దేశి కవితామండలి
ప్రచురణ సంస్థ
దేశి కవితామండలి 1943లో కృష్ణా జిల్లా, ఘంటసాల కేంద్రంగా బొందలపాటి శివరామకృష్ణ, బొందలపాటి శకుంతలాదేవి దంపతులు ప్రారంభించిన ప్రచురణ సంస్థ. తరువాత ఈ సంస్థ విజయవాడకు మారింది. ఈ సంస్థ 500కు పైగా అనువాద రచనలను, నవలలను, కథాసంపుటులను, నాటకాలను, జీవిత చరిత్రలను ప్రచురించింది. ముఖ్యంగా బెంగాలీ నుండి శరత్ సాహిత్యాన్ని అనువదించి తెలుగు పాఠకులకు అందించిన ఘనత ఈ సంస్థకు దక్కుతుంది.
స్థాపన | 1943[1] |
---|---|
వ్యవస్థాపకులు | బొందలపాటి శివరామకృష్ణ, బొందలపాటి శకుంతలాదేవి |
కేంద్రీకరణ | ప్రచురణ సంస్థ |
కార్యస్థానం | |
అనుబంధ సంస్థలు | దేశీ గ్రంథమండలి, దేశీ ప్రచురణలు, దేశీ బుక్ డిస్ట్రిబ్యూటర్స్ |
ప్రచురణలు
మార్చుప్రచురణ సంవత్సరం | పుస్తకం పేరు | రచయిత | రచనా ప్రక్రియ | ఇతర వివరాలు |
---|---|---|---|---|
1944 | రాధబాబు | మునిమాణిక్యం నరసింహారావు | కథా సంపుటం | |
1944 | మన జమీందారీలు | గొఱ్ఱెపాటి వేంకట సుబ్బయ్య | పరిశోధన | |
1945 | శరత్ కథలు (2 భాగాలు) | శరత్, అనువాదం : శివరామకృష్ణ | కథా సంపుటం | అనువాదం |
1946 | జాతీయ విప్లవపంథా | ఎన్.జి.రంగా | సోషలిజం, భారత విప్లవం | |
1947 | ఘంటసాల చరిత్ర | గొఱ్ఱెపాటి వేంకట సుబ్బయ్య | చరిత్ర | |
1949 | గీతాపారాయణం | గోపీచంద్ | కథా సంపుటం | |
1949 | సరోజినీదేవి | గొఱ్ఱెపాటి వేంకట సుబ్బయ్య | జీవిత చరిత్ర | |
1950 | వీరాభిమన్య | శ్రీవాత్సవ | నాటకం | |
1951 | తల్లిప్రేమ | మునిమాణిక్యం | కథా సంపుటం | |
1951 | భార్యల్లోనేవుంది | గోపీచంద్ | కథా సంపుటం | |
1951 | మేడమెట్లు | బుచ్చిబాబు | కథా సంపుటం | |
1952 | తీరని కోరికలు | శ్రీవాత్సవ | నాటకం | |
1952 | ఆత్మహత్య, జనవరి ముప్పయ్ | డి.వి.నరసరాజు, ప్రఖ్య శ్రీరామమూర్తి | హాస్య నాటికలు | |
1952 | కథాసాగరం -01,02 కొడవటిగంటి కుటుంబరావు కథలు | కొడవటిగంటి కుటుంబరావు | కథా సంపుటం | |
1953 | మధురా వనం | కుమార రాఘవశాస్త్రి | కవిత్వం | |
1953 | కథాసాగరం -03 మాలతీ చందూర్ కథలు | మాలతీ చందూర్ | కథా సంపుటం | |
1953 | కథాసాగరం -04 పాలంకి వెంకటరామచంద్రమూర్తి కథలు | పాలంకి వెంకట రామచంద్రమూర్తి | కథా సంపుటం | |
1953 | అల్లుళ్ళు | మునిమాణిక్యం | కథా సంపుటం | |
1953 | కాళరాత్రి | ప్రఖ్యా శ్రీరామమూర్తి | నాటకం | హోవర్డ్ ఇర్వింగ్ యంగ్ రాసిన "హక్ ఐలాండ్" నాటకానికి స్వేచ్ఛానువాదం |
కథాసాగరం -05 పన్యాల రంగనాథరావు కథలు | పన్యాల రంగనాథరావు | కథా సంపుటం | ||
1954 | కథాసాగరం -06 సౌరిస్ కథలు | సౌరిస్ | కథా సంపుటం | |
1954 | కథాసాగరం -07 పిచ్చేశ్వరరావు కథలు | అట్లూరి పిచ్చేశ్వరరావు | కథా సంపుటం | |
1954 | కథాసాగరం -08 హితశ్రీ కథలు | హితశ్రీ | కథా సంపుటం | |
1955 | కథాసాగరం -09 శివం కథలు | శివం | కథా సంపుటం | |
1955 | కథాసాగరం -10 పంతుల శ్రీరామశాస్త్రి కథలు | పంతుల శ్రీరామశాస్త్రి | కథా సంపుటం | |
1955 | కథాసాగరం -11 వాసిరెడ్డి సీతాదేవి కథలు | వాసిరెడ్డి సీతాదేవి | కథా సంపుటం | |
1955 | కథాసాగరం -12 రావూరి భరద్వాజ కథలు | రావూరి భరద్వాజ | కథా సంపుటం | |
1955 | కథాసాగరం -13 రాచకొండ విశ్వనాథశాస్త్రి కథలు | రాచకొండ విశ్వనాథశాస్త్రి | కథా సంపుటం | |
1955 | కథాసాగరం -14 పురాణం సుబ్రహ్మణ్యశర్మ కథలు | పురాణం సుబ్రహ్మణ్యశర్మ | కథా సంపుటం | |
1955 | పెనుభూతం | టాల్‌స్టాయ్ అనువాదం:శైలేంద్ర | కథా సంపుటం | అనువాదం |
1955 | సవతి తల్లి | కొడవటిగంటి కుటుంబరావు | కథా సంపుటం | |
1955 | రేణుకాదేవి ఆత్మకథ | మాలతీ చందూర్ | నవల | |
1955 | జానకీ శర్మ | మునిమాణిక్యం | కథా సంపుటం | |
కథాసాగరం -15 ఇచ్ఛాపురపు జగన్నాథరావు కథలు | ఇచ్ఛాపురపు జగన్నాథరావు | కథా సంపుటం | ||
1956 | గోపీచంద్ నాటకాలు | గోపీచంద్ | నాటకాలు | |
1956 | కోడిగుడ్డంత గోధుమగింజ | టాల్‌స్టాయ్ అనువాదం:రెంటాల గోపాలకృష్ణ | కథా సంపుటం | అనువాదం |
1956 | పిచ్చివాని జ్ఞాపకాలు | టాల్‌స్టాయ్ అనువాదం:బెల్లంకొండ రామదాసు | కథా సంపుటం | అనువాదం |
1956 | పిల్లల కథలు | టాల్‌స్టాయ్ అనువాదం:రెంటాల గోపాలకృష్ణ | కథా సంపుటం | అనువాదం |
1956 | ప్రేమ ఉన్నచోట దేవుడున్నాడు | టాల్‌స్టాయ్ అనువాదం:రెంటాల గోపాలకృష్ణ | కథా సంపుటం | అనువాదం |
1956 | మూడు ఎలుగులు - మధ్య పసిపాప | టాల్‌స్టాయ్ అనువాదం:రెంటాల గోపాలకృష్ణ | కథా సంపుటం | అనువాదం |
1956 | చెప్పడం సులభం - చేయడం కష్టం! | టాల్‌స్టాయ్ అనువాదం:రెంటాల గోపాలకృష్ణ | కథా సంపుటం | అనువాదం |
1956 | రవ్వంత నిప్పు ఇల్లంతా కాలుస్తుంది! | టాల్‌స్టాయ్ అనువాదం:రెంటాల గోపాలకృష్ణ | కథా సంపుటం | అనువాదం |
1957 | మ్యూజింగ్స్ | చలం | వ్యాస సంపుటం | |
1957 | చలం నాటకాలు - జయదేవ | చలం | నాటకం | |
1957 | చలం నాటకాలు - సత్యం | చలం | నాటకం | |
1957 | చలం నాటకాలు - చిత్రాంగి | చలం | నాటకం | |
1957 | చలం నాటకాలు - త్యాగం | చలం | నాటకం | |
1957 | మనోరమ | పాకాల వెంకట రాజమన్నారు | నాటకం | |
1957 | ఉమర్ ఖయ్యామ్ | చిల్లర భావనారాయణరావు | నాటకం | |
1957 | కళ్యాణి | చలం | కథా సంపుటం | |
1957 | మహానుభావులు | సోమంచి యజ్ఞన్న శాస్త్రి | నాటకం | నికోలాయ్ గోగోల్ రాసిన రష్యన్ నాటకం రెవిజోర్‌కు స్వేచ్ఛానువాదం |
1958 | దేశం ఏమైంది! | ఎలన్ పేటన్ అనువాదం:రెంటాల గోపాలకృష్ణ | నవల | ఆఫ్రికన్ నవల 'క్రై ది బిలవ్డ్ కంట్రీ'కి అనువాదం. (దక్షిణ భాషా పుస్తక సంస్థ సహకారంతో) |
1958 | రాజమన్నారు నాటికలు | పాకాల వెంకట రాజమన్నారు | నాటికలు | |
1958 | ఆరుద్ర నాటికలు | ఆరుద్ర | నాటికలు | |
1958 | రాణీ సారంధ | ప్రేమ్‌చంద్ | నవల | అనువాదం |
1959 | ఆర్య కథామాల | రెంటాల గోపాలకృష్ణ | కథా సంకలనం | సంస్కృత పురాణాలలోని ప్రశస్త గాథలు (దక్షిణ భాషా పుస్తక సంస్థ సహకారంతో) |
1959 | మాట మన్నన | గొఱ్ఱెపాటి వేంకట సుబ్బయ్య | వ్యాసాలు | |
1960 | అభాగిని | గోపీచంద్ | నాటకం | |
1960 | నా స్మృతిపథంలో | జానకిరామ్ | స్వీయచరిత్ర | |
1960 | మట్టిబొమ్మలు | వనశ్రీ | కథా సంపుటం | |
1960 | రామకృష్ణ శాస్త్రి కథలు | మల్లాది రామకృష్ణశాస్త్రి | కథా సంపుటం | |
1960 | శరత్ కథలు 3,4 భాగాలు | శరత్ అనువాదం : శివరామకృష్ణ | కథా సంపుటం | అనువాదం |
1960 | శరత్ పిల్లల కథలు | శరత్ అనువాదం : సాంబశివరావు బాబ్జీ | కథా సంపుటం | అనువాదం |
1961 | మాకూ వున్నాయి స్వగతాలు | గోపీచంద్ | కథా సంపుటం | |
1961 | మాలిని | రవీంద్రనాథ్ ఠాగూర్ అనువాదం:రెంటాల గోపాలకృష్ణ | నాటకం | అనువాదం |
1961 | చీకటి గదిలో రాజు | రవీంద్రనాథ్ ఠాగూర్ అనువాదం:రెంటాల గోపాలకృష్ణ | నాటకాలు | అనువాదం |
1962 | కుంకుమరేఖలు | పి.సరళాదేవి | కథా సంపుటం | |
1962 | తొలిమజిలీ | యద్దనపూడి సులోచనారాణి | కథా సంపుటం | |
1962 | గుడిగంటలు | చిల్లర భావనారాయణరావు | నాటకం | |
1962 | మట్టే బంగారం | చిల్లర భావనారాయణరావు | నాటకం | |
1962 | రాజు-రాణి | రవీంద్రనాథ్ ఠాగూర్ అనువాదం:రెంటాల గోపాలకృష్ణ | నాటకం | అనువాదం |
1962 | బలిదానం | రవీంద్రనాథ్ ఠాగూర్ అనువాదం:రెంటాల గోపాలకృష్ణ | నాటకాలు | అనువాదం |
1962 | ఎర్రగన్నేరు | రవీంద్రనాథ్ ఠాగూర్ అనువాదం:రెంటాల గోపాలకృష్ణ | నాటకాలు | అనువాదం |
1962 | నటీపూజ | రవీంద్రనాథ్ ఠాగూర్ అనువాదం:రెంటాల గోపాలకృష్ణ | నాటకాలు | అనువాదం |
1963 | రఘువంశము | కాళిదాసు | కావ్యం | అనువాదం |
1963 | బ్రతికిన దినాలు | తూలికా భూషణ్ | కథా సంపుటం | |
1963 | పచ్చతోరణము | దేవులపల్లి రామానుజరావు | కవిత్వం | |
1963 | చీకటి కోణాలు | గోపీచంద్ | నాటకం | |
1963 | అశ్వఘోషుడు | ఆచార్య ఆత్రేయ | నాటకం | |
1963 | రసరేఖలు | సంజీవదేవ్ | ||
1963 | అక్షరాభిషేకం | గొఱ్ఱెపాటి వేంకట సుబ్బయ్య | ||
1964 | ఒక్క రూపాయి | ఆచార్య ఆత్రేయ | నాటకం | |
1964 | కాగితపు పడవలు | డి.రామలింగం | కథా సంపుటం | |
1964 | బాత్ ఏక్ రాత్ కీ | ఐ.వి.యస్. అచ్యుతవల్లి | కథా సంపుటం | |
1967 | మూడు కోతులు | బుచ్చిబాబు | కథా సంపుటం | |
అనురాగం | జార్జ్ ఇలియట్ అనువాదం:??? | కథా సంపుటం | అనువాదం | |
ఉత్తరాయణం | తారాశంకర్ బంద్యోపాధ్యాయ అనువాదం:బొందలపాటి శకుంతలాదేవి | కథా సంపుటం |
మూలాలు
మార్చు- ↑ నవోదయ రామమోహనరావు, నవభారత్ ప్రకాశరావు (1996). అఖిల భారత గ్రంథాలయ మహాసభల ప్రత్యేక సంచిక - తెలుగు పుస్తక ప్రచురణక్రమం (1 ed.). విజయవాడ. Retrieved 20 January 2024.
{{cite book}}
: CS1 maint: location missing publisher (link)