ప్రధాన మెనూను తెరువు

తక్కెళ్ళపాడు

గుంటూరు జిల్లా పెదకాకాని మండలంలోని గ్రామం

తక్కెళ్ళపాడు, గుంటూరు జిల్లా, పెదకాకాని మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన పెదకాకాని నుండి 8 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన గుంటూరు నుండి 5 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2249 ఇళ్లతో, 7966 జనాభాతో 1526 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3898, ఆడవారి సంఖ్య 4068. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1654 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 401. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 590254[1].పిన్ కోడ్: 522509. ఎస్.టి.డి.కోడ్ = 0863.

తక్కెళ్ళపాడు
—  రెవిన్యూ గ్రామం  —
తక్కెళ్ళపాడు is located in Andhra Pradesh
తక్కెళ్ళపాడు
తక్కెళ్ళపాడు
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°20′32″N 80°29′28″E / 16.342214°N 80.491061°E / 16.342214; 80.491061
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం పెదకాకాని
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీమతి వెలినేని స్వర్ణకుమారి
జనాభా (2011)
 - మొత్తం 7,966
 - పురుషుల సంఖ్య 3,898
 - స్త్రీల సంఖ్య 4,068
 - గృహాల సంఖ్య 2,249
పిన్ కోడ్ 522509
ఎస్.టి.డి కోడ్ 0863

విషయ సూచిక

గ్రామ చరిత్రసవరించు

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.[2]

గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలుసవరించు

తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది.

విలీన గ్రామాలుసవరించు

గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ లో అడవితక్కెళ్ళపాడు, అక్కిరెడ్డిపాలెం, గోరంట్ల, చోడవరం, ఏటుకూరు, నల్లపాడు, పెదకాకాని, పెదపలకలూరు మరియు పోతూరు మొత్తం పది గ్రామాలు విలీనమయ్యాయి.[3]

గ్రామ భౌగోళికంసవరించు

గుంటూరుకు 5 కిలోమీటర్ల దూరంలో 5వ నెంబరు జాతీయ రహదారి (NH-5)లో ఈ గ్రామం ఉంది. ఈ ఊరికి తూర్పు వైపున ఉప్పలపాడు, దక్షిణం వైపున గారపాడు (రామచంద్రపాలెం) ఉత్తరం వైపున పెదకాకాని గ్రామాలు, పడమర వైపున గుంటూరు నగరం ఉన్నాయి.

సమీప గ్రామాలుసవరించు

మద్దిరాల కాలని 2 కి.మీ, బసవ తారకరామ నగర్ 2 కి.మీ, సీతారామ నగర్ 2 కి.మీ, పాత గుంటూరు 3 కి.మీ, నెహ్రూ నగర్ 3 కి.మీ.

సమీప మండలాలుసవరించు

పశ్చిమాన గుంటూరు మండలం, ఉత్తరాన తాడికొండ మండలం, దక్షణాన చేబ్రోలు మండలం, దక్షణాన వట్టిచెరుకూరు మండలం.

విద్యా సౌకర్యాలుసవరించు

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఐదు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి.సమీప బాలబడి పెదకాకానిలో ఉంది.సమీప జూనియర్ కళాశాల పెదకాకానిలోను, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల‌లు గుంటూరులోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్ గుంటూరులో ఉన్నాయి.సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల గుంటూరులో ఉన్నాయి.

వైద్య సౌకర్యంసవరించు

ప్రభుత్వ వైద్య సౌకర్యంసవరించు

తక్కెళ్ళపాడులో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు.పశు వైద్యశాల గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యంసవరించు

గ్రామంలో 6 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీలు చదివిన డాక్టర్లు ఇద్దరు, డిగ్రీ లేని డాక్టర్లు నలుగురు ఉన్నారు. రెండు మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరుసవరించు

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. తాగునీటి కోసం చేతిపంపులు, బోరుబావులు, కాలువలు, చెరువులు వంటి సౌకర్యాలేమీ లేవు.

పారిశుధ్యంసవరించు

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలుసవరించు

తక్కెళ్ళపాడులో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్, ట్రాక్టరు సౌకర్యం మొదలైనవి గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.ప్రధాన జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. జాతీయ రహదారి గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. రాష్ట్ర రహదారి, జిల్లా రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగుసవరించు

గ్రామంలో వాణిజ్య బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్, సహకార బ్యాంకు గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలుసవరించు

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో గ్రంథాలయం ఉంది. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ స్టేషన్, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సినిమా హాలు, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

విద్యుత్తుసవరించు

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 20 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగంసవరించు

తక్కెళ్ళపాడులో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 319 హెక్టార్లు
  • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 2 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 1204 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 310 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 893 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలుసవరించు

తక్కెళ్ళపాడులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 893 హెక్టార్లు

ఉత్పత్తిసవరించు

తక్కెళ్ళపాడులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలుసవరించు

వరి

పారిశ్రామిక ఉత్పత్తులుసవరించు

రబ్బరు ఉత్పత్తులు

గ్రామంలో మౌలిక వసతులుసవరించు

  1. ఊరికి ఒక ప్రక్క ప్రకృతి ఉద్యానవనం (ఎన్.టి.ఆర్. మానస సరోవరం ఉంది.
  2. ఈ ఊరిలో దక్షిణంగా కొంత పొలాలలో, కొత్త ఇళ్ళు అనే పేరుతో ప్రభుత్వం అన్ని వర్ణాల వారికి ఇళ్ళు కట్టించి ఇచ్చింది.

గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యంసవరించు

కృష్ణానది నీరు వ్యవసాయానికి ముఖ్యమైన వనరు.

గుంటూరుకు మంచినీళ్ళుసవరించు

  1. ఈ గ్రామానికి పడమరగా ఉన్న కాలువ (గుంటూరు ఛానల్) పంటపొలాలకు నీరు అందిస్తుంది. అనేక గ్రామాలకు ఇది మంచి నీటి కాలువగా ఉపయోగపడుతుంది.ఈ కాలువ కృష్ణా నది నుండి వస్తుంది.ఉత్తరం వైపు సుమారు 30 ఎకరాల వైశాల్యం గల ఒక మంచి నీటి చెరువు ఉంది, దీన్ని ఊర చెరువు అని పిలుస్తారు. పూర్వం వర్షాలు కురిసినప్పుడు పడమరగా ఉన్న వాగు ద్వారా నీరు వచ్చి ఈ చెరువు నిండేది. పూర్వం వేసవిలో నీటి సౌకర్యం సరిగా లేకపోవటంతో ప్రక్కనే ఉన్న పెదకాకాని గ్రామంలోని బావుల నుండి నీరు తెచ్చేవారు. ప్రస్తుతం కాలువ నుంచి చెరువుకి సంవత్సరమంతా నీటి సౌకర్యం ఉండేలా ఏర్పాటు చేయడం జరిగింది. రెండు మంచి నీటి ఓవర్ హెడ్ టాంక్‌ లు, ప్రతీ ఇంటికి మంచి నీటి కొళాయిలు ఏర్పాటయ్యాయి.
  2. గుంటూరుకు 45 ఎం.ఎల్‌.డి. తాగునీటిని అందించటానికి రెండోపైపులైన్ ను 31.7.2010 న ముఖ్యమంత్రి రోశయ్య ప్రారంభించారు. గుంటూరు ఛానల్‌ తక్కెళ్ళపాడు నుంచి తాగునీటి శుద్ధి కేంద్రం వరకు 2.8 కి.మీ. పైపులైను ఉంది.

గ్రామ పంచాయతీసవరించు

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో సర్పంచిగా శ్రీమతి వెలినేని స్వర్ణకుమారి, 2,327 ఓట్ల మెజారిటీతో, ఎన్నికైనారు. [3

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలుసవరించు

  1. గ్రామంలో తూర్పు వైపున చౌడేశ్వరి అమ్మవారి ఆలయం ఉంది.
  2. దక్షిణంగా బ్రహ్మం గారి గుడి ఉంది. ఇక్కడ కార్తీక మాసం అన్న సమారాధనలు జరుగుతాయి.
  3. అద్దంకి నుండి వచ్చిన ఆద్దంకమ్మ గుడి ఉంది.
  4. చెరువు కట్ట మీద పోలేరమ్మ గుడి ఉంది.
  5. చెరువు ఒడ్డున ఉన్న శివాలయం 150 సంత్సరాల పురాతనమైనది. ఇక్కడ శివుడు శ్రీ గంగా భ్రమరాంబా సమేత చంద్రశేఖర స్వామిగా పూజలందుకొనుచున్నాడు. ప్రతి సంవత్సరం ఆర్ద్రా నక్షత్రంలో ప్రారంభించి ఐదు రోజుల పాటు ఆర్ద్రోత్సవాలు చేస్తారు. ఈ ఉత్సవాలను అప్పటి గ్రామ కరణం కాట్రపాటి వెంకట సుబ్రహ్మణ్యం ప్రారంభించాడు. ఇప్పటికి 69 పైచిలుకు "ఆర్ద్రోత్సవాలు" వైభవంగా జరిగాయి.
  6. శివాలయానికి దగ్గరలో రామాలయం ఉంది.
  7. ఈ గ్రామములోని శ్రీ చిగురుపాటి అంకమ్మ తల్లి, పోతురాజుల దేవస్థానం, 13వ వార్షికోత్సవం 2014,ఫిబ్రవరి-24,25 తేదీలలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా, 24న ఉదయం 5 గంటలకు అమ్మవారికి అభిషేకాలు, అలంకరణ, కుంకుమ పూజలు నిర్వహించారు. సాయంత్రం లలిత సహస్రనామ సంకీర్తన, ఏకాహం, శుభమంగళవాద్యాలతో అమ్మవారి గ్రామోత్సవం జరిగింది. 25న, అమ్మవారికి క్షీరాభిషేకంతోపాటు, అందమైన పుష్పాలతో ప్రత్యేక అలంకరణ చేశారు. అనంతరం 50వేల మంది భక్తులకు మహా అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు. [4]

శ్రీ అయ్యప్పస్వామివారి ఆలయంసవరించు

  1. తక్కెళ్ళపాడు గ్రామంలోని శివాలయం దగ్గర, దాతల సహకారంతో రు.60 లక్షలవ్యయంతో, నూతనంగా నిర్మింపబడిన ఈ ఆలయంలో, శ్రీ అయ్యప్పస్వామి, శ్రీ కుమారస్వామి, శిఖర, ధ్వజస్తంభ, బలిపీఠ, ప్రతిష్ఠామహోత్సవం, స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ జయనామ సంవత్సర జ్యేష్ఠ బహుళ దశమి ఆదివారం ఉదయం అశ్వనీ నక్షత్రయుక్త సింహలగ్న వేషభలగ్న నవాంశయందు, సరియగు, 2014, జూన్-22, ఆదివారం ఉదయం 9-55 గంటలకు నిర్వహించారు. అనంతరం ఉదయం 11-00 గంటలకు అన్నసంతర్పణ నిర్వహించారు. [5]
  2. ఈ ఆలయ నిర్వహణ బాధ్యతలను గ్రామస్థులే చూచుకొంటున్నారు. ఈ ఆలయ పరిధిలో, ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో, దీక్ష చేపట్టిన అయ్యప్పలందరికీ, దీక్ష చేపట్టినప్పటి నుండి 41 రోజులపాటు, ఆలయ నిర్వాహకులు, ఉచితంగా మద్యాహ్న భోజనం (చద్ది) ఏర్పాటు చేస్తున్నారు. పలువురికి ఆదర్శంగా నిలుచుచున్నారు. ప్రస్తుతం ఇక్కడ 300 మంది అయ్యప్ప మాలధారులకు చద్ది కార్యక్రమం నిర్వహించుచున్నారు. స్వాములకు చద్ది పెట్టడం పుణ్యంగా భావించుచున్న గ్రామస్థులు, చద్ది కార్యక్రమంలో పాలుపంచుకొని, తమ భక్తి భావాన్ని చాటుకుంటున్నారు. [6]

శ్రీ షిర్డీ సాయిబాబా మందిరంసవరించు

ఈ గ్రామములో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో విగ్రహ ప్రతితిష్ఠా మహోత్సవాలు, 2017,ఏప్రిల్-19వతేదీ బుధవారం నుండి 23వతేదీ ఆదివారం వరకు ఘనంగా నిర్వహించారు. చివరిరోజైన ఆదివారం నాడు, ఐదువేలమందికి పైగా భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు. [7]

  1. GANGANAMMA THALLI TEMPULE

గ్రామంలో ప్రధాన పంటలుసవరించు

పుగాకు, వరి, ప్రత్తి- ఇవి ముఖ్యమైన పంటలు

గ్రామంలో ప్రధాన వృత్తులుసవరించు

వ్యవసాయం ఇక్కడి ప్రధాన వృత్తి.

గ్రామ ప్రముఖులుసవరించు

  1. డాక్టర్ కాసరనేని సదాశివరావు:- డాక్టర్ కాసరనేని సదాశివరావు పేరు మీద "డాక్టర్ కాసరనేని సదాశివరావు కళా పరిషత్" పేరుతో ప్రతి సంవత్సరం రాష్ట్రస్థాయిలో తెలుగు నాటికల పోటీలు జరుగుతాయి.
  2. డాక్టర్ కొండబ్రోలు బసవపున్నయ్య.

గ్రామ విశేషాలుసవరించు

ఊరు అంతగా అభివృద్ధి చెందలేదు.

గణాంకాలుసవరించు

జనాభా (2011) - మొత్తం 7,966 - పురుషుల సంఖ్య 3,898 - స్త్రీల సంఖ్య 4,068 - గృహాల సంఖ్య 2,249

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 7,216.[4] ఇందులో పురుషుల సంఖ్య 3,583, స్త్రీల సంఖ్య 3,633, గ్రామంలో నివాస గృహాలు 1,952 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణము 1,526 హెక్టారులు.

జనాభా (2011) - మొత్తం 7,966 - పురుషుల సంఖ్య 3,898 - స్త్రీల సంఖ్య 4,068 - గృహాల సంఖ్య 2,249

మూలాలుసవరించు

  1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011". Cite web requires |website= (help)
  2. http://crda.ap.gov.in/APCRDA/Userinterface/ADMIN/DynamicHorizantalGovTab.aspx
  3. "Guntur Corporation Town Planning G.O." (PDF). Guntur Municipal Corporation. Retrieved 22 August 2016.
  4. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు