత్తిగా ఏర్పడదు. అప్పటికే హైడ్రోక్లోరిక్ ఆమ్లం పలు పదార్థాల ఉత్పత్తిలో ముఖ్యమైన రసాయనంగా ప్రాముఖ్యత సంతరించు కున్నందున, ఇతర విధానాలలో కూడా హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని ఉత్త్పత్తి కావించడం మొదలైనది.

రసాయన ధర్మాలు-రసాయన చర్యలు

మార్చు

హైడ్రోజన్ క్లోరైడ్ మొనోప్రోటిక్ అనగా ఇది ఆమ్లంలోని మూలపదార్థాలు వేరుపడిన(dissociate), కేవలం ఒక H+ అయాన్ ఒంటరిప్రోటాన్)ను మాత్రమే ఇచ్చును. జలయుత హైడ్రోక్లోరిక్ ఆమ్లంలో, ఆమ్లం యోక్క H+ అయాన్ నీటి అణువు తోచేరడం వలన హైడ్రోనియం అయాన్(H3O+)ఏర్పడును.

HCl + H2O → H3O+ + Cl

ఈ చర్యలో ఏర్పడు రెండో అయాన్ క్లోరైడ్ అయాన్(Cl).అందువలన హైడ్రో క్లోరిక్ ఆమ్లాన్ని క్లోరైడ్ లవణాలను ఉత్పత్తి చేయుటకు ఉపయోగించవచ్చును. నీటిలో హైడ్రోక్లోరిక్అమ్మ్లం పూర్తిగా వ్యాపించి ఉండటం వలన ఇది బలమైన ఆమ్లం. 6 సామాన్య బలమైన ఖనిజ ఆమ్లాలలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఒకటి. ఉపయోగ సమయంలో అతి తక్కువ ప్రమాదకరమైన ఆమ్లం,హైడ్రోక్లోరిక్ ఆమ్లం. హైడ్రోక్లోరిక్ ఆమ్లం చర్యా రహిత,టాక్సిక్ స్వభావ రహిత క్లోరిన్ అయాన్ కల్గి ఉంది.హైడ్రో క్లోరిక్ ఆమ్లాన్ని నిల్వ ఉంచినపుడు దాని గాఢతలో పెద్దగా మార్పులకు లోనవ్వదు.తటస్థికరణ చర్య ద్వారా క్షారాల ప్రమాణాన్ని నిర్ణ యించుటకు హైడ్రోక్లోరిక్ ఆమ్లం తగిన ఆమ్లం.అజియోట్రోపిక్(Azeotropic)లేదా స్థిర మరుగు హైడ్రోక్లోరిక్ ఆమ్లం(అందాజుగా20.2%)ను ప్రాథమిక ప్రామాణిక రసాయనంగా ఘనపరిమాణత్మక విశ్లేషణ(quantitative analysis)లో ప్రాథమిక ప్రామాణిక రసాయనంగా ఉపయోగిస్తారు

గాఢ హైడ్రోక్లోరిక్ ఆమ్లం పలు లోహాలను కరగించుకొని ఆక్సికరించబడిన లోహ క్లోరైడులను,హైడ్రోజన్ వాయువును ఏర్పరచును.హైడ్రోక్లోరిక్ ఆమ్లం కాల్సియం కార్బోనేట్, వంటి క్షారసమ్మేలనాలతో లేదా కాపర్(I)ఆక్సైడ్వంటి వాటితో రసాయన చర్య జరుపును.

భౌతిక ధర్మాలు

మార్చు
గాఢత సాంద్రత మొలారిటి pH స్నిగ్ధత విశిష్టోష్ణం బాష్ప
వత్తిడి
బాష్పీభవన
స్థానం
ద్రవీభవన
స్థానం
kg HCl/kg  kg HCl/m3 Baumé kg/L mol/dm3 mPa·s kJ/(kg·K) kPa °C °C
10% 104.80 6.6 1.048 2.87 −0.5 1.16 3.47 1.95 103 −18
20% 219.60 13 1.098 6.02 −0.8 1.37 2.99 1.40 108 −59
30% 344.70 19 1.149 9.45 −1.0 1.70 2.60 2.13 90 −52
32% 370.88 20 1.159 10.17 −1.0 1.80 2.55 3.73 84 −43
34% 397.46 21 1.169 10.90 −1.0 1.90 2.50 7.24 71 −36
36% 424.44 22 1.179 11.64 −1.1 1.99 2.46 14.5 61 −30
38% 451.82 23 1.189 12.39 −1.1 2.10 2.43 28.3 48 −26
The reference temperature and pressure for the above table are 20 °C and 1 atmosphere (101.325 kPa).
Vapour pressure values are taken from the International Critical Tables and refer to the total vapour pressure of the solution.

హైడ్రోక్లోరిక్ ఆమ్లం యొక్క గాఢత లేదా మోలారిటి(ఒక లీటరు నీటిలో, పదార్థ అణుభారముకు సమానమగు పదార్థాన్ని కరిగించిన దానిని ఒక మొలారు ద్రావణం లేదా ఒక మోలారిటి అంటారు)ని బట్టి హైడ్రోక్లోరిక్ ఆమ్లం యొక్క బాష్పీభవన స్థానం,ద్రవీభవన స్థానం,సాంద్రత, pH వంటివి మారును. నీటిలో హైడ్రోక్లోరిక్ ఆమ్ల గాఢత సాధారణంగా 36.0 % వరకు కల్గిన హైడ్రోక్లోరోక్ ఆమ్లం మార్కెట్లో లభిస్తుంది.40% గాఢత కల్గిన పొగలు వెలువరించు ఆమ్లం కూడాలభించును.హైడ్రోక్లోరిక్ ఆమ్లం హైడ్రోజన్ క్లోరైడ్, నీటిమిశ్రమాల బైనరి(రెండు కంపోనెంట్‌లను కలగిన)మిశ్రమ ద్రావణం.

ఉత్పత్తి

మార్చు

హైడ్రోజన్ క్లోరైడ్ వాయువును నీటిలో కరగించడం ద్వారా హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని ఉత్పత్తి చేయుదురు. హైడ్రోజన్ క్లోరైడ్ ను పలు ఉత్పత్తి విధానాల ద్వారా తయారు చేయుదురు.భారి స్థాయిలో,ప్రమాణంలో హైడ్రో క్లోరిక్ ఆమ్లం ఉత్పత్తి ఇతర రసాయనాల ఉత్పత్తితో పాటు అనుబంధంగా జరుగును.

పారిశ్రామికస్థాయి ఉత్పత్తి

మార్చు

వాణిజ్య స్థాయిలో హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని 38% గాఢత వరకు ఉత్పత్తి చేయుదురు.అంతకన్నా గాఢత అనగా 40% వరకు గాఢత కల్గిన ఆమ్లాన్ని ఉత్పత్తి కావించినను,హైడ్రోజన్ క్లోరైడ్ వాయువు త్వరగా బాష్పీకరణ చెందుట వలన 40% వరకు గాఢత కల్ల్గిన ఆమ్లాన్ని ఉత్పత్తి చేసినను,నిల్వ చేయుటలో,వాడుటలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి.అందువలన విపణ విధిలో సాధారణంగా 35-38% గాఢత కల్గిన హైడ్రోజన్ ఆమ్లం లభిస్తుంది. గృహవసారాల నిమిత్తం, ముఖ్యంగా శుభ్రపరచు పనులకు వాడు, అమెరికాలో ఉత్పతి చేయు ఆమ్లం గాఢత 10-12% ఉండును.మొత్తం మీద ప్రపంచ వ్యాప్తంగా హైడ్రోజన్ క్లోరైడ్ వాయువు రూపంలో ఉత్పత్తి అగు హైడ్రోక్లోరిక్ ఆమ్లం 20 మిలియను టన్నులు.అందులో 2 మిలియను టన్నులు నేరుగా ఉత్పత్తి చేయగా, మిగిలినది ద్వితీయ ఉత్పత్తిగా సేంద్రియ, ఇతర రసాయనాల సంశ్లేషణలో ఉత్పత్తి అగుచున్నది.

ఉపయోగాలు

మార్చు

హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఒక బలమైన అకర్బన ఆమ్లం.లోహాలను శుద్ధీకరణ (refining metal)వంటి పలు పారిశ్రామిక ప్రక్రియలలో హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని వినియోగిస్తున్నారు.

ఉక్కుపికిలింగ్(Pickling of steel)

మార్చు

హైడ్రో క్లోరిక్ ఆమ్లాన్ని ముఖ్యంగా ఇనుము,ఉక్కు లోహంల ఉపరితలం మీద ఏర్పడిన తుప్పు లేదా ఐరన్ ఆక్సైడ్ ను తొలగించుటకు ఉపయోగిస్తారు.ఈ విధంగా ఇనుము, ఉక్కు తుప్పును,పొ లుసు లను (scale)తొలగించుటను పికిలింగ్(Pickling)అందురు. ఇనుము లేదా ఉక్కును ఎక్సుట్రుసన్, రోలింగ్, గాల్వనైజింగ్ చేయుటకు ముందు హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో పికిలింగు చేయుదురు. కార్బన్ స్టిల్ ను 18% గాఢత కల్గిన హైడ్రోక్లోరిక్ ఆమ్ల ద్రావణంతో పికిలింగ్ చేయుదురు.

Fe2O3 + Fe + 6 HCl → 3 FeCl2 + 3 H2O

పై విధంగా పికిలింగ్ వలన ఏర్పడిన ఉపయోగించిన/వాడిన ఆమ్లాన్ని(spent acid)ఐరన్(II)క్లోరైడ్ (ఫెర్రస్ క్లోరైడ్ అనికూడా అంటారు)గా చాలాకాలం తిరిగి ఉపయోగించేవారు. అయితే ఈ క్లోరైడులో ఉండు భారలోహాల అధికపరిమాణం కారణంగా, క్రమంగా వాడిన/ఉపయోగించిన/పికిలింగుచేసిన ఆమ్లాన్ని ఫెర్రస్ క్లోరైడుగా వాడుటను మాని వేసారు.ఉక్కు పికిలింగుపరిశ్రమలలో స్ప్రే రోస్టరు లేదా ఫ్ల్యుయిడైస్డ్ హైడ్రోక్లోరిక్ ఆమ్లపునరుత్పత్తి విధానాన్ని అభివృద్ధి చెయ్యడం వలన పికిలింగుచేసిన/వాడిన ఆమ్లం నుండి హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని తిరిగి పొందే వీలుకల్గినది.

వాడిన /పికిలింగు హైడ్రోక్లోరిక్ ఆమ్లం నుండిపునరుత్పత్తి హైడ్రోక్లోరిక్ ఆమ్లంపొందుటకై సాధారణంగా పైరోహైడ్రోలిసిస్(pyrohydrolysis)ను అనుసరిస్తారు.

FeCl2 + 4 H2O + O2 → 8 HCl + 2 Fe2O3

ఈ పునరుత్పత్తి విధానంలో విలువైన ఐరన్ (III)ఆక్సైడ్ ను ఉపఉత్పత్తిగా పొందడం జరుగుతున్నది. ఐరన్ (III)ఆక్సైడ్ ను పలు ద్వితీయస్థాయి పరిశ్రమలలో ఉపయోగిస్తారు.

సేంద్రియ సమ్మేళనాల ఉత్పత్తి

మార్చు

క్లోరిక్ ఆమ్లాన్ని పి.వి.సి ఉత్పత్తిలో ఉపయోగించు వినైల్ క్లోరైడ్, డైక్లోరోఇథేన్ వంటి సేంద్రియ సమ్మేళనాలను ఉత్త్పత్తి కావించడంలో హైడ్రోక్లోరిక ఆమ్లం ప్రాముఖ్యతను కల్గి ఉంది. బిస్‌ఫెనోల్(bisphenol), పాలి కార్బోనేట్(polycarbonate), ఆక్టివేటేడ్ కార్బన్, ఆస్కార్బిక్ ఆమ్లం వంటి ఇతర సేంద్రియ సమ్మేళనాలు కూడా హైడ్రోక్లోరిక్ ఆమ్లం నుండి ఉత్పత్తి చేయబడుచున్నవి.పలు ఓషదఉత్పత్తులను(pharmaceutical products) కూడా హైడ్రోక్లోరిక్ ఆమ్లం నుండి ఉత్పత్తి చేస్తున్నారు.

2 CH2=CH2 + 4 HCl + O2 → 2 ClCH2CH2Cl + 2 H2O(ఆక్సీక్లోరినేసన్ విధానం ద్వారా డైక్లోరో ఇథేన్ ఉత్పత్తి)

కర్ర/కలప+ హైడ్రోక్లోరిక్ ఆమ్లం+ఉష్ణం→ ఆక్టివేటేడ్ కార్బన్ (కెమికల్ ఆక్టివెసన్ చర్య)

అసేంద్రియ సమ్మేళనాల ఉత్పత్తి

మార్చు

సాధారణ ఆమ్లం-క్షారం ల రసాయనచర్యల ఆధారంగా హైడ్రోక్లోరిక్ ఆమ్లం నుండి పలు అకర్బన/అసేంద్రియ రసాయన సమ్మేళనాలను ఉత్పత్తి చేయవచ్చును. నీటిని శుద్ధికరించు ఫెర్రస్ (III)క్లోరైడ్, పాలి అల్యూమినియం క్లోరైడ్(PAC)వంటి అకర్బన రసాయన సమ్మేళనాలను తయారు చేయవచ్చును.

Fe2O3 + 6 HCl → 2 FeCl3 + 3 H2O (ఫెర్రస్/ఐరన్(III) క్లోరైడ్ ను మాగ్నటైట్ (magnetite)నుండి)

ఫెర్రస్ (III)క్లోరైడ్, పాలి అల్యూమినియం క్లోరైడ్‌లను కాలుష్య జలం, త్రాగు నీరును శుద్ధీకరణ ప్రక్రియలో సమాక్షేపణం(flocculation), ఘనీభవనం/సంసంజనం(coagulation)కారకాలుగా ఉపయోగిస్తారు.

అదే విధంగా రహాదారులు/రోడ్ల నిర్మాణంలో వాడు కాల్సియం క్లోరైడ్ ను,ఎలక్ట్రో ప్లేటింగు/విద్యుత్తు లోహ మలాంలో వాడు నికెల్(II)క్లోరైడ్, గాల్వ నైజింగ్(ఇనుము/ఉక్కు లోహ ఉపరి తలం పై జింకు పూత)లలో వాడు జింకు క్లోరైడ్ను హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉపయోగించి ఉత్పత్తి చేయుదురు.

CaCO3 + 2 HCl → CaCl2 + CO2 + H2O (సున్నపు రాయి నుండి కాల్సియం క్లోరైడ్)

pH నియంత్రణ, తటస్థికరణ

మార్చు

ద్రావణాల ఆమ్ల తత్వాన్ని(acidity)(pH)ని హైడ్రోక్లోరిక్ ఆమ్లం నుపయోగించి తగిన ప్రమాణానికి తీసుకు వచ్చెదరు.

OH + HCl → H2O + Cl

ఆహారసంబందిత,ఔషధ సంబంధిత, త్రాగు నీటి పరిశ్రమలలో వాడు నీటి phని నియంత్రణలో ఉంచుటకు అత్యంత అధిక మట్టంలో శుద్ధమైన హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని ఉపయోగిస్తారు.వ్యర్దజలాల చికిత్స,ఈతకొలనుల నీటి pHని యంత్రణ వంటి సాధారణ పారిశ్రామిక అవసరాలకు టెక్నికల్లి క్వాలిటి హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని ఉపయోగించడం పరిపాటి.

అయాన్ ఎక్చెంజరుల రిజనరేసన్

మార్చు

అత్యంత నాణ్యతకల్గిన హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని అయాన్ ఎక్చెంజరు రేసిన్స్‌ను పునరుజ్జీవనం/రిజనరేసన్ చేయుటకు ఉపయోగిస్తారు. జల ద్రావనాలలోని సోడియం (Na+ ),కాల్సియం(Ca2+ )అయాను లను తొలగించి,నీటి కటినత్వాన్నితగ్గించుటకు కేటాయాన్ ఎక్చెంజరులను ఉపయోగిస్తారు.హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఈ కేటాయాన్ రెసిన్ లో సోడియం అయాన్ ను తొలగించి H+ అయాన్ ను,కాల్సియం అయాన్ ను తొలగించి2 H+ అయాను ప్రవేశ పెట్టును.

ఇతర ఉపయోగాలు

మార్చు

హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని ఇంకా తోలుశుద్ధీకరణ, సాధారణ ఉప్పును శుద్ధీకరణ, గృహ వస్తు శుద్ధికరణ ద్రావణ తయారి వంటి వంటి పలు చిన్న తరహాపరిశ్రమలలో, భవన నిర్మాణంలోకూడా విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.కాల్సియం కార్బోనేట్ ను తొలగించుటకు,హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని ఉపయోగిస్తారు,ఉదాహరణకు, కండెన్సరులు,బాయిలరు గొట్టాలు, ఇతర రసాయన చర్య ఉపకరణాలలో ఏర్పడిన కాల్సియం,లవణాల పోలుసులను(scale)తొలగించుటకు(de-scaling)హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని ఉపయోగిస్తారు.అలాగే ఇటుక నిర్మాణంలోని గచ్చును( తొలగించుటకు హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని వాడెదరు. ఇటుకలోకి హైడ్రో క్లోరిక్ ఆమ్లాన్ని పంపినపుడు ఆమ్లం గచ్చులోరసాయన చర్య ద్వారా కాల్సియం క్లోరైడ్,కార్బన్ డై ఆక్సైడ్, నీటిని ఏర్పరచును.

2HCl + CaCO3 → CaCl2 + CO2 + H2O

జీర్ణ వ్యవస్థలో(జీర్ణ కోశం) స్రవించుస్రావాలలో గాస్ట్రిక్ ఆమ్లం ప్రాదానమైనది. గాస్ట్రిక్ ఆమ్లం ప్రధానంగా హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని కలగిఉండి, జీర్ణకోశంలోని పదార్థాల ఆమ్లగుణాన్ని(pH)ని 1-నుండి2 మధ్య ఉండేలా చేస్తుంది.

ఆరోగ్యపరమైన భద్రత సూచనలు

మార్చు

గాఢహైడ్రోక్లోరిక్ ఆమ్లం (పొగలు వెలువరించు ఆమ్లం) దట్టమైన పొగమంచు ఆవిరులను ఏర్పరచును.ఆమ్ల పొగమంచు ఆవిరుల, ఆమ్లము రెండు కూడామానవ కణజాలం పై ప్రభావం చూపి క్షయికరణ ప్రభావం చూపును.శ్వాస కోశవ్యవస్థపై,కళ్ళు,చర్మం, ప్రేగులపై దుష్ఫలితాలు కల్గించును. హైడ్రోక్లోరిక్ ఆమ్లం సోడియం హైపోక్లోరైడ్, పొటాషియం పర్మాంగనేట్ వంటి ఆక్సీకరణ రసాయనాలతో చర్య వలన విషపూరిత క్లోరిన్ వాయువును విడుదల చేయును.

NaClO + 2 HCl → H2O + NaCl + Cl2
2 KMnO4 + 16 HCl → 2 MnCl2 + 8 H2O + 2 KCl + 5 Cl2
PbO2 + 4 HCl → 2 H2O + PbCl2 + Cl2

మూలాలు/ఆధారాలు

మార్చు
  1. "spirits of salt". Retrieved 29 May 2012.
  2. William L. Jolly "Modern Inorganic Chemistry" (McGraw-Hill, 1984), p.177
  3. Gay-Lussac (1814) "Mémoire sur l'iode" (Memoir on iodine), Annales de Chemie, 91 : 5-160. From page 9: " … mais pour les distinguer, je propose d'ajouter au mot spécifique de l'acide que l'on considère, le mot générique de hydro ; de sorte que le combinaisons acide de hydrogène avec le chlore, l'iode, et le soufre porteraient le nom d'acide hydrochlorique, d'acide hydroiodique, et d'acide hydrosulfurique ; … " ( … but in order to distinguish them, I propose to add to the specific suffix of the acid being considered, the general prefix hydro, so that the acidic combinations of hydrogen with chlorine, iodine, and sulfur will bear the name hydrochloric acid, hydroiodic acid, and hydrosulfuric acid ; … )
  4. Bauer, Hugo (2009). A history of chemistry. BiblioBazaar, LLC. p. 31. ISBN 978-1-103-35786-4.
  5. Karpenko, V.; Norris, J.A. (2001). "Vitriol in the history of chemistry" (PDF). Chem. Listy. 96: 997.
  6. "Hydrochloric Acid". Chemicals Economics Handbook. SRI International. 2001. pp. 733.4000A–733.3003F.
  7. Norton, S (2008). "A Brief History of Potable Gold". Molecular Interventions. 8 (3): 120–3. doi:10.1124/mi.8.3.1. PMID 18693188. Archived from the original on 2020-04-06. Retrieved 2016-03-31.
  8. Thompson, C.J.S. (2002). "Alchemy and Alchemists" (Reprint of the edition published by George G. Harrap and Co., London, 1932 ed.). Dover Publications, Inc., Mineola, NY: 61, 18. {{cite journal}}: Cite journal requires |journal= (help)
  9. Datta, N.C. (2005). The story of chemistry. Universities Press. p. 40. ISBN 978-81-7371-530-3.
  10. Pereira, Jonathan (1854). The elements of materia medica and therapeutics, Volume 1. Longman, Brown, Green, and Longmans. p. 387.