కాలువ మల్లయ్య తెలుగు కథా రచయిత. [1]

కాలువ మల్లయ్య
కాలువ మల్లయ్య
జననంజనవరి 12, 1953
తేలుకుంట గ్రామం, జూపల్లి మండలం, కరీంనగర్ జిల్లా, తెలంగాణ
జాతీయతభారతీయుడు
విద్యబియస్సీ, బి.ఎడ్
వృత్తిరచయిత

జీవిత విశేషాలు మార్చు

ఆయన తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్‌ జిల్లా జూలపల్లి మండలం, తేలుకుంట గ్రామంలో కాలువ ఓదేలు, పోచమ్మ దంపతులకు జనవరి 12, 1953 న జన్మించాడు. ఆయన సాహితీ ప్రస్థానంలో ఇప్పటి వరకు మొత్తం 875 కథలు, 16 నవలలు, 600 వ్యాసాలు, 200 కవితలు వెలుబడ్డాయి. ఆయన విశిష్టమైన "ఆటా" పురస్కారంతో పాటు మరెన్నో పురస్కారాలు పొందారు. తెలంగాణ ప్రాంతీయ స్పృహతో రాసిన వీరి కథల్లో తెలంగాణ ప్రాంత స్త్రీల జీవితాల్లోని వివిధ కోణాలు దర్శింపచేసారు.

స్త్రీవాద దృక్పథంతో కాలువ మల్లయ్యగారి కథల్ని పరిశీలించినట్లయితే తెలంగాణ భూస్వామ్య వ్యవస్థ నుండి నేటి వరకు గల స్త్రీల జీవితాల్లోని సమస్యల్ని కథా వస్తువులుగా స్వీకరించారు. ఇవి తెలంగాణాలోని మూడు తరాల స్త్రీల జీవితాల్ని ఆకళింపు చేసుకోవడానికి ఉపకరిస్తాయి. భూస్వామ్యవ్యవస్థలో దొరలది తిరుగులేని అధికారం. అయితే దొరల భార్యలైన దొర్సానులది మాత్రం పీడితబ్రతుకే. భర్తలు ఏం చేసినా ప్రశ్నించే హక్కు. స్వాతంత్రంలేక అణిగిమణిగి బతకాల్సి వచ్చింది. ఈ దొర్సానుల బతుకు వెతల్ని కాలువ మల్లయ్యగారు తన కథల్లో చిత్రిస్తూ వచ్చారు. సమస్యలన్నవి అట్టడుగు వర్గాల వారికి మాత్రమే కాదు. అగ్రవర్ణపు స్త్రీలకు కూడా ఉన్నాయని తన కథల్లో నిరూపించారు.

తెలంగాణ సామాజిక జీవనంలో నిజాంపాలనలో భూస్వామ్య వ్యవస్థ కాలం నుండి నేటి వరకు గల స్త్రీల జీవితాల్లోని వివిధ పార్శ్వాలను కాలువ మల్లయ్యగారు తన కథల్లో ప్రతి ఫలింపజేస్తూ వచ్చారు. శ్రామిక, పీడిత వర్గాలలోని స్త్రీలు చదువు వల్ల ప్రభావితులైన అనాదిగా ఉన్న పరాధీన భావననుండి విముక్తి పొంది స్వావలంబన దిశగా అడుగులేస్తున్నట్లు కాలువ మల్లయ్యగారు సామాజిక పరిణామాల్ని చిత్రించారు. అంతేకాకుండా ఆధునిక కాలంలో స్త్రీ కోరుకుంటున్న స్వేచ్ఛ, మగవాళ్ళతో సమానంగా గుర్తింపబడాలనే ఆకాంక్షను ఆయా కథల్లో విశ్లేషించారు. మహిళా చైతన్యానికి దోహదపడే విధంగా కథలు రాసిన కాలువ మల్లయ్య గారు స్త్రీ జాతి పట్ల తనకున్న గౌరవాన్ని నిరూపించుకోగలిగారు.

కథలు మార్చు

కథానిలయం లో ఆయన కథలు మార్చు

ఆయన రచనలు వివిధ పత్రికలలో ప్రచురితమైనాయి.[2]

కథ పత్రిక ప్రచురణ తేది
అగ్ని గుండం అభ్యుదయ 1991-03-01
అడవిగాచిన వెన్నెల ఆంధ్రప్రభ 1993-09-01
అన్న రచన 1997-02-01
అమ్మమీది సొమ్ములు రచన 1994-12-01
అల్లమురబ్బా ఆంధ్రజ్యోతి 1994-10-30
ఆంబోతు ఇండియా టుడే 1994-10-21
ఎంగిలి చేత్తో మయూరి 1994-02-12
కర్రోడు గబ్బిలం 1999-01-01
గలుమ ఆంధ్రజ్యోతి 1995-03-12
గుప్పెడు మనసు ఈనాడు 1993-10-31
చావు ఈనాడు 1990-03-25
జీవచ్చవం ఈనాడు 1991-09-08
టాకింగ్ డాల్ విపుల 1991-10-01
తీపి ఆంధ్రపత్రిక 1990-09-21
దగాదగా మేఘన 1998-11-01
నా తెలంగాణా ఆహ్వానం 1997-04-01
నిరీక్షణ విపుల 1988-07-01
నిరుడు కురిసిన సమూహాలు మయూరి 1997-08-01
నేలతల్లి స్వాతి 1995-12-01
ప్రస్థానం ప్రజాసాహితి 1985-01-01
బోధివృక్షం ఆంధ్రప్రభ 1990-07-25
భద్రత ఇండియా టుడే 1997-06-06
మమతలే మరుగై... ఈనాడు 1994-10-16
మళ్ళీ తల్లి ఒడిలోకి ఆంధ్రజ్యోతి 1993-01-22
మస్కట్ మల్లయ్య ఆంధ్రజ్యోతి 1995-06-02
యుద్ధభూమి విపుల 1997-04-01
రూపాయి రూపాయి వార్తాకాలం 1991-06-01
సృష్టికర్త ఆవేదన ఆంధ్రప్రభ 1994-08-31
సృష్టికర్తల చిరునామా ఆంధ్రప్రభ 1997-12-01
హింసరచన విపుల 1991-02-01

మూలాలు మార్చు

  1. కథా కిరణాలు - మన తెలుగు కథకులు, పైడిమర్రి రామకృష్ణ, పైడిమర్రి కమ్యూనికేషన్స్, ఖమ్మం, 2002.
  2. కధానిలయంలో పుస్తకం: కాలువ మల్లయ్య కథలు

ఆధార గ్రంధాలు మార్చు

  1. కాలువ మల్లయ్య కథలు – తెలంగాణా జన జీవితం – ప్రొఫెసర్‌ బన్న అయిలయ్య
  2. తొమ్మిది పదుల తెలంగాణ కథ – డా|| కాలువ మల్లయ్య
  3. యాభై ఏళ్ళ తెలుగు కథ తీరుతెన్నులు – బి.ఎస్‌.రాములు

ఇతర లింకులు మార్చు