కాసరనేని సదాశివరావు

డాక్టర్ కాసరనేని సదాశివరావు (1923 - 2012) : ప్రముఖ ప్రజా వైద్యులు, రైతు నాయకులు విద్యాదాత, ఆంధ్ర ప్రదేశ్ మాజీ శాసన సభ్యులు.

కాసరనేని సదాశివరావు
Kaasaraneni sadasivaraju.jpg
కాసరనేని సదాశివరావు
జననంకాసరనేని సదాశివరావు
అక్టోబరు 13 1923
గుంటూరు జిల్లా, పెదకాకాని మండలం, తక్కెళ్ళపాడు
మరణంసెప్టెంబరు 30 , 2012
వృత్తివైద్యుడు, రాజకీయ నాయకుడు, దాత, విద్యావేత్త, తెలుగు భాషా సేవకుదు
నాగార్జున ఎడ్యుకేషనల్ సొసైటీకు వ్యవస్థాపక కార్యదర్శి
ప్రసిద్ధిశస్త్రవైద్య నిపుణులు
రాజకీయ పార్టీతెలుగుదేశం
భార్య / భర్తజయప్రదాంబ
పిల్లలురాంబాల, ఉమాబాల,రమేశ్,ఉషాబాల, సురేశ్.
తండ్రిరామశాస్త్రులు.
తల్లిభాగ్యమ్మ

జననంసవరించు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, పెదకాకాని మండలం, తక్కెళ్ళపాడు శివారు రామచంద్రపాలెం (గారపాడు) గ్రామంలో భాగ్యమ్మ, రామశాస్త్రులు దంపతులకు 1923 అక్టోబరు 13వ తేదిన జన్మించారు. వీరి మేనమామ పిన్నమనేని సూరయ్య స్వాతంత్ర్య ఉద్యమంలో జైలు కెళ్ళిన దేశభక్తుడు. మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి వచ్చిన సదాశివరావు వైద్యవిద్య నభ్యసించి, శస్త్రవైద్య నిపుణులుగా పేరొందాడు.

వైద్యునిగా పీపుల్స్ నర్సింగ్ హోమ్ పేరిట ప్రజా వైద్యశాలను గుంటూరులో ప్రారంభించిన సదాశివరావు దాదాపు అర్ధ శతాబ్దం పాటు వైద్యవృత్తిలో కొనసాగాడు. మంచి హస్తవాసిగల డాక్టరుగా పేరు తెచ్చుకొన్న సదాశివరావు పేద ప్రజల పట్ల ఉదారంగా వ్యవహరించేవాడు. వృత్తిలో మానవత్వాన్ని, వృత్తి విలువలను తు.చ. తప్పక పాటించేవాడు.

రాజకీయ జీవితంసవరించు

గ్రామీణ ప్రజలపై ఆపేక్షతో, రైతాంగ హక్కుల కొరకై సదాశివరావు రాజకీయ రంగప్రవేశం చేసారు.1978లో జనతా పార్టీ అభ్యర్థిగా ప్రత్తిపాడు నుండిపోటి చేసి ఓడిపోయారు.

నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపింవిన తరువాత కొంతకాలానికి ఆ పార్టీలో చేరిన సదాశివరావు 1985లో పెదకూరపాడు నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికయ్యాడు. 1989లో మరల తెలుగుదేశం తరుపున పోటిచేసి పరాజయం పొందారు. రాజకీయాల్లోనూ ఆయన తాను నమ్మిన విలువలకు కట్టుబడే ఉన్నాడు.

సమాజసేవసవరించు

గుంటూరు లోని ప్రతిష్ఠాత్మక నాగార్జున ఎడ్యుకేషనల్ సొసైటీ కి వ్యవస్థాపక కార్యదర్శిగా వ్యవహరించిన సదాశివరావు తరువాతి కాలంలో అనేక సంవత్సరాలపాటు ఆ సంస్థకు అధ్యక్షునిగా వ్యవహరించాడు. ఈ నాగార్జున ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో గుంటూరులో ఎనిమిది ప్రముఖ విద్యాసంస్థలు పనిచేస్తున్నాయి.

సాహితీ సదస్సు పేరిట గుంటూరులో ఒక సాహిత్య వేదికను ఏర్పాటు చేసిన డాక్టర్ సదాశివరావు, ఆ సంస్థ ద్వారా ప్రముఖ కవులను, రచయితలను, తాత్వికులను గుంటూరుకు ఆహ్వానించి వారి ప్రసంగాలను గుంటూరు ప్రజలకు వినిపించాడు.

చరమాంకంసవరించు

దస్త్రం:K.Sadasiva rao, sp.cover.jpg
ప్రముఖ వైద్యులు, రైతు నాయకులు డా. కాసారనేని సదాశివరావు విదుదలైన ప్రత్యేక తపాల కవర్

డాక్టర్ చలసాని జయప్రదాంబను వివాహమాడిన సదాశివరావుకు ఐదుగురు సంతానం. ఐదుగురూ డాక్టర్లే కావడం విశేషం. భార్య మరణానంతరం ఆమె పేరు మీద గుంటూరులో మహిళా డిగ్రీ కళాశాలను స్థాపించారు.

సదాశివరావు గారు "సదాశివమ్" పేరిట ఆత్మకథను ప్రచురించాడు. మన దేశ స్వాతంత్ర్యానికి పూర్వమున్న పరిస్థితుల్ని నేటి పరిస్థితుల్ని తులనాత్మకంగా చూపెట్టే ఈ గ్రంథం చదవడానికి ఆసక్తిగానూ, ఒక మంచిమనిషి జీవితాన్ని గురించి చెప్పేదిగానూ ఉంటుంది.

డాక్టర్ సదాశివరావు గారు 30.9.2012 న గుంటూరులో మరణించారు.

భారత తపాలశాఖ వారు గుంటూరులో 2019 డిసెంబరు 14న డాక్టర్. కాసారనేని సదాశివరావు గారిపై ఒక ప్రత్యేక తపాలా కవరు విడుదల చేసారు.[1]

ములాలుసవరించు

  1. "అమరావతి స్టాంప్ & కాయిన్ ఫెస్టివల్". STAMPS OF ANDHRA. December 22, 2019. Retrieved 2021-07-06.