పైడిమర్రి రామకృష్ణ

తెలుగు రచయిత

పైడిమర్రి రామకృష్ణ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రచయిత, రేడియోనాటక రచయిత. ఆయనకు 2013 సంవత్సరానికి గాను తెలుగు విశ్వవిద్యాలయం వారు బాల సాహిత్యం లో "కీర్తి పురస్కారం" ప్రకటించారు.[1] 2013 లోనే చింటుగాడి కథలు కు పొట్టి శ్రీరాములు బాలసాహిత్య సాహితీ పురస్కారం అందుకున్నారు. బాలసాహిత్యంలో ఇలా రెండు పురస్కారాలు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి అందుకున్న వారిలో పైడిమర్రి రామకృష్ణ మొదటివారు.

పైడిమర్రి రామకృష్ణ
జననం (1973-07-18) 1973 జూలై 18 (వయస్సు: 46  సంవత్సరాలు)
చదువుఎం. బి. ఎ
వృత్తిరచయిత
తల్లిదండ్రులు
 • నరసింహ మూర్తి (తండ్రి)
 • హేమలత (తల్లి)

జీవిత విశేషాలుసవరించు

పైడిమర్రి రామకృష్ణ 1973 జులై 18 న నరసింహమూర్తి, హేమలత దంపతులకు జన్మించారు. మార్కెటింగ్ లో ఎం.బి.ఏ పూర్తిచేశారు. టర్మినెక్స్ ఎస్.ఐ.ఎస్ ప్రైవేట్ లిమిటెడ్ లో రీజనల్ కీ ఎకౌంట్ మేనేజర్ గా ఉద్యోగం చేస్తున్నారు. మిమిక్రీ కళాకారుడిగా, మైమ్‌ కళాకారుడిగా, చిత్రకారుడిగా, రేడియో కళాకారుడిగా సుపరిచితులు. ఆయనకు చిన్నతనం నుండే కథల రచనపై ఆసక్తి ఎక్కువ. అందువల్ల ఆయన ఏడవ తరగతి చదిననప్పుడే బాలల పత్రిక బాలమిత్రకు సుమారు 150 కథలు రాసారు. బాలసాహిత్యంపై విశేష కృషి చేసి చిన్నపిల్లలు అర్థం చేసుకొనే రీతిలో వ్యవహారికభాషలో రచనలు చేసేవారు. జంతు,పక్షుల పాత్రలతో బాలలకోసం అనేక కథలు రాశారు. వీరి శైలి చాలా సరళంగా,బాలల సొంతగా చదువుకునేలా సుందరంగా ఉంటుంది.

రచనలుసవరించు

వీరు 450కి పైగా కథలు రచించారు. వాటిని సంకలనం చేసి అమూల్య గ్రంథాలుగా ప్రచురించారు. వాటిల్లో మామయ్య డాట్‌కామ్‌, అనగనగా ఒక అడవి, రంగుల రాట్నం, చింటుగాడి కథలు, మృగరాజుతీర్పు, బాలసాహితీ శిల్పులు ముఖ్యమైనవి. 1987 లో చిన్నారి బాలల మాసపత్రికలో బుద్ధికుశలత వీరి మొదటి ప్రచురణ కథ. ఈయన కథలు ఎక్కువగా బాలమిత్ర లోనే ప్రచురణ అయ్యాయి. సాహిత్యాభిమానులకు పరిచయం చేయాలనే లక్ష్యంతో ప్రముఖ దినపత్రిక సూర్యలో ఆదివారం అనుబంధంలో ఇప్పటిదాకా 150 మంది బాలసాహితీ రచయితలను పరిచయం చేశారు. ఒక కథ పిల్లల కోసం రాయాలంటే రచయిత బాలల స్థాయికి ఎదిగి రాయాలి అంతేగాని దిగికాదు అని అభిప్రాయపడతారు రామకృష్ణ. కథా కిరణాలు అనేది తెలుగు కథా రచయితల గురించి తెలియజేసే పుస్తకం. దీనిని పైడిమర్రి రామకృష్ణ రచించగా, పైడిమర్రి కమ్యూనికేషన్స్ ప్రచురించారు.

అవార్డులుసవరించు

 • 2000 : ఖమ్మం జిల్లా కలెక్టరు చేతులమీదుగా యూత్ అవార్డు, రెండువేల రూపాయల రివార్డు.
 • తెలుగు విశ్వవిద్యాలయం వారి 'బాలసాహిత్యం' లో "కీర్తి పురస్కారం"
 • తెలుగు విశ్వవిద్యాలయం వారి 'బాలసాహిత్యం' లో 'చింటుగాడి కథలు'కు "సాహితీ పురస్కారం.
 • చొక్కాపు వెంకట రమణ బాలసాహిత్య పురస్కారం
 • కొలసాని-చక్రపాణి బాలసాహిత్య పురస్కారం
 • వాసాల నరసయ్య బాలసాహిత్య పురస్కారం
 • బాలగోకులం వారి "బాలనేస్తం" బాలసాహిత్య పురస్కారం.
 • రాష్ట్రయువజన సర్వీసులవారి బాలసాహిత్య యూత్ అవార్డ్
 • బాలసాహిత్య పరిషత్ వారి 'బాలసాహితీ ప్రవీణ' 'బాలసాహితీ రత్న' పురస్కారాలు.
 • జాతీయ సాహిత్యపరిషత్ వారి సంటి అనిల్ కుమార్ బాలసాహిత్య పురస్కారం

మూలాలుసవరించు

ఇతర లింకులుసవరించు