కాళింది కనుమ

ఉత్తరాఖండ్ లోని కనుమ

కాళింది కనుమ, లేదా కాళింది కల్ అనేది గంగోత్రి, ఘస్టోలి లను కలిపే ఎత్తైన పర్వత మార్గం.[1] 5,942 మీటర్లు (19,495 అ.) ఎత్తున ఉన్న ఈ కనుమ, గఢ్వాల్ హిమాలయాలలో ప్రసిద్ధమైన ట్రెక్కింగ్ కనుమ.[2] ఈ కనుమ భారీగా మంచుతో నిండి ఉంటుంది. కనుమకు పశ్చిమాన ఉన్న గ్లేసియర్ గంగోత్రి గ్లేసియర్‌లోకి ప్రవహిస్తుంది. ఇదే గంగానది ఉద్భవ స్థానం.

కాళింది కనుమ
సముద్ర మట్టం
నుండి ఎత్తు
5,942 m (19,495 ft)
ప్రదేశంఉత్తరకాశి జిల్లా, గఢ్వాల్ డివిజన్, ఉత్తరాఖండ్, భారతదేశం
శ్రేణిగఢ్వాల్ హిమాలయాలు, గ్రేటర్ హిమాలయాలు
Coordinates30°55′04″N 79°16′56″E / 30.91773°N 79.28218°E / 30.91773; 79.28218

చరిత్ర

మార్చు

జాన్ బిక్నెల్ ఆడెన్ 1936లో గఢ్వాల్ హిమల్‌పై తన సర్వే నివేదికలో ఈ కనుమను పేర్కొన్నాడు.[3]

"మానా హిమానీనదపు ఆగ్నేయ శాఖ తూర్పు చివరలో 19,500 అడుగుల ఎత్తున, సులభంగా ఎక్కగలిగే ఒక కనుమ ఉంది. దానికి తూర్పున 4 మైళ్ల దూరంలో సరస్వతి లోయ ఉంది" అని అతడు ఆ నివేదికలో రాసాడు.

కానీ గంగోత్రికి అదే దారిలో తిరిగి రావాల్సిన అవసరం ఉన్నందున ఎప్పుడూ ఎక్కలేదు. స్వామి ప్రబోధానందవాస్, జాన్ బిక్నెల్ ఆడెన్ రాసిన నివేదిక నుండి ప్రేరణ పొంది, ఈ కనుమను దాటడానికి మొదటి భారతీయ యాత్రను నిర్వహించాడు. స్వామి ప్రబోధానంద నాయకత్వంలో, దిలీప్ సింగ్ మార్గదర్శకత్వంలో ఈ యాత్రను చేపట్టి, 1945 జూలై 22 న కనుమను అధిరోహించారు.[4]

ట్రెక్కింగ్

మార్చు

కాళింది కల్, గర్హ్వాల్ హిమాలయాలలో అత్యంత ప్రసిద్ధ ట్రెక్కింగ్ కనుమ అయినప్పటికీ, ట్రెక్కింగుకు ఇది ఒక సవాలుగా నిలిచింది. ఇది హిమాలయ శ్రేణిలో, అత్యంత ఎత్తున ఉన్న కనుమల్లో ఇది రెండవది.

మార్గం

మార్చు

మూలం: [5]

వాతావరణానికి అలవాటుపడ్డాక ట్రెక్కింగుకు 6 రోజులు పడుతుంది. సాధారణంగా వేసవిలో జూన్ మధ్య నుండి సెప్టెంబరు మధ్య వరకు ట్రెక్కింగు జరుగుతుంది. ఇన్నర్‌లైన్ అనుమతి అవసరం.[6]

గోముక్ (4023 మీ) : గంగోత్రి గ్లేసియర్ ప్రారంభం వరకూ గంగానది వెంబడి సాగే విశాలమైన సులభమైన మార్గం. ఇది క్రమంగా ఎత్తు పెరుగుతుంది.

వాసుకి పర్వతం (4800 మీ) : గంగోత్రి హిమానీనదపు మొరైన్‌లను ఎక్కాలి, ఆ తర్వాత తూర్పున ఉన్న ఘౌమ్క్ హిమానీనదం వరకు అధిరోహణ ప్రారంభమవుతుంది. ఈ హిమానీనదానికి దక్షిణాన వాసుక్ పర్వత్ అనే కొన్ని పచ్చికభూములు ఉన్నాయి.

గ్లేసియర్ క్యాంప్ (5200 మీ) : మొరైన్ నిండిన హిమానీనదం మీద కఠినమైన అధిరోహణ. క్యాంపింగ్ మొరైన్‌ల మధ్య ఉంది.

కాళింది బేస్ క్యాంప్ (5560 మీ) : హిమానీనదం విడిపోతుంది. ఈ మార్గం కాళింది హిమానీనదాన్ని అనుసరించడానికి ఉత్తరాన వెళుతుంది.

రివర్ క్యాంప్ (4770 మీ) : ప్రధాన గ్లేసియర్‌ను అనుసరించి మార్గం ఆగి, కాళింది కనుమ వైపు నిటారుగా వెళుతుంది. మరొక వైపున ఈ మార్గం తెల్లటి హిమానీనదం మీదుగా వెళుతుంది. హిమానీనదం నుండి బయటపడిన తర్వాత ఈ మార్గం పశ్చిమాన ఉన్న మొదటి లోయ వరకు దిగుతుంది. ఇక్కడ లోయ చాలా విశాలంగా ఉంటుంది. క్యాంపింగ్ స్పాట్‌లు పుష్కలంగా ఉన్నాయి. ఇక్కడి నుండి ఒక కాలిబాట కనిపిస్తుంది.

గాస్టోలి (3980) : ఈ కాలిబాట, ప్రవాహపు దక్షిణ ఒడ్డున ఉన్న లోయకు దారి తీస్తుంది. లోయ మానా కనుమ రోడ్డు పక్కన ఉన్న గాస్టోలి మిలిటరీ అవుట్‌పోస్ట్ వద్ద ముగుస్తుంది.

కాళింది ఖల్ కనుమ ట్రెక్ భాగీరథి లోయ నుండి అలకనంద లోయ వరకు గర్హ్వాల్‌ను సగం చుట్టుముడుతుంది. ఇంతకు ముందు అధిక ఎత్తులో ట్రెక్కింగ్ చేసిన వారు మాత్రమే ఈ యాత్ర చెయ్యగలరు; అత్యంత అనుభవజ్ఞులైన అధిరోహకులకు కూడా థ్రిల్‌ ఇస్తుంది. కాళింది ఖల్ కనుమ ట్రెక్కింగ్ సముద్ర మట్టానికి 5942 మీటర్ల ఎత్తున సాగుతుంది. ఈ దారి భాగీరథి, అలకనంద నదీ వ్యవస్థల పరీవాహక ప్రాంతాలను విభజిస్తుంది. షిప్టన్ టిల్మాన్ లు దీన్ని 1934లో కనుగొన్నారు.

ఈ 86 కి.మీ. పొడవైన కాలిబాట గంగోత్రి, బద్రీనాథ్ పుణ్యక్షేత్రాలను దాదాపు 6000 మీటర్ల ఎత్తులో ఉన్న హిమానీనద మార్గంలో కలుపుతుంది. ఈ దారి ఎక్కువగా మొరైన్‌లు,[గమనిక 1][గమనిక 2] మంచు పొలాల మీదుగా లోతైన పగుళ్ళతో కూడుకుని ఉంటుంది.

ఇవి కూడా చూడండి

మార్చు

గమనికలు

మార్చు
  1. హిమానీనదం ద్వారా కొట్టుకొచ్చి దాని అంచుల వద్ద మేట వేసిన రాళ్ళు, నిక్షేపాలు.
  2. హిమానీనదం ద్వారా కొట్టుకొచ్చి దాని అంచుల వద్ద మేట వేసిన రాళ్ళు, నిక్షేపాలు

మూలాలు

మార్చు
  1. "Wikimapia location".
  2. "Die Berge des Himalaya". www.himalaya-info.org.
  3. Auden, John (1940). "A SEASON'S WORK IN THE CENTRAL HIMALAYA".
  4. . "Looking Back - A Trek Within".
  5. "Kalindi khal trek". Indiahikes.com.
  6. "The Great Himalayan Trail". www.greathimalayatrail.com.