కార్యసాధక నిబంధన సిద్ధాంతం
కార్యసాధక నిబంధన సిద్ధాంతం ను అమెరికాకు చెందిన బి.ఎఫ్ స్కిన్నర్ ప్రతిపాదించాడు. దీన్ని స్కిన్నర్ సిద్ధాంతం అనీ, పరికరాత్మక నిబంధన సిద్ధాంతం అనీ, ఆర్ టైపు నిబంధన సిద్ధాంతం అనీ, ప్రతిస్పందన ప్రాధాన్యత సిద్ధాంతం అనీ అంటారు. ఇది ఒక ప్రవర్తనా వాద సిద్ధాంతం.
బి ఎఫ్ స్కిన్నర్సవరించు
బి.ఎఫ్ స్కిన్నర్ అమెరికాకు చెందిన మనో వైజ్ఞానిక శాస్త్రవేత్త. ఇతను ప్రతిపాదించిన ఈ సిద్ధాంతం పావ్ లోవ్ శాస్త్రీయ నిబంధనా సిద్ధాంతంకు భిన్నంగా ఉంటుంది. టెక్నాలజీ ఆఫ్ టీచింగ్, వెర్బల్ బిహేవియర్ అనేవి స్కిన్నర్ రాసిన గ్రంథాలు.[1][2]
ప్రయోగంసవరించు
స్కిన్నర్ ఎక్కువగా ఎలుకలు, పావురాలపై ప్రయోగాలు చేశాడు. కార్యసాధక నిబంధన సిద్ధాంతంలో మీటను నొక్కితే ఆహారం వచ్చే ఒక స్కిన్నర్ బాక్సు ను, ఒక ఎలుకను ఉపయోగించాడు. ఎలుకకు ఆకలిని కలుగజేసి, ఆహారం అనే ఉద్దీపన వచ్చేలా సిద్ధాంత ప్రతిపాదన చేశాడు.
ప్రయోగ విధానంసవరించు
స్కిన్నర్ బాక్సులో బాగా ఆకలిగా ఉన్న ఒక ఎలుకను ఉంచినపుడు అది అనేకసార్లు అటూ ఇటూ తిరుగుతూ ఒకసారి అనుకోకుండా మీటను నొక్కి ఆహారం పొందింది. మరొకసారి కొన్ని ప్రయత్నాల ద్వారానే మీట నొక్కి ఆహారం పొందింది. ఇలా కొన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత నేరుగా మీట నొక్కి ఆహారం పొందే అలవాటు చేసుకుంది. ఇలా ముందుగా మీట నొక్కిన తర్వాత నే ఆహారం పొందింది.
ప్రయోగ ఫలితంసవరించు
మీట నొక్కడం అనే అసహజ ప్రతిస్పందన ఉపయోగించి, ఆహారం అనే సహజ ఉద్దీపనను పొందింది. ప్రతిస్పందనకు, ఉద్దీపనకు మధ్య సంసర్గం ఏర్పడటమే ఈ సిద్ధాంత ఫలితం.
సిద్ధాంత అనుప్రయుక్తంసవరించు
1. మంచి పనిచేసిన వెంబడే బహుమతి కానీ, అభినందన గానీ అందించటం.
2. చెడు పనిచేసిన వెంబడే శిక్షను అమలు చేయటం.[3]
మూలాలుసవరించు
- ↑ "Skinner, Burrhus Frederic". behavioranalysishistory.pbworks.com.
- ↑ "Psychology History". Archived from the original on ఏప్రిల్ 4, 2007. Retrieved జూన్ 6, 2021.
- ↑ బాల్యదశ - వికాసం, అభ్యసనం. తెలుగు అకాడమీ డి ఎల్ ఎడ్ మొదటి సంవత్సరం.