ఎలుక
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ఎలుక, ఎలక లేదా మూషికము (Rat) ఒక చిన్న క్షీరదము. ఇది సహజంగా చిన్న ఉడుత రూపంలో కొద్ది పెద్ద పొట్ట కలిగి ఉంటుంది. బలమైన పళ్ళు కలిగి, చెక్కకు సైతం రంధ్రం చేయగలదు. ఎలుకలలో చిన్నవాటిని చిట్టెలుక (Mouse) అంటారు.
ఎలుకలు కాల విస్తరణ: Early Pleistocene - Recent
| |
---|---|
![]() | |
గోధుమ ఎలుక (Rattus norvegicus) | |
శాస్త్రీయ వర్గీకరణ | |
Kingdom: | |
Phylum: | |
Class: | |
Order: | |
Superfamily: | |
Family: | |
Subfamily: | |
Genus: | రేటస్ Fischer de Waldheim, 1803
|
జాతులు | |
50 species; see text |
ప్రయోగాలలోసవరించు
శాస్త్రవేత్తలు ప్రయోగాలకు ముందుగా ఎంచుకొనేది ఎలుకనే. చిన్న జీవి అవడం, దీని వలన ఎక్కువ ఊపయోగం లేకపోవడం వలన దీనిని ప్రయోగాలకు అధికంగా ఎంచుకొనుచున్నారు. అయితే దీనికి ఎలుకల కన్నా చిట్టెలుకలు (Mice) ఎక్కువ ఉపయోగంలో ఉంది.
ఎలుక మూలకణాలతో గుండె కండరాల సృష్టిసవరించు
ఎలుక పిండం నుంచి సేకరించిన మూలకణాల సహాయంతో ప్రయోగశాలలో గుండె కండరాలను సృష్టించడంలో హార్వర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు విజయం సాధించారు. ఈ కండరాలను ఉపయోగించి హృదయ సంబంధ సమస్యల్ని పరిష్కరించే వీలుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. (ఈనాడు19.10.2009)
మానవులతో ఎలుకసవరించు
ఇది వినాయకుని వాహనంగా పూజలందుకొనేది బహు తక్కువ. మానవులు ఎలుకను సహజంగా శత్రువుగా చూస్తారు. కారణం నిత్య జీవితంలో దీని వలన అనేక కష్ట, నష్టాలను అనుభవించుటవలన.
- రైతుల నష్టాలు
ముఖ్యంగా రైతులకు ఎలుక చేయు నష్టం అంతా ఇంతా కాదు. పంట చేలను నాశనం చేయడం, ధాన్యపు గాదులకు బొక్కలు (బొర్రలు) చేయడం నిలువ ఉంచిన ధాన్యం పాడు చేయడం లాంటివి.
- ఇళ్ళల్లో నష్టాలు
ఎలుకలు చెక్కలకు సైతం రంధ్రాలు చేయగలవు. ఉట్టిపై కూరగాయలు నాశనం చేయడం, పెట్టెలలో పెట్టిన బట్టలు, పుస్తకాలు కొరికి పాడు చేయడం, లాంటి అనేక పనులు.
- వ్యాధులు
మానవులలో ప్లేగు వంటి వ్యాధులకు ఇవి ప్రధాన కారణాలుగా వ్యాప్తిచెందుతాయి.
పురాణాలలోసవరించు
- వినాయకుని వాహనం
సాహిత్యంలోసవరించు
- పంచతంత్ర కథల్లో ఎలుక - సింహం,[1] మిత్రలాభం - పావురాల కథలో.
- కౌపీన ఉపాఖ్యానంలో ఎలుక కొరికిన కారణం చేత పిల్లిని తేవటంతో మొదలై ఒక సన్యాసి పెళ్ళి చేసుకున్న వైనం.
మూలాలుసవరించు
- ↑ "సింహము-ఎలుక". kathalu.wordpress.com. Archived from the original on 4 మార్చి 2017. Retrieved 9 June 2017.