టైమ్ జోన్

భూమి మీద ఒకే వేళకు ఒకే సమయాన్ని పాటించే ప్రాంతం
(కాలమండలం నుండి దారిమార్పు చెందింది)

టైమ్ జోన్ (కాల మండలం), అనేది భూమి మీద ఒకే వేళకు ఒకే సమయం సూచించే ప్రాంతాలను కలిపి ఒకే సమయ ప్రాంతంగా పరిగణించటం. సాధారణంగా పక్కపక్కన ఉండే సమయ ప్రాంతాలు ఒక గంట తేడాలో ఉంటాయి. సాంప్రదాయికంగా గ్రీన్‌విచ్ మీన్ టైముతో పోల్చి తమ స్థానిక సమయాన్ని లెక్కవేస్తాయి.

ప్రపంచంలోని ప్రామాణిక సమయ ప్రాంతాలు

ప్రపంచంలోని సమయ మండలాలన్నీ కోఆర్డినేటెడ్ యూనివర్సల్ టైమ్‌ (యుటిసి) ను అనుసరించి ఉంటాయి. 0o రేఖాంశం వద్ద సగటు సౌర సమయమే యుటిసి. ప్రపంచ దేశాలన్నీ దీన్ని అనుసరించి తమ తమ దేశాల్లోని సమయ మండలాన్ని నిశ్చయించుకుంటాయి. ప్రతీ రేఖాంశానికీ 4 నిమిషాల చొప్పున సమయం ముందుకు గాని, వెనక్కు గానీ ఉంటుంది. దీన్ని యుటిసి నుండి 30o తూర్పున ఉన్న రేఖాంశం వద్ద సమయం యుటిసి కంటే 120 నిమిషాలు (2 గంటలు) ముందు ఉంటుంది. చాలా దేశాలు తమ దేశంలో సుమారుగా మధ్యన ఉన్న రేఖాంశాన్ని ప్రామాణికంగా తీసుకుని, ఆ రేఖాంశం వద్ద యుటిసి నుండి ఎంత ఆఫ్‌సెట్ అయి ఉందో ఆ సమయాన్ని తమ దేశ ప్రామాణిక సమయంగా తీసుకుంటాయి. భారతీయ ప్రామాణిక సమయాన్ని 82.5′ తూర్పు రేఖాంశం వద్ద నున్న సమయాన్ని ప్రామాణికంగా తీసుకున్నారు. ఇది యుటిసి నుండి 330 నిమిషాలు ముందు ఉంటుంది. అంటే "యుటిసి+05:30 " అన్నమాట. కొన్ని దేశాల్లో యుటిసి ని గ్రీన్‌విచ్ మీన్ టైమ్ (జిఎమ్‌టి) అని అంటారు.

నేలపైని చాలా కాల మండలాలను యుటిసి నుండి గంటల్లో తేడా ఉండేలా రూపొందించారు. కానీ కొన్ని కాల మండలాలు అరగంట, ముప్పావుగంటల తేడాల్లో కూడా ఉన్నాయి. ఉదాహరణకు భారత ప్రామాణిక సమయం యుటిసి+05:30 కాగా, నేపాల్ సమయం యుటిసి+05:45

ప్రపంచవ్యాప్తంగా కాల మండలాలు

మార్చు
 

మూలాలు

మార్చు

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=టైమ్_జోన్&oldid=4247406" నుండి వెలికితీశారు