ఉత్తరకాశి జిల్లా

ఉత్తరకాశీ జిల్లా ఉత్తరాఖండ్ రాష్ట్రం లోని జిల్లాల్లో ఒకటి. ఇది గర్వాల్ డివిజన్‌లో భాగం. ఉత్తరకాశీ నగరం దాని ముఖ్యపట్టణం. జిల్లాలో బార్కోట్, దుండా, భట్వాడి, చిన్యాలిసౌర్, పురోలా, మోరీ అనే ఆరు తాలూకాలు ఉన్నాయి. ఉత్తరకాశీ జిల్లా 1960 ఫిబ్రవరి 24 న స్థాపించబడింది. జిల్లా లోని గంగోత్రి వద్ద భాగీరథి నది (గంగానది ప్రధాన ప్రవాహం) యమునోత్రి వద్ద యమునా నది ఉద్భవిస్తున్నాయి. ఈ రెండూ అత్యంత ముఖ్యమైన, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు. గంగోత్రికి వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న ఉత్తరకాశీ పట్టణం, హిందువులకు ముఖ్యమైన తీర్థయాత్రా స్థలం. జిల్లాకు ఉత్తరాన హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్, సిమ్లా జిల్లాలు, ఈశాన్య సరిహద్దులో టిబెట్, తూర్పున చమోలి జిల్లా, ఆగ్నేయంలో రుద్రప్రయాగ జిల్లా, దక్షిణ సరిహద్దులో టెహ్రీ గర్వాల్ జిల్లా, పశ్చిమాన డెహ్రాడూన్ జిల్లాలు ఉన్నాయి .

ఉత్తరకాశీ జిల్లా
జిల్లా
భగీరథి ఉద్భవించే గోముఖ్
భగీరథి ఉద్భవించే గోముఖ్
ఉత్తరాఖండ్ పటంలో జిల్లా స్థానం
ఉత్తరాఖండ్ పటంలో జిల్లా స్థానం
Coordinates: 30°44′N 78°27′E / 30.73°N 78.45°E / 30.73; 78.45
దేశం India
రాష్ట్రందస్త్రం:..Uttarakhand Flag(INDIA).png Uttarakhand
డివిజనుగఢ్వాల్
Headquartersఉత్తరకాశీ
విస్తీర్ణం
 • Total8,016 కి.మీ2 (3,095 చ. మై)
జనాభా
 • Total3,30,086
 • జనసాంద్రత41/కి.మీ2 (110/చ. మై.)
భాషలు
 • స్థానికగఢ్వాలీ, జాద్
Time zoneUTC+5:30 (IST)
Vehicle registrationUK

భౌగోళికం

మార్చు

ఉత్తరకాశీ జిల్లా హిమానీనదాలు

మార్చు
హిమానీనదం ఎత్తు (మీ)
గంగోత్రి గ్లేసియర్ 4,040
చతురంగి 4,400
1 చతురంగి పేరు తెలియని TG 5,120
కాళింది 5,440
సీత 5,400
సురలయ 5,120
II చతురంగి పేరు తెలియని TG 5,190
III చతురంగి పేరులేని TG 4,980
వాసుకి 4,800
భాగీరథి పర్వతం I 6,512
భాగీరథి పర్వతం II 6,556
భాగీరథి పర్వతం III 6,195
భగీరథి పర్వతం IV 6,625
స్వచ్ఛంద్ 4,880
మియాండి 4,980
సుమేరు 4,900
ఘనోహిమ్ 4,740
కీర్తి, దాని ఉప హిమానీ నదాలు (TG)
(ఎ) కీర్తి 4,520
(బి) పేరు లేని TG 4,570
(సి) II పేరులేని TG 4,860
(డి) III పేరులేని TG 4,860
నేరుగా భాగీరథి నదిలోకి ప్రవహించే హిమానీనదాలు
మైత్రి 4,000
మేరు 4,720
భృగుపంత్ 3,720
మందా 3,880
రక్తవర్ణ, దాని ఉప హిమానీనదాలు (TG)
(ఎ) రక్తవర్ణ 4,500
(బి) తేలు 5,040
(సి) శ్వేతాంబర్ 4,760
(డి) పేరులేని TG 5,100
(ఇ) II పేరులేని TG 5,240
(యఫ్) నీలాంబర్ 5,300
(జి) III పేరులేని TG 5,200
(హచ్) పీలాపానీ 5,080

ప్రకృతి వైపరీత్యాలు

మార్చు
  • 1978: కండోలియా గార్డ్ అనే చిన్న వాగులో మేటవేసిన శిథిలాలతో నిర్మించిన ఆనకట్ట కారణంగా భాగీరథి నదిలో వరదలు వచ్చాయి. పేలుడు పదార్థాలను ఉపయోగించి సైన్యం ఆనకట్టను బద్దలు కొట్టింది. వాగులో ప్రవహించిన నీరు ఒడ్డున ఉన్న వ్యవసాయ భూములకు, ఆశ్రమాలకూ, ఇళ్లకూ నష్టం కలిగించింది. వాగు ఒడ్డున ఉన్న పల్లపు ప్రాంతాలను ఖాళీ చేయించి జిల్లా యంత్రాంగం తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పెద్దగా ప్రాణ నష్టం జరగలేదు.
  • 1984: జ్ఞానసు నాలాలో పెనువృష్టి (క్లౌడ్ బరస్ట్) కురిసింది.
  • 1991 భూకంపం: 1991 అక్టోబరు 20, ఉత్తరకాశీ సమీప ప్రాంతాల్లో రిచర్ స్కేల్‌పై 6.8 తీవ్రత కలిగిన భూకంపం సంభవించింది.
  • 2003: 2003 సెప్టెంబరు 23న ఉత్తరకాశీలో కొండచరియలు విరిగిపడటంతో బస్టాండ్ ప్రాంతంలోని హోటళ్లు, దుకాణాలు ధ్వంసమయ్యాయి. మసీదు మొహల్లా ప్రాంతంలోని హార్టికల్చర్ డిపార్ట్‌మెంట్ హౌసింగ్ కాలనీ వారుణావత పర్వతం పై నుండి పడిన శిథిలాల కింద పూర్తిగా ధ్వంసమైంది.
  • 2013 ఉత్తరాఖండ్ వరదలు : అసి గంగా నది పరీవాహక ప్రాంతం, భాగీరథి నది పరీవాహక ప్రాంతంలో పెనువృష్టి (క్లౌడ్ బరస్ట్) కురిసి ఉత్తరకాశీ వరదలు సంభవించాయి. ఆకస్మిక వరదలు రెండు నదుల ఒడ్డున ఉన్న ఆస్తులకు, పంటలకూ పెద్ద ఎత్తున నష్టం కలిగించాయి. చాలా హోటళ్లు భాగీరథి నది వరద నీటిలో కొట్టుకుపోయాయి (ఆకాశ గంగా హోటల్, గౌతమ్ పార్క్ హోటల్ భాగం, జోషియారా వద్ద PWD కార్యాలయం మొదలైనవి). వరదల సమయంలో చాలా వంతెనలు ధ్వంసమయ్యాయి (దిడ్సారి సస్పెన్షన్ బ్రిడ్జ్, నలునా సస్పెన్షన్ బ్రిడ్జ్, జోషియరా సస్పెన్షన్ బ్రిడ్జ్, అథాలి సస్పెన్షన్ బ్రిడ్జ్ మొదలైనవి).

జనాభా వివరాలు

మార్చు

ఉత్తరకాశీ జిల్లాలో మతం (2011)[1]

  ఇస్లాం (1.08%)
  బౌద్ధం (0.17%)
  జైనమతం (0.02%)
  ఇతరాలు (0.03%)
  వెల్లడించనివారు (0.12%)

2011 భారత జనాభా లెక్కల ప్రకారం ఉత్తరకాశీ జిల్లా జనాభా 3,30,086, [2] ఇది బెలిజ్ దేశానికి దాదాపు సమానం.[3] ఇది భారతదేశంలోని 688 జిల్లాలలో జనాభా పరంగా 567వ స్థానంలో ఉంది.[2] జనసాంద్రత 41/చ.కి.మీ.[2] 2001-2011 దశాబ్దంలో జిల్లా జనాభా వృద్ధి రేటు 11.75%.[2] లింగనిష్పత్తి ప్రతి 1000 మంది పురుషులకు 959 స్త్రీలు [2] జిల్లా అక్షరాస్యత రేటు 75.98%.[2]

భాషలు

మార్చు

2011 జనాభా లెక్కల ప్రకారం, జిల్లా జనాభాలో 88% మంది గర్వాలీ, 7.28% మంది హిందీ, 2.17% మంది నేపాలీ మొదటి భాషగా మాట్లాడతారు. వివిధ దేశీయ టిబెటిక్ భాషలు మాట్లాడేవారు జిల్లా జనాభాలో 2.59% మంది ఉంటారు.[4]

రాజకీయ విభజనలు

మార్చు

లోక్‌సభ నియోజకవర్గం

మార్చు

ఉత్తరకాశీ జిల్లా తెహ్రీ గఢ్వాల్ (లోక్‌సభ నియోజకవర్గం) పరిధిలోకి వస్తుంది.

అసెంబ్లీ నియోజకవర్గాలు

మార్చు
  1. పురోలా (ఎస్.సి రిజర్వుడు)
  2. యమునోత్రి
  3. గంగోత్రి

తహసీల్‌లు

మార్చు

జిల్లాలో ఆరు తహసీల్‌లు ఉన్నాయి. అవి: బార్కోట్, దుండా, భట్వాడి, చిన్యాలిసౌర్, పురోలా, మోరి.

మూలాలు

మార్చు
  1. "Uttarkashi District Population". Census India. Retrieved 11 July 2021.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  3. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Belize 321,115 July 2011 est.
  4. C-16 Population By Mother Tongue – Uttarakhand (Report). Office of the Registrar General & Census Commissioner, India. Retrieved 14 July 2020.