ఈస్ట్ కోస్ట్ రైల్వే (ECoR) భారతీయ రైల్వే లోని పదహారు రైల్వే మండలాలలో ఒకటి. ఈ జోన్ 2003-వ సంవత్సరము ఏప్రిల్ 1-వ తేదీన ఆగ్నేయ రైల్వే నుండి విడివడి ఉనికిలోకి వచ్చింది. దీని పేరు సూచించినట్లుగా, జోన్ రైలుమార్గాలు ఎక్కువగా భారతదేశం యొక్క తూర్పు తీర సమీపంలో ఉన్నాయి.

తూర్పు తీర రైల్వే
East Coast Railway
East Coast Railway-15
లొకేల్ఒడిషా, ఛత్తీస్గఢ్, ఆంధ్ర ప్రదేశ్
ఆపరేషన్ తేదీలు1 ఏప్రిల్ 2003–
ప్రధానకార్యాలయంభువనేశ్వర్ రైల్వే స్టేషన్
జాలగూడు (వెబ్సైట్)ECoR official website
విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషన్ ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ లో రద్దీ రైల్వే స్టేషన్

చరిత్ర

పార్లమెంట్ ఆమోదంపై ఉత్పన్నమయిన, ఏడు కొత్త మండలాలలో మొదటిది అయిన తూర్పు తీర రైల్వే 08.08.1996-వ తేదీన భారతదేశపు అప్పటి గౌరవనీయ ప్రధాన మంత్రి శ్రీ హెచ్.డి. దేవెగౌడ ప్రారంభించారు. ఆఫీసర్-ఆన్ స్పెషల్ డ్యూటీ 1996 సెప్టెంబరు 16 న కొత్తగా ప్రారంభం చేసిన జోన్ బాధ్యతలు చేపట్టారు. మొదట్లో, కేవలం ఒక డివిజన్ ఖుర్దా రోడ్ మాత్రమే ఈ రైల్వేకు కలుపబడింది. తదనంతరం జోన్ 01.04.2003 నుంచి అమల్లోకి పూర్తిగా పనిచేస్తోంది.

వాల్తేరు డివిజన్ అనుసంధాన తొలగింపు

విశఖపట్టణము కేంద్రముగా క్రొత్త రైల్వే జోను ఏర్పరచవలెనని ప్రజలు కోరుచున్నారు. ప్రజల ఈ చిరకాల కోరికను గూర్చి తాము ఆలోచిస్తున్నట్లు రైల్వే శాఖ తెలిపెను. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్ట ప్రకారము ఆ రాష్ట్రమునకు ప్రత్యేక రైల్వే జోను ఏర్పరచుటకు సాధ్యాసాధ్యములను పారిశీలీంచుటకు ఒక బృందము నియమింపబడెను. ఆ బృందము సమర్పించిన నివేదిక పై చర్యలు చేపట్టవలసి ఉంది.

విభాగాలు

తూర్పుతీర రైల్వే జోన్ యొక్క భౌగోళిక అధికార పరిధి మూడు రాష్ట్రాలు విస్తరించి ఉంది. అవి ఒడిశా అంతటా, ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో పాటు, చత్తీస్గఢ్ రాష్ట్రములో బస్తర్, దంతేవాడ జిల్లాలు

ఒడిశా రాష్ట్రములోని భువనేశ్వర్ లో జోనల్ ప్రధాన కార్యాలయం ఉంది. ఈ జోన్ లో మూడు డివిజన్లు (విభాగాలు) సంబల్పూర్, ఖుర్దా రోడ్, విశాఖపట్నం ఉన్నాయి .

విద్యుద్దీకరణ

హౌరా-చెన్నై విద్యుద్దీకరణ ట్రంక్ మార్గం సంఘటిత ఈస్ట్ కోస్ట్ రైల్వే లైన్ 2005 నవంబరు 29 న నియోగించింది. ఖరగ్పూర్, విశాఖపట్నం స్టేషన్లు, మధ్య మిస్సింగ్ లింక్ ఉంది. హౌరా నుంచి చెన్నై వైపు ఖరగ్పూర్ వద్ద, చెన్నై నుంచి హౌరా వైపు విశాఖపట్నం స్టేషన్లు వద్ద అన్ని రైళ్లు ఎలక్ట్రిక్ నుండి డీజిల్, డీజిల్ నుండి ఎలక్ట్రిక్ కొరకు ఒక లోకోమోటివ్ ఒడిషా గుండా వెళ్ళేందుకు మార్పు చేయించుకోవలసి వచ్చింది. ఇటువంటి లోకోమోటివ్ మార్పు న్యూ ఢిల్లీ నుండి బయలుదేరే భువనేశ్వర్ రాజధాని రైలు కూడా ఖరగ్పూర్‌లో మార్పు చేయించుకోవలసి వచ్చింది. ఒక ట్రంక్ దారిలో ఈ తరచుగా లోకో మార్పులు అసౌకర్యంగా, సమయం ఎక్కువ తీసుకునే ప్రక్రియగా మారింది.

ఖరగ్పూర్-విశాఖపట్నం మధ్యన 765 కి.మీ. విద్యుదీకరణతో పాటు సాగిన రైలు మార్గము, రైళ్లు వేగాన్ని అందుకున్నాయి, అధిక వేగం ఎక్స్‌ప్రెస్ రైళ్లు ముందుభాగములో ఏర్పాటు చేసే రెండు డీజిల్ అవసరం నిష్క్రమించింది. అందువలన డీజిల్ వినియోగం ఆదాఅయ్యింది, ఒక సుఖవంత మయిన ప్రయాణంగా మారింది. అదనంగా పూరీ వైపు ఖుర్దా రోడ్ నుండి రైలుమార్గము శాఖలు కూడా విద్యుద్దీకరణ జరిగింది. ఇప్పుడు నాటికి, కటక్-పరదీప్, జఖాపురా నుండి బార్బిల్ వైపు రైలుమార్గములు విద్యుద్దీకరణ జరిగింది.

ప్రధాన రైల్వే స్టేషన్లు

ప్రధాన రైల్వే స్టేషన్లు మొత్తం ఈజోన్‌లో విశాఖపట్నం, విజయనగరం, సంబల్పూర్, ఖుర్దా రోడ్, పూరీ, భువనేశ్వర్, బాలాసోర్, భద్రక్, బరంపురం, కటక్, రాయగడ, సింగపూర్ రోడ్, కోరాపుట్, టిట్లఘర్ వంటివి ఉన్నాయి. ప్రధాన స్టేషన్లలో ఎక్కువగా ఒడిషా రాష్ట్రం పరిధిలోకి వస్తాయి.

 
గోదావరి ఎక్స్‌ప్రెస్

ఈస్ట్ కోస్ట్ రైల్వే రైళ్లు

విశాఖపట్టణము నుండి ప్రారంభమగు తూర్పు తీర జోన్ రైళ్ళు

భువనేశ్వరము నుండి ప్రారంభమగు తూర్పు తీర జోన్ రైళ్ళు

  • సంబల్పూర్ - నాందేడ్ ట్రైవీక్లీ నాగావళి ఎక్స్‌ప్రెస్ (18309)
  • భువనేశ్వర్-విశాఖపట్నం ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ (18411)
  • భువనేశ్వర్ - క్రొత్త ఢిల్లీ దురంతో (12281/12282)
  • భువనేశ్వర్ - క్రొత్తఢిల్లీ రాజధాని దినసరి (22811, 22823)
  • భువనేశ్వర్ - క్రొత్త ఢిల్లీ ఒడిశా సంపర్క్ క్రాంతి (12819)
  • భువనేశ్వర్ - ముంబై లో.తి.ట. బైవీక్లీ (12880)
  • భువనేశ్వర్ - రూర్కెలా రాజ్య రాణి ఎక్స్‌ప్రెస్ (18418)
  • భువనేశ్వర్ - రూర్కెలా ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ (18105/18106)
  • భువనేశ్వర్ - బలంగీర్ ఎక్స్‌ప్రెస్ దినసరి (12893)
  • భువనేశ్వర్ - ధన్‌బాద్ గరీబ్ రథ్ వీక్లీ (12832)
  • భువనేశ్వర్ - న్యూ ఢిల్లీ వయా (రూర్కెలా) వీక్లీ (22805)
  • భువనేశ్వర్ - హౌరా జనశతాబ్ది ఆదివారం తప్ప (12074)
  • భువనేశ్వర్ - పూనే వీక్లీ (22882)
  • భువనేశ్వర్ - తిరుపతి వీక్లీ (22871, 22879)
  • భువనేశ్వర్ - యశ్వంత్‌పూర్ వీక్లీ (12845)
  • భువనేశ్వర్ - చెన్నై ఎక్స్‌ప్రెస్ వీక్లీ (12830)
  • భువనేశ్వర్ - పుదుచ్చేరి వీక్లీ (12898)
  • భువనేశ్వర్ - రామేశ్వరం వీక్లీ (18496)
  • భువనేశ్వర్ - బెంగుళూర్ నగరం ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ దినసరి (18463)
  • భువనేశ్వర్ - బెంగుళూర్ ప్రీమియం స్పెషల్ (00851/00852)

పూరీ నుండి ప్రారంభమగు తూర్పు తీర జోన్ రైళ్ళు

  • పూరీ - క్రొత్త ఢిల్లీ పురుషోత్తమ్ ఎక్స్‌ప్రెస్ దినసరి (12801)
  • పూరీ - డిఘ సముద్ర కన్య ఎక్స్‌ప్రెస్ వీక్లీ (22890)
  • పూరీ - హౌరా గరీబ్ రథ్ బైవీక్లీ (12882)
  • పూరీ - హౌరా శ్రీ జగన్నాథ ఎక్స్‌ప్రెస్ దినసరి (18410)
  • పూరీ - డిఘఎక్స్‌ప్రెస్ వీక్లీ (22878)
  • పూరీ - ఓఖా ద్వారకా ఎక్స్‌ప్రెస్ వీక్లీ (18401)
  • పూరీ - యశ్వంత్‌పూర్ గరీబ్ రథ్ వీక్లీ (22883)
  • పూరీ - హౌరా శతాబ్ది ఎక్స్‌ప్రెస్ బుధవారం మినహా (12278)
  • పూరీ - చెన్నై ఎక్స్‌ప్రెస్ వీక్లీ (22859)
  • పూరీ - అహ్మదాబాద్ ఎక్స్‌ప్రెస్ వారానికి నాలుగు సార్లు (12843)
  • పూరీ - క్రొత్త ఢిల్లీ నీలాంచల్ ఎక్స్‌ప్రెస్ (12875)
  • పూరీ - క్రొత్త ఢిల్లీ నందన్ కానన్ ఎక్స్‌ప్రెస్ (12815)
  • పూరీ - హరిద్వార్ కళింగ ఉత్కల్ ఎక్స్‌ప్రెస్ దినసరి (18477)
  • పూరీ - సూరత్ వీక్లీ (22827)
  • పూరీ - అహ్మదాబాద్ ఎక్స్‌ప్రెస్ వీక్లీ (18405)
  • పూరీ - దుర్గ్ ఎక్స్‌ప్రెస్ దినసరి (18425)
  • పూరీ - సంబల్పూర్ ఇంటర్‌సిటీ దినసరి (18304)
  • పూరీ - హతియా తపస్విని ఎక్స్‌ప్రెస్ దినసరి (18452)
  • పూరీ - ముంబై ఎల్‌టిటి వీక్లీ (22866)
  • పూరీ - అజ్మీర్ బై వీక్లీ (18421)
  • పూరీ - సాయి నగర్ షిర్డీ వీక్లీ (18407)
  • పూరీ - జోధ్పూర్ వీక్లీ (18473)
  • పూరీ - బార్బిల్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ (18415)
  • పూరీ - పాట్నా వీక్లీ బైద్యనాథ్ ధామ్ ఎక్స్‌ప్రెస్ (18449)

ఈస్ట్ కోస్ట్ రైల్వే యూనిట్లు

  • డీజిల్ లోకో షెడ్, విశాఖపట్నం
  • ఎలక్ట్రికల్ లోకో షెడ్, విశాఖపట్నం
  • రవాణా మరమ్మత్తు వర్క్‌షాప్ - మంచేశ్వర్, భువనేశ్వర్ (క్యారేజ్ రిపేరు వర్క్‌షాప్ - మంచేశ్వర్, భువనేశ్వర్)
  • డెమో, మెమో, ఈమో కారు షెడ్

రైలు మార్గములు

ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ లో 273 రైల్వే స్టేషన్లు ఉన్నాయి.

డివిజన్ ట్రాక్ కి.మీ. రూట్ కి.మీ. విద్యుద్ధీకరణ ట్రాక్ కి.మీ. విద్యుద్ధీకరణ రూట్ కి.మీ. ;
ఖుర్దా రోడ్ 1,976 834 1,965 834
సంబల్పూర్ 1,116 740
విశాఖపట్నం 2,122 1,103 1,406 709
మొత్తం 5,214 2,677 3,371 1,543

తూర్పు తీర రైల్వే నందలి రైలు మార్గములు

  1. తూర్పు తీర రైల్వే మాత్రమే 1,676 మిమీ (5 అడుగులు 6 అం) బ్రాడ్ గేజ్ రైల్వే ట్రాక్‌లు కలిగి ఉంది .
  2. భద్రక్ - ఖుర్దా రోడ్ - విశాఖపట్నం- దువ్వాడ డబుల్ లైన్ [87 రైల్వే స్టేషన్లు]
  3. నెర్‌గుండి జంక్షన్ - తాల్చేరు డబుల్ లైన్ [19 రైల్వే స్టేషన్లు]
  4. విజయనగరం - ఖరియార్ రోడ్ డబుల్ లైన్ [35 రైల్వే స్టేషన్లు]
  5. కటక్ - పరదీప్ డబుల్ లైన్ [10 రైల్వే స్టేషన్లు]
  6. ఖుర్దా రోడ్ - పూరీ డబుల్ లైన్ [09 రైల్వే స్టేషన్లు]
  7. సంబల్పూర్ - తాల్చేరు డబుల్ లైన్ [13 రైల్వే స్టేషన్లు]
  8. టిట్లఘర్ - ఝార్సుగూడా సింగిల్ లైన్ [22 రైల్వే స్టేషన్లు]
  9. కొత్తవలస - కిరండల్ సింగిల్ లైన్ [45 రైల్వే స్టేషన్లు]
  10. రాయగడ - కోరాపుట్ సింగిల్ లైన్ [14 రైల్వే స్టేషన్లు]
  11. నౌపడ - గుణుపూర్ సింగిల్ లైన్ [15 రైల్వే స్టేషన్లు]
  12. బొబ్బిలి - సాలూర్ సింగిల్ లైన్ [04 రైల్వే స్టేషన్]

బయటి లింకులు

చిత్రమాలిక

మూసలు , వర్గాలు