తుంగా నదికి ఉపనదైన నందిన ఒడ్డున శృంగేరికి 10 మైళ్ళాదూరములో ఉన్న గ్రామం కిగ్గా. కిగ్గా గ్రామానికి మరుకలు అనే పేరు కూడా ఉంది. ఈ గ్రామంలో అత్యంత ప్రశస్తి చెందిన ఋష్యశృంగ మహర్షి దేవాలయము ఉంది. ఈ ప్రదేశములోనే ఋష్యశృంగుడు మెరుపుతీగ వలె మారి విదేహముక్తి పొందారు అని చెబుతారు. ఇక్కడ ఏడవ శతాబ్దపు శాసనాలు ఈ ఆలయముపేరు కిల్గలింగేశ్వర లేదా కిల్గదేవర పూజలు జరిగేవని చెబుతున్నాయి. ఇక్కడి శివలింగంపైన ఒక రుద్రాక్షం ఉంటుంది, ఇది ఒక కొమ్ము వలె ఉంటుంది.

బయటి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=కిగ్గా&oldid=2842925" నుండి వెలికితీశారు