కాస్‌గంజ్

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని పట్టణం

కాస్‌గంజ్ ఉత్తర ప్రదేశ్, కాస్‌గంజ్ జిల్లా లోని పట్టణం, ఆ జిల్లాకు ముఖ్య పట్టణం. 2008 ఏప్రిల్ 17 న కాస్‌గంజ్, పాటియాలి, సహవార్ అనే మూడు తహసీళ్ళ‌ను చేర్చి ఈ జిల్లాను ఏర్పరచారు. [1]

కాస్‌గంజ్
कासगंज
పట్టణం
Nickname: 
కాస్‌గంజ్
కాస్‌గంజ్ is located in Uttar Pradesh
కాస్‌గంజ్
కాస్‌గంజ్
ఉత్తర ప్రదేశ్ పటంలో పట్టణ స్థానం
Coordinates: 27°48′30″N 78°38′45″E / 27.80833°N 78.64583°E / 27.80833; 78.64583
దేశం India
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
విస్తీర్ణం
 • Total22.18 కి.మీ2 (8.56 చ. మై)
Elevation
177 మీ (581 అ.)
జనాభా
 (2011)
 • Total1,01,241
 • జనసాంద్రత4,600/కి.మీ2 (12,000/చ. మై.)
భాషలు
 • అధికారికహిందీ
Time zoneUTC+5:30 (IST)
PIN
207123

భౌగోళికం

మార్చు

కాస్‌గంజ్ 27°49′N 78°39′E / 27.82°N 78.65°E / 27.82; 78.65 వద్ద. సముద్ర మట్టం నుండి 177 మీటర్ల ఎత్తున,  కాశీ నది ఒడ్డున ఉంది. ఈ పట్టణం హిమాలయ పర్వత ప్రాంతానికి సమీపంలో, దోఅబ్‌లో ఉంది. పవిత్ర నదులైన గంగ, యమునల మధ్య ఉండడం చేత ఈ భూమి, అత్యంత సారవంతమైన ప్రాంతాలలో ఒకటి. చుట్టుపక్కల గ్రామాలు పెద్ద సంఖ్యలో వ్యవసాయం, సంబంధిత ఆర్థిక కార్యకలాపాలపై ఆధారపడి ఉంటాయి. కాస్‌గంజ్ బ్లాక్ 1956 జనవరి 26 లో ఏర్పాటైంది.

శీతోష్ణస్థితి

మార్చు

కాస్‌గంజ్‌లో తేమతో కూడిన ఉపఉష్ణమండల వాతావరణం ఉంది. హిమాలయాల పర్వత పాదాలకు ఎంతో దూరంలో లేని ఈ పట్టణంలో, శీతాకాలం మితంగా ఉంటుంది, ఉష్ణోగ్రత కొన్నిసార్లు సున్నా డిగ్రీలకు చేరుకుంటుంది. వేసవికాలం వేడిగా, పొడిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు 40°C కంటే ఎక్కువగానే ఉంటాయి. వర్షాకాలం జూన్ చివరి నుండి సెప్టెంబరు వరకు ఉంటుంది. వర్షాకాలంలో దాదాపు రోజూ జల్లులు పడడం అసాధారణమైన విషయమేమీ కాదు. అక్టోబరు నుండి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. శీతాకాలం, డిసెంబరు నుండి ముదురుతుంది.

జనాభా

మార్చు

2011 జనాభా లెక్కల ప్రకారం, కాస్‌గంజ్ జనాభా 1,01,241, వీరిలో పురుషులు 53,507, మహిళలు 47,734. అక్షరాస్యత 77.36%. [2]

కాస్‌గంజ్‌లో మతం
మతం శాతం
హిందూ మతం
  
67.34%
ఇస్లాం
  
29.94%
ఇతరాలు†
  
2.72%
ఇతరాల్లో
సిక్కుమతం (0.21%), బౌద్ధం (0.68%) ఉన్నాయి.

మూలాలు

మార్చు
  1. "About District | Kasganj | India" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-05-03.
  2. "Urban Agglomerations/Cities having population 1 lakh and above" (PDF). Provisional Population Totals, Census of India 2011. Retrieved 2012-07-07.