కాశీమజిలీ కథలు

కాశీమజిలీకధలు

కాశీ మజిలీ కథలు మధిర సుబ్బన్న దీక్షితకవి రచించిన కథల సంకలనం. దీనిని దీక్షితకవి 12 భాగములుగా వచనమున రచించెను.

మధిర సుబ్బన్న దీక్షతులు
మధిర సుబ్బన్న దీక్షతులు

దీని రెండవకూర్పు కవిగారి పుత్రుడు కొండయ్యశాస్త్రిచే 1950లో ప్రచురించబడినది. దీనిని 1934లో కందుల సూర్యారావు, రాజమండ్రి వారు రామమోహన ముద్రాక్షరశాల యందు ముద్రించారు.

కథల నేపథ్యంసవరించు

మణిసిద్ధుడనే యతి, గోపకుమారునితో దక్షిణాత్య ప్రాంతం నుంచి హిందువులకు పరమ పవిత్ర స్థలమైన కాశీ చేరుకునేందుకు కాలినడకన ప్రయాణమవుతారు. ఆ దారిలో జరిగే కథతో పాటు కాశీయాత్రలో వేసుకునే ప్రతి మజిలీలోనూ కథలు చెప్పుకుంటూంటారు. ఆ గొలుసుకట్టు కథలన్నింటి సంకలనం ఈ కాశీమజిలీ కథలు. ఈ గ్రంథం తెలుగు వారిలో మంచి పేరొందింది.

ఇతివృత్తంసవరించు

అవిభక్త ఘట్టభూమిగా, మోక్షభూమిగా పేరుపొందిన కాశీ పట్టణం వెళ్ళేందుకు మణిసిద్ధుడు అనే విద్యావంతుడైన బ్రాహ్మణ బ్రహ్మచారి సంకల్పించుకుంటాడు. వాహన సదుపాయాలు లేకపోవడం, నదులు, కొండల వల్ల మార్గం దుర్గమంగా ఉండడంతో ఎవరైనా తోడు వస్తే బాగుంటుందని భావిస్తాడు. ఎందరినో అడిగినా వారు భయపడి రాలేదు. తుదకు శ్రీరంగపురం ఊరి శివార్లలో జీవించే పశువుల కాపరి, అనాథయైన కోటప్ప మాత్రం బయలుదేరాడు. ఆ గోపాలకుడు, మణిసిద్ధుడు కాశీకి మజిలీలు చేసుకుంటూ బయలుదేరడం ప్రధాన కథ కాగా ఆపైన ఎన్నెన్నో ఉపకథలు, గొలుసుకట్టు కథలు ఉంటాయి. మార్గమధ్యంలో తనకు వింత వింత కథలు చెప్పి అలసట పోగొట్టి ఆహ్లాదం కలిగిస్తే వస్తానని గోపాలుడు పెట్టిన షరతుకు ఫలితమే ఆ కథలు. కథలలో పతివ్రతల ప్రభావము, దుష్టస్త్రీల కుచ్చితచేష్టలు, సత్పురుష సాంగత్యము వలన కలుగు లాభములు, దుష్టుల సహవాసము కలుగు నష్టములు, దేశాటనము పండితసంపర్కములవలన కలుగు జ్ఞానము, రాజనీతి, వ్యవహార వివేకము, వదాన్యలక్షణము, లోభిప్రవృత్తి మున్నగు అనేక విశేషములు వర్ణించబడినవి. ఇవికాక కృష్ణదేవరాయలు, భోజరాజు, శంకరాచార్యులు, విక్రమార్కుడు, నారదుడు, ప్రహ్లాదుడు మొదలైన మహాపురుషుల చరిత్రలను విచిత్రముగా వ్రాయబడ్డాయి.

కథలుసవరించు

కొన్ని మజిలీలలోని కథల పేర్లు ఇవి:[1]

13 majili,puri jagannnadh vaibhavam
 • 210 మజిలీ, నారదమహర్షి కథ
 • 211 మజిలీ, నారదుని గంధర్వ జన్మము
 • 212 మజిలీ, ఉపబహణుని వివాహము
 • 213 మజిలీ, మాలావతి కథ
 • 214 మజిలీ, కళావతి కథ
 • 215 మజిలీ, నారద వివాహము
 • 216 మజిలీ, నారదుని స్త్రీజన్మము
 • 217 మజిలీ, వీరవర్మ కథ, పద్మసేన కథ
 • 218 మజిలీ, సుధనన్వుని కథ
 • 219 మజిలీ, రత్నావతి కథ
 • 220 మజిలీ, అతలరాజ్యము
 • 221 మజిలీ, రాగవర్థనుని కథ
 • 222 మజిలీ, జయమల్లుని కథ
 • 223 మజిలీ, ఉత్తర దిగ్విజయము, విద్యాసాగరుని కథ
 • 224 మజిలీ, ప్రమద్వరక కథ
 • 225 మజిలీ, చిలుకమువ్వల కథ
 • 226 మజిలీ, చిలుక పురుషుడైన కథ
 • 227 మజిలీ, చిలుకలు గుర్రములైన కథ
 • 228 మజిలీ, చిలుక బ్రహ్మరాక్షసుడైన కథ
 • 229 మజిలీ, బ్రహ్మరాక్షసుని కథ, హరివర్మాదుల కథ, చారుమతి కథ
 • 230 మజిలీ, చారుమతి కథ
 • 231 మజిలీ, స్వగ్రామ ప్రయాణము
 • 232 మజిలీ, పశ్చిమ దిగ్విజయము
 • 233 మజిలీ, దేవకన్యల కథ
 • 234 మజిలీ, గుణకేశిని కథ
 • 235 మజిలీ, సుముఖుని కథ
 • 236 మజిలీ, సావిత్రి కథ
 • 237, 238 మజిలీలు, క్రోధనుని కథ
 • 239 మజిలీ, దక్షిణ దిగ్విజయము, పుష్పకేతుని కథ
 • 240 మజిలీ, మణిమంతుని కథ
 • 241 మజిలీ, కుందమాల కథ
 • 242, 243 మజిలీలు, మయూరధ్వజుని కథ, గోపాలుని కథ, పింగళిక కథ, జగన్మోహిని కథ
 • 244, 245 మజిలీలు, నారదుని స్వస్వరూపప్రాప్తి
 • 246 మజిలీ, శుకనారద సంవాదము
 • 247 మజిలీ, నాగుని కథ
 • 248 మజిలీ, నారదపంచచూడ సంవాదము
 • 249 మజిలీ, కలియుగ ధర్మములు

ప్రాచుర్యంసవరించు

కాశీమజిలీ కథలు విస్తృతమైన ప్రజాదరణ, పాఠకాసక్తిని సాధించి తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఈ కథలు పాఠకులను చదివింపజేయడమే కాక పలువురు గ్రంథకర్తలు స్పందించేలా చేశాయి.

 • కాశీమజిలీ కథలు సినిమా రంగంపై కూడా తమ ప్రభావం చూపాయి. ఈ కథలు తెలుగు జానపద చలన చిత్రాలను విపరీతంగా ప్రభావితం చేశాయి. కొన్ని చిత్రాలలో కథలకు కథలు యధాతథంగా స్వీకరించి ఉపయోగించుకున్నారు.[2]
 • సాహిత్యరంగంలో పలువురు రచయితలు వీటిని అనుసరించి లేదా వీటి స్ఫూర్తితో రచనలు చేశారు. కొన్ని పేదరాశి పెద్దమ్మకథలు, చందమామ కథలు, మర్యాద రామన్న కథల్లో కాశీమజిలీ కథలలోని ఇతివృత్తాలు, శైలి, నాటకీయత, శిల్పం వంటివి అనుసరించినట్లు తెలుస్తుంది.[2]

ఇతరుల మాటలుసవరించు

 • ఇవి కేవలము కథల వంటివేగాక వ్యాకరణాది శాస్త్ర సంప్రదాయములయందేమి యలంకారాదుల యందేమి మన ప్రాచీన కావ్యములకించుక దీసిపోవు.. -చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి
 • ఇందు పారమార్థికులకు తప్ప సామాన్యులకు రుచింపని శంకరాచార్య చరిత్రములతి రసవంతములుగ బరమార్థ బోధకంబులుగ కథా ధోరణిగ కూర్పబడినవి. -మానవల్లి రామకృష్ణ కవి

మూలాలుసవరించు

 1. భారత డిజిటల్ లైబ్రరీలో కాశీమజిలీ కథలు 10వ భాగము పుస్తక ప్రతి.
 2. 2.0 2.1 కాశీ చేరుతున్న మజిలీ కథలు:దేవవరపు నీలకంఠరావు:తెలుగు వెలుగు పత్రిక:సెప్టెంబర్ 2014:పేజీ.24-26