కాళరాత్రి (నాటకం)
కాళరాత్రి 1953లో ప్రఖ్య శ్రీరామమూర్తి స్వేఛానుసరణ చేసిన సాంఘీక నాటకం.[1] హోవర్డ్ ఇర్వింగ్ యంగ్ రాసిన "హక్ ఐలాండ్" నాటకం ఆధారంగా ఈ నాటకం రాయబడింది.
కాళరాత్రి | |
కాళరాత్రి పుస్తక ముఖచిత్రం | |
కృతికర్త: | ప్రఖ్య శ్రీరామమూర్తి, (మూల నాటకం: హక్ ఐలాండ్, రచన: హోవర్డ్ ఇర్వింగ్) |
---|---|
సంపాదకులు: | బొందలపాటి శకుంతలాదేవి, శివరామకృష్ణ |
దేశం: | భారతదేశం |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | నాటకం |
ప్రచురణ: | దేశి కవితామండలి, దేశి ప్రెస్, విజయవాడ |
విడుదల: | జూలై 1953 |
పేజీలు: | 138 |
కథా నేపథ్యం
మార్చుమిత్రులతో కొన్నిరోజులు సరదాగా గడపడానికి భైరవలంకలోని తన ఎస్టేట్ రాజారావు వస్తాడు. ఆరోజు రాత్రి తుఫాన్ రావడంతో కరెంట్ పోతుంది. అప్పుడు వారంతా డిటెక్టివ్ ల గురించి, హత్యల గురించి గొప్పగా చెప్పుకుంటారు. వాళ్ళను పరీక్షించడానికి రాజారావు తను హత్య చేసినట్లు నాటకమాడుతాడు. అది నిజమైన హత్యగా మారుతుంది. ఉత్తుత్తి హత్య, నిజమైన హత్యగా ఎలా మారిపోయింది, అసలు హంతకుడెవరు, ఎందుకు చంపాడు అనేది మిగతా కథ.
పాత్రలు
మార్చుఈ నాటకంలోని పాత్రల వివరాలు[2]
- రాజారావు (జమీందారు-20 సం.)
- వెంకన్న (సేవకుడు-45 సం.)
- రామానుజం (డిటెక్టివ్ నవల రచయిత-40 సం.)
- నరహరి (రాజారావు స్నేహితుడు-40 సం.)
- నారాయణ (రాజారావు స్నేహితుడు-30 సం.)
- మోహన్ (రాజారావు స్నేహితుడు-25 సం.)
- సుకుమార్ (రాజారావు స్నేహితుడు-30 సం.)
- కమల (నరహరి భార్య-25 సం.)
- నళిని (ఎస్టేటు మేనేజరు కూతురు-20 సం.)
ప్రదర్శనల వివరాలు
మార్చు1. 1954, ఏప్రిల్ 19న విజయనగరం రవిరాజ్ మెమోరియల్ క్లబ్ తొలిసారిగా ప్రదర్శించిన వివరాలు:
- రాజారావు - జె.వి. సోమయాజులు
- నరహరి - యం. జోగారావు
- రామానుజం - జె.వి. రమణామూర్తి
- నారాయణ - వి.వి. అప్పారావు
- మోహన్ - వి.యస్. దీక్షిత్
- సుకుమార్ - జె.వి. శ్రీరామమూర్తి
- వెంకన్న - బి. విశ్వేశ్వరరావు
- కమల - రత్నకుమారి
- నళిని - రాజకుమారి
- నిర్వహణ - అప్పారావ్ దొర
2. 1954, అక్టోబరు 16న విజయవాడ శ్రీ నవ్యకళా మండలి సంస్థ ప్రదర్శించిన వివరాలు:
- రాజారావు - జె.వి. రమణామూర్తి[3]
- వెంకన్న - యం.వి. చలపతిరావు
- రామానుజం - కె. వెంకటేశ్వరరావు
- నరహరి - డి. జగన్నాథం
- నారాయణ - పి. శ్రీరామమూర్తి
- మోహన్ - సిహెచ్. శ్రీరాములు
- సుకుమార్ - కె. ప్రసాద్
- కమల - యస్. జయశ్రీ
- నళిని - ఆర్. నిర్మల
- దర్శకత్వం - కె.వి. వెంకటేశ్వరరావు
- నిర్మాత - పి. శ్రీరామమూర్తి
ఇతర వివరాలు
మార్చు1954/55లో హైదరాబాదులో జరిగిన ఆంధ్ర నాటక కళాపరిషత్తు నాటక పోటీలలో శ్రీకాకుళంకు చెందిన నాటక సంస్థ ఈ నాటకాన్ని ప్రదర్శించినప్పుడు ఇతర రచయితల నాటకాల కంటే ఎక్కువ ఆదరణ లభించడంతోపాటు జె. వి. రమణమూర్తికి ఉత్తమ నటుడిగా బహుమతి వచ్చింది.[4] ఈ ప్రదర్శనలో జె.వి.సోమయాజులు, రావి కొండలరావు నటించగా, సినీరచయిత డి.వి.నరసరాజు జడ్జిగా వచ్చాడు.[5]
మాలాలు
మార్చు- ↑ వెబ్ ఆర్కైవ్, నాటకాలు. "కాళరాత్రి". www.web.archive.org. Retrieved 20 June 2020.
- ↑ వెబ్ ఆర్కైవ్, పాత్రలు. "కాళరాత్రి (నాటకం)". www.web.archive.org. Retrieved 20 June 2020.
- ↑ సాక్షి, ఫ్యామిలీ (23 June 2016). "అభినయకళామూర్తి". రెంటాల జయదేవ. Archived from the original on 26 June 2016. Retrieved 20 June 2020.
- ↑ సితార, సినీ మార్గదర్శకులు. "వేదికపైనా... వెండితెరపైనా... వెలిగిన నటుడు!". www.sitara.net. ఆచారం షణ్ముఖాచారి. Archived from the original on 18 August 2019. Retrieved 20 June 2020.
- ↑ ప్రజాశక్తి, ఫీచర్స్ (23 November 2019). "సృజన దాగదు - నటన ఆగదు". బెందాళం క్రిష్ణారావు. Archived from the original on 20 June 2020. Retrieved 20 June 2020.