కాల్వ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం

కాల్వ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, తెలంగాణ రాష్ట్రం, నిర్మల్ జిల్లా, దిలావర్ పూర్ మండలం, కాల్వ గ్రామంలో ఉన్న పురాతన హిందూ దేవాలయం.[1] కోరిన కోర్కెలు తీర్చే దేవుడిగా చుట్టూ అడవుల మధ్యన వెలిసిన కాల్వ నరసింహుడి దేవాలయం, కాకతీయుల కాలంలో నిర్మించబడింది.[2]

కాల్వ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం
కాల్వ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం
స్థానం
దేశం:భారతదేశం
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:నిర్మల్ జిల్లా
ప్రదేశం:కాల్వ, దిలావర్ పూర్ మండలం
నిర్మాణశైలి, సంస్కృతి
ప్రధానదైవం:నరసింహస్వామి
ప్రధాన పండుగలు:బ్రహ్మోత్సవాలు
నిర్మాణ శైలి:దక్షిణ భారతదేశం
చరిత్ర
నిర్మాత:కాకతీయులు

చరిత్ర

మార్చు

పూర్వం దేవాలయ వెనకభాగంలో కొండపైన స్వామివారు సింహరూపంలో స్వయంభువుగా వెలిశారని స్థల పురాణం చెబుతుంది. 13వ శతాబ్దంలో కాకతీయ రాజులు ఈదేవాలయాన్ని నిర్మించినట్టు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఔరంగజేబు చేసిన దాడిలో దేవాలయంలోని విగ్రహం ధ్వంసమడంతో 1985 వరకు గర్భాలయంలో స్వామివారి పాదుకలు మాత్రమే ఉండేవి. కొంతకాలం తరువాత మూలవిరాట్టు విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. ఏటా ఆయా తేదీల్లోనే స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుపబడుతాయి.[3]

ప్రత్యేకత

మార్చు
  • ఈ దేవాలయ కోనేరులోని నీరు ఋతువులు మారినట్లుగా ఆరు రంగులుగా మారుతుందని, ఈ కోనేరులో స్నానం చేస్తే చర్మ వ్యాధులు రావని, నీటిని పంటపొలాల్లో చల్లుకుంటే చీడపీడలు సోకకుండా పంటలు బాగా పండుతాయని స్థానికుల భక్తుల నమ్మకం.
  • మహాశివరాత్రి రోజున లక్ష్మీనరసింహస్వామికి ప్రత్యేక పూజలూ అభిషేకాలూ జరుగుతాయి.
  • సంతానం కోసం వచ్చే భక్తులకు బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారి గరుడ ముద్దలను ప్రసాదంగా అందిస్తారు.

ఉత్సవాలు

మార్చు

ప్రతి సంవత్సరం వారంరోజులపాటు కాల్వ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. వైశాఖ శుద్ధ చతుర్దశి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి, పౌర్ణమి రోజు స్వామి కల్యాణం జరుగుతుంది. స్వామి కల్యాణం రోజున నిర్మల్‌ బస్టాండ్‌ నుంచి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తారు.[2]

  • మొదటి రోజు: అఖండ దీపార్చన, నరసింహ స్వామి జయంతి అంకురార్పణ, హవనం, మంత్రపుష్పం
  • రెండవరోజు: అగ్ని, ధ్వజారోహణం, బలిహరణం, గరుడ ముద్దల పంపిణీ, అనంతరం స్వామి వారి కల్యాణం
  • మూడవరోజు: కుంకుమపూజలు
  • నాలుగవరోజు: భేరిపూజ హవనం
  • ఐదవరోజు: నివేదనలు
  • ఆరవరోజు: శేషహోమం, హవనం
  • ఏడవరోజు: స్వామివారి నాగవెల్లి, భూతబలి, ఉద్వాసన బలి, ఏకాంతోత్సవం
  • ఎనమిదవరోజు: రథోత్సవం

మూలాలు

మార్చు
  1. Telanganatoday (2021-09-15). "Telangana: Common good fund committee constituted for temples". Telangana Today. Archived from the original on 2021-09-14. Retrieved 2022-03-21.
  2. 2.0 2.1 telugu, NT News (2021-05-24). "కోర్కెలు తీర్చే కాల్వ నరసింహుడు". Namasthe Telangana. Archived from the original on 2022-03-21. Retrieved 2022-03-21.
  3. telugu, NT News (2022-03-20). "యాదాద్రి కాకుండా తెలంగాణ‌లో ఉన్న న‌ర‌సింహ‌స్వామి ఆల‌యాల గురించి తెలుసా". Namasthe Telangana. Archived from the original on 2022-03-21. Retrieved 2022-03-21.