కాలారామ్ మందిరం
కాలారామ్ ఆలయం మహారాష్ట్రలోని నాసిక్ నగరంలోని పంచవటి ప్రాంతంలో ఉంది. ఈ ఆలయంలో రాముని విగ్రహం నల్లగా ఉండడం వలన ఈ ఆలయానికి కాలారామ్ అని పేరు వచ్చింది.[1]
కాలారామ్ మందిరం | |
---|---|
భౌగోళికం | |
భౌగోళికాంశాలు | 20°00′25″N 73°47′44″E / 20.0069387°N 73.7955010°E |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మహారాష్ట్ర |
జిల్లా | నాశిక్ జిల్లా |
ప్రదేశం | నాశిక్, నాశిక్ జిల్లా, మహారాష్ట్ర, భారతదేశం |
సంస్కృతి | |
దైవం | కాలారామ్ |
ముఖ్యమైన పర్వాలు | శ్రీరామనవమి |
చరిత్ర
మార్చుఈ ఆలయం చాల పురాతనమైనది. ఇది 7వ శతాబ్దం నుండి 11వ శతాబ్దం వరకు ఉన్న రాష్ట్రకూటుల కాలం నాటిది. మొదటి ఇస్లామిక్ దాడిలో ముస్లింలు ఈ ఆలయాన్ని కూల్చివేశారు. అపుడు ఆ ఆలయ పూజారులు రాముని విగ్రహాన్ని గోదావరి నదిలోకి విసిరేశారు. ఒక రోజు రాత్రి నల్లరంగులో ఉన్న రాముని విగ్రహం గోదావరి నదిలో ఉన్నట్లు పేష్వాకు చెందిన సర్దార్ రంగారావు ఒధేకర్ అనే అతనికి కల వచ్చింది. ఒదేకర్ నది నుండి విగ్రహాన్ని తెచ్చి, కొత్త ఆలయానికి నిధులు సమకూర్చి 1788లో పునర్నిర్మించారు.[2] ప్రధాన ఆలయంలో సభామండపం, ముఖమండపం, గర్భాలయమ ఉంది. సభామండపంలో గర్భాలయంలోని మూలవిరాట్టుకు ఎదురుగా శ్రీ ఆంజనేయస్వామి విగ్రహం, గర్భాలయంలో శ్రీరామునికి కుడివైపున లక్ష్మణుడు, ఎడమవైపున సీతాదేవి విగ్రహాలు ఉన్నాయి. ఈ ఆలయంలో సర్దార్ ఒదేకర్ విగ్రహం కుడా ఉంది. భారతదేశంలో దళిత ఉద్యమంలో భాగంగా బిఆర్ అంబేద్కర్ 1930 మార్చి 2న దళితులను ఆలయంలోకి అనుమతించాలంటూ ఆలయం వెలుపల ధర్నా చేసాడు.[3][4]
ఇతర విషయాలు
మార్చు- ఒక రాతిపై దత్తాత్రేయ భగవానుడి పాదముద్రలు ఉన్నాయి.
- రాముని ప్రధాన ఆలయంలో 14 మెట్లు ఉన్నాయి, ఇవి రాముని 14 సంవత్సరాల వనవాసాన్ని సూచిస్తాయి.
- ఈ ఆలయంలో 84 స్తంభాలు ఉన్నాయి, ఇది 84 లక్షల జీవ జాతుల చక్రాన్ని సూచిస్తుంది.
చిత్ర మాలిక
మార్చు-
ఆలయ సభామండపం
-
కాలారామ్ ఆలయ గోపురం
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "Shree Kalaram Mandir | Nashik District, Government of Maharashtra | India". Retrieved 2022-07-23.
- ↑ Melton, J. Gordon (2014-01-15). Faiths Across Time: 5,000 Years of Religious History [4 Volumes]: 5,000 Years of Religious History. ABC-CLIO. ISBN 978-1-61069-026-3.
- ↑ Kshīrasāgara, Rāmacandra (1994). Dalit Movement in India and Its Leaders, 1857-1956. M.D. Publications Pvt. Ltd. ISBN 978-81-85880-43-3.
- ↑ Keer, Dhananjay (2015). Dr. Ambedkar: Life and Mission. Popular Prakashan. ISBN 978-81-7154-329-8.