కిబుల్ లామ్జావో జాతీయవనం
జాతీయ పార్కు
(కిబుల్ లామ్జావో జాతీయ వనము నుండి దారిమార్పు చెందింది)
కిబుల్ లామ్జావో జాతీయ పార్కు మనదేశంలోని మణిపూర్ రాష్ట్రంలోని బిష్ణుపూర్ జిల్లా లోని లోక్‌తక్ సరస్సులో ఉన్న ఒక జాతీయ పార్కు. అనేక రకాల వైవిధ్యమైన జీవజాతులను ఇక్కడ చూడవచ్చును. ఓన్లీ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ ఇన్ ది వరల్డ్ అంటే ప్రపంచంలోనే నీటిపై తేలియాడే ఏకైక జాతీయ పార్కు గా ఇది రికార్డుల కెక్కింది. ఇక్కడి జీవ వైవిధ్యాన్ని పరిరక్షించేందుకు భారత ప్రభుత్వము 1977లో ఈ వనాన్ని అభయారణ్యంగా ప్రకటించింది.[1][2][3]
కిబుల్ లామ్జావో జాతీయ పార్కు | |
---|---|
Location | బిష్ణుపూర్ జిల్లా, మణిపూర్, భారత్ |
Nearest city | మొయిరంగ్, ఇంఫాల్ |
Area | 40 చదరపు కిలోమీటర్లు (15 చ. మై.) |
Established | 28 మార్చి1977 |
Governing body | భారత ప్రభుత్వము, మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వము |
విశేషాలు
మార్చు- 40 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న లోక్‌తక్ మంచినీటి సరస్సులో 'ఫుమ్‌డిస్' అనే జాతి మొక్కలు విపరీతంగా పెరుగుతాయి. సరస్సులో మూడో వంతు భాగంలో ఇవి విస్తరించాయి. వేసవి రాగానే ఈ మొక్కలు కుళ్లిపోయి గట్టిబడతాయి. పాడైపోయిన ఈ మొక్కలపై మళ్లీ తాజా మొక్కలు పెరగడంతో కిందిభాగమంతా మట్టితో గట్టిపడుతుంది. దీనిపై మళ్లీ మొక్కలు పెరగడంతో పైభాగమంతా చూడ్డానికి గడ్డి నేలలా తయారవుతుంది. అందుకే సరస్సులో సందర్శకులు నడుస్తూ తిరిగిరావచ్చు.
- ఫుమ్‌డిస్‌పై ఇతర వృక్షాలు కూడా పెరగడంతో ఈ సరస్సు ఎన్నో జీవులకు కూడా ఆవాసమైంది. దీనిపై గుడిసెల్లాంటి నిర్మాణాలు వేసినా నిలబడతాయి.
- ఈ సరస్సుపై వందలాది మత్స్యకారుల కుటుంబాలు తేలికపాటి గుడిసెలు వేసుకుని జీవిస్తున్నాయి. పైగా ఇక్కడి మరో ప్రత్యేకత ఏమిటంటే... ప్రపంచంలో మరెక్కడా కనిపించని సంగయ్ అనే జాతి జింక ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది. మణిపూర్ సంస్కృతిలో ఇది భాగం కావడంతో ఈ జింకను డ్యాన్సింగ్ డీర్ అని పిలుస్తారు. ఈ సరస్సులో అనేక రకాల పక్షి జాతులు, చిరుత, బ్లాక్ ఈగల్, షాహీన్ ఫాల్కన్, గ్రీన్ పీఫౌల్ లాంటివీ జీవిస్తాయి.
- ఈ ఫ్లోటింగ్ నేషనల్ పార్కులో సందర్శకులకోసం వాచ్ టవర్‌ను కూడా ఏర్పాటుచేశారు. దానిపైకి ఎక్కితే చుట్టూ ఆహ్లాదకరమైన పరిసరాలు కనువిందు చేస్తాయి. ఇక్కడికి రోజూ దేశవిదేశాల నుంచి సందర్శకులు వస్తుంటారు.
చిత్రమాలిక
మార్చుమూలాలు
మార్చు- ↑ "Keibul Lamjao National Park Wild Life parks". Archived from the original on 2009-02-03. Retrieved 2009-03-29.
- ↑ "Keibul Lamjao National Park Forest Department, Government of Manipur". Archived from the original on 2008-10-15. Retrieved 2009-01-09.
- ↑ E. Ishwarjit Singh (1998-10-06). Manipur, a Tourist Paradise. B.R. Pub. Corp., 2005, Original from the University of Michigan. p. 79. ISBN 978-81-7646-506-9. ISBN 81-7646-506-2.