కాశీమజిలీ కథలు

కాశీమజిలీకధలు
(కాశీ మజిలీ కథలు నుండి దారిమార్పు చెందింది)

కాశీ మజిలీ కథలు మధిర సుబ్బన్న దీక్షితకవి రచించిన కథల సంకలనం. దీనిని దీక్షితకవి 12 భాగములుగా వచనమున రచించెను.

మధిర సుబ్బన్న దీక్షతులు
మధిర సుబ్బన్న దీక్షతులు

దీని రెండవకూర్పు కవిగారి పుత్రుడు కొండయ్యశాస్త్రిచే 1950లో ప్రచురించబడింది. దీనిని 1934లో కందుల సూర్యారావు బ్రదర్సు, రాజమండ్రి వారి రామమోహన ముద్రాక్షరశాల యందు ముద్రించారు.

కథల నేపథ్యం

మార్చు

మణిసిద్ధుడనే యతి, గోపకుమారునితో దక్షిణాత్య ప్రాంతం నుంచి హిందువులకు పరమ పవిత్ర స్థలమైన కాశీ చేరుకునేందుకు కాలినడకన ప్రయాణమవుతారు. ఆ దారిలో జరిగే కథతో పాటు కాశీయాత్రలో వేసుకునే ప్రతి మజిలీలోనూ కథలు చెప్పుకుంటూంటారు. ఆ గొలుసుకట్టు కథలన్నింటి సంకలనం ఈ కాశీమజిలీ కథలు. ఈ గ్రంథం తెలుగు వారిలో మంచి పేరొందింది.

ఇతివృత్తం

మార్చు

అవిభక్త ఘట్టభూమిగా, మోక్షభూమిగా పేరుపొందిన కాశీ పట్టణం వెళ్ళేందుకు మణిసిద్ధుడు అనే విద్యావంతుడైన బ్రాహ్మణ బ్రహ్మచారి సంకల్పించుకుంటాడు. వాహన సదుపాయాలు లేకపోవడం, నదులు, కొండల వల్ల మార్గం దుర్గమంగా ఉండడంతో ఎవరైనా తోడు వస్తే బాగుంటుందని భావిస్తాడు. ఎందరినో అడిగినా వారు భయపడి రాలేదు. తుదకు శ్రీరంగపురం ఊరి శివార్లలో జీవించే పశువుల కాపరి, అనాథయైన కోటప్ప మాత్రం బయలుదేరాడు. ఆ గోపాలకుడు, మణిసిద్ధుడు కాశీకి మజిలీలు చేసుకుంటూ బయలుదేరడం ప్రధాన కథ కాగా ఆపైన ఎన్నెన్నో ఉపకథలు, గొలుసుకట్టు కథలు ఉంటాయి. మార్గమధ్యంలో తనకు వింత వింత కథలు చెప్పి అలసట పోగొట్టి ఆహ్లాదం కలిగిస్తే వస్తానని గోపాలుడు పెట్టిన షరతుకు ఫలితమే ఆ కథలు. కథలలో పతివ్రతల ప్రభావము, దుష్టస్త్రీల కుచ్చితచేష్టలు, సత్పురుష సాంగత్యము వలన కలుగు లాభములు, దుష్టుల సహవాసము కలుగు నష్టములు, దేశాటనము పండితసంపర్కములవలన కలుగు జ్ఞానము, రాజనీతి, వ్యవహార వివేకము, వదాన్యలక్షణము, లోభిప్రవృత్తి మున్నగు అనేక విశేషములు వర్ణించబడినవి. ఇవికాక కృష్ణదేవరాయలు, భోజరాజు, శంకరాచార్యులు, విక్రమార్కుడు, నారదుడు, ప్రహ్లాదుడు మొదలైన మహాపురుషుల చరిత్రలను విచిత్రముగా వ్రాయబడ్డాయి.

కూర్పులు-ముద్రణ

మార్చు

కాశీమజిలీకథల మొదటికూర్పు 1926లో ముద్రించబడింది. మధిర సుబ్బన్న దీక్షితులు వివరించిన ప్రకారం మొదట 10 భాగాలను రచించి; 11, 12 భాగాలను తదుపరికాలంలో పూర్తిచేయుదునని వివరించెను.[1] రెండవకూర్పు రచయిత కుమారుడైన మధిర కొండయ్యశాస్త్రి తండ్రి మరణానంతరం 1934లో వివరించిన ప్రకారం 12వ భాగంలోని నారదుని చరిత్రతో పూర్తిచేసెను. రెండవకూర్పును కందుల సూర్యారావు బ్రదర్సు, రాజమండ్రి వారు ముద్రించారు.[2]

మజిలీలు-కథలు

మార్చు

12 భాగాలుగా ముద్రించబడిన సుమారు 300 పైగా మజిలీలలోని కథల పేర్లు జాబితాగా కాశీమజిలీ కథల పూర్తి జాబితా ఇక్కడ వున్నవి.

ప్రాచుర్యం

మార్చు

కాశీమజిలీ కథలు విస్తృతమైన ప్రజాదరణ, పాఠకాసక్తిని సాధించి తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఈ కథలు పాఠకులను చదివింపజేయడమే కాక పలువురు గ్రంథకర్తలు స్పందించేలా చేశాయి.

  • కాశీమజిలీ కథలు సినిమా రంగంపై కూడా తమ ప్రభావం చూపాయి. ఈ కథలు తెలుగు జానపద చలన చిత్రాలను విపరీతంగా ప్రభావితం చేశాయి. కొన్ని చిత్రాలలో కథలకు కథలు యధాతథంగా స్వీకరించి ఉపయోగించుకున్నారు.[3]
  • సాహిత్యరంగంలో పలువురు రచయితలు వీటిని అనుసరించి లేదా వీటి స్ఫూర్తితో రచనలు చేశారు. కొన్ని పేదరాశి పెద్దమ్మకథలు, చందమామ కథలు, మర్యాద రామన్న కథల్లో కాశీమజిలీ కథలలోని ఇతివృత్తాలు, శైలి, నాటకీయత, శిల్పం వంటివి అనుసరించినట్లు తెలుస్తుంది.[3]
  • నమస్తే తెలంగాణ అంతర్జాల పత్రికలో కాశీమజిలీకథలను ధారావాహికగా అందించింది.[4]
  • దాసుభాషితం వారు కాశీమజిలీకథలు పుస్తకాలను ఆడియో రూపంలో అందరికీ అందుబాటులోకి తేవడం చాలా గొప్పపని.[5]
  • సుమన్ టి.వి., ఫన్ జోన్ వంటి కొన్ని దృశ్యమాధ్యమాలలో ఈ కథలను పిల్లలకు దూరదర్శన్ లో ధారావాహికలుగా అందించినవి యూ ట్యూబ్ ద్వారా అందరికీ లభిస్తున్నాయి.[6]

ఇతరుల మాటలు

మార్చు
  • ఇవి కేవలము కథల వంటివేగాక వ్యాకరణాది శాస్త్ర సంప్రదాయములయందేమి యలంకారాదుల యందేమి మన ప్రాచీన కావ్యములకించుక దీసిపోవు.. -చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి
  • ఇందు పారమార్థికులకు తప్ప సామాన్యులకు రుచింపని శంకరాచార్య చరిత్రములతి రసవంతములుగ బరమార్థ బోధకంబులుగ కథా ధోరణిగ కూర్పబడినవి. -మానవల్లి రామకృష్ణ కవి

మూలాలు

మార్చు
  1. https://te.wikisource.org/wiki/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:Kaashii-Majilee-Kathalu-V10.pdf/10
  2. https://te.wikisource.org/wiki/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:Kaashii-Majilee-Kathalu-V10.pdf/8
  3. 3.0 3.1 కాశీ చేరుతున్న మజిలీ కథలు:దేవవరపు నీలకంఠరావు:తెలుగు వెలుగు పత్రిక:సెప్టెంబర్ 2014:పేజీ.24-26
  4. Kasi Majili Kathalu Episode 87 in Namaste Telangana
  5. Dasubhashitam giving details of its KasiMajiliKathalu project.
  6. Fun Zone telecast of its serial on Kasi Majili Kathalu.