కిరండూల్ రైల్వే స్టేషన్

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని రైల్వే స్టేషన్

కిరండూల్ రైల్వే స్టేషన్ అనేది ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం, దంతేవాడ జిల్లాలోని కిరండూల్ నగరానికి రైలు సేవలు అందిస్తుంది.

కిరండూల్ రైల్వే స్టేషన్
టెర్మినల్ స్టేషన్
కిరండూల్ రైల్వే స్టేషన్
సాధారణ సమాచారం
Locationకిరండూల్, ఛత్తీస్‌గఢ్
Coordinates18°38′17″N 81°15′32″E / 18.63806°N 81.25889°E / 18.63806; 81.25889
Elevation631 మీ. (2,070 అ.)
నిర్వహించువారుతూర్పు తీర రైల్వే
లైన్లుకొత్తవలస-కిరండల్ రైలు మార్గము
ఫ్లాట్ ఫారాలు3
పట్టాలు7
నిర్మాణం
పార్కింగ్ఉంది
Disabled accessఉంది
ఇతర సమాచారం
StatusFunctioning
స్టేషను కోడుKRDL
జోన్లు తూర్పు తీర రైల్వే
డివిజన్లు విశాఖపట్నం
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services

చరిత్ర

మార్చు

1960లో, భారతీయ రైల్వే మూడు ప్రాజెక్టులను చేపట్టింది:

  • కొత్తవలస-అరకు-కోరాపుట్-జైపూర్-జగ్దల్‌పూర్-దంతెవార-కిరందౌల్ లైన్
  • ఝర్సుగూడ-సంబల్‌పూర్-బర్గర్-బలంగీర్-టిట్లాగర్ ప్రాజెక్ట్
  • బిరామిత్రపూర్-రూర్కెలా-బిమ్లాగర్-కిరిబురు ప్రాజెక్ట్

ఈ మొత్తం మూడు ప్రాజెక్టులు కలిసి డిబికె ప్రాజెక్ట్ లేదా దండకారణ్య బోలంగీర్ కిరిబురు ప్రాజెక్ట్ ( దండకారణ్య ప్రాజెక్ట్ కింద) గా ప్రసిద్ధి చెందాయి.[1] కొత్తవలస-కిరండూల్ లైన్ 1966-67లో సౌత్ ఈస్టర్న్ రైల్వే జోన్ కింద ఇనుప ఖనిజాన్ని రవాణా చేయడానికి జపాన్ ఆర్థిక సహాయంతో ప్రారంభించబడింది.[2][3] కిరండూల్ రైల్వే స్టేషన్ 1980 సంవత్సరంలో విద్యుదీకరించబడింది.[4]

ప్రయాణీకుల సౌకర్యాలు

మార్చు

ఈ స్టేషన్‌కు ఒక ప్యాసింజర్ రైలు (కిరండూల్-విశాఖపట్నం ప్యాసింజర్) మాత్రమే వస్తుంది. ఇటీవల 08512/08511 విశాఖపట్నం-జగ్దల్‌పూర్ రాత్రిపూట ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలు, ప్రత్యేక ఛార్జీలతో, కిరండూల్ వరకు పొడిగించబడింది. ఇది 58501/58502 విశాఖపట్నం-కిరండూల్-విశాఖపట్నం ప్యాసింజర్ కాకుండా కిరండూల్‌కు వెళ్ళే మొదటి ఎక్స్‌ప్రెస్ రైలు ఇది.

రైలు నంబర్ 08511 గల ప్రత్యేక ఛార్జీలతో కూడిన కిరండూల్-విశాఖపట్నం ప్రత్యేక రైలు నవంబరు 21 నుండి డిసెంబరు 31 వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటలకు కిరండూల్ నుండి బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 3 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.

విశాఖపట్నం నుండి కిరండూల్‌కు ప్రత్యేక ఛార్జీలతో కూడిన రైలు నంబరు 08512 విశాఖపట్నం నుండి ప్రతిరోజూ నవంబరు 21 నుండి డిసెంబరు 31 వరకు రాత్రి 10.15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10 గంటలకు కిరండూల్ చేరుతుందని డివిజనల్ కమర్షియల్ మేనేజర్ (కో.) జి. సునీల్ కుమార్ తెలిపారు.[5]

మూలాలు

మార్చు
  1. Baral, Chitta. "History of Indian Railways in Orissa" (PDF). Retrieved 2012-12-12.
  2. "Kottavalasa–Kirandul line — An obstacle course". Business Line. Retrieved 31 December 2017.
  3. "History of Waltair Division". Mannanna.com. Archived from the original on 11 October 2012. Retrieved 2013-12-12.
  4. "IR Electrification History". IRFCA. Retrieved 2013-01-23.
  5. "Jagdalpur train extended up to Kirandul". The Hindu. Retrieved 21 November 2017.