కిలిమనూరు ప్యాలెస్
కిలిమనూర్ రాజభవనం, కేరళ రాష్ట్రంలోని కిలిమనూరులో ఉంది. ఇది ఒక రాజగృహం. ఇది చిత్రకారుడు రాజా రవివర్మ, రాజు మార్తాండవర్మ తండ్రి రాఘవవర్మ జన్మస్థలం.[1]
రాజభవనం
మార్చురాజభవనం సముదాయం ఆరు హెక్టార్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉంది. నలుకెట్టు, చిన్న, మధ్య తరహా భవనాలు, మూడు చెరువులు, బావులు, పవిత్రమైన తోటలు (కావు) వంటి కేరళ సాంప్రదాయ నివాస నిర్మాణాలను కలిగి ఉంది. రాజారవివర్మ తన చిత్రకళ ద్వారా వచ్చిన డబ్బుతో కొన్ని భవనాలను నిర్మించి, నిర్వహించినట్లు చెబుతారు. ట్రావెన్‌కోర్ రాజభవనానికి చెందిన కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయి.
చరిత్ర
మార్చుచూట్టాయిల్లోని కిలిమనూరు రాజగృహానికి 300 సంవత్సరాల కంటే ఎక్కువ చరిత్ర ఉంది. అయినప్పటికీ పురాతన భవనాలు చాలా పూర్వ కాలం నాటివి. అయితే,1753లో రాజగృహం ప్రస్తుత రూపంలో నిర్మించబడింది.
కిలిమనూరు రాజ గృహం, ట్రావెన్‌కోర్ రాజభవనం
మార్చుకిలిమనూరు రాజ్యం వాస్తవానికి పిళ్లై పాలక అధిపతికి చెందింది. మహారాజా మార్తాండ వర్మచే ట్రావెన్‌కోర్‌కు జప్తు చేయబడింది. సా.శ.1718లో మలబార్‌లోని పరప్పనాడ్ నుండి దక్షిణం వైపుకు వచ్చిన రాజా తండ్రి కుటుంబానికి అనేక గ్రామాలతో కూడిన రాజ్యం అప్పగించబడింది.[2]
1705లో (మళయాళ కాలపట్టిక 880) పరప్పనాడ్ రాజగృహమైన బేపూర్ తట్టారికోవిలకమ్‌కు చెందిన ఇత్తమ్మర్ రాజా కుమారుడు, ఇద్దరు కుమార్తెలు దత్తత తీసుకున్నారు.ఇత్తమ్మర్ రాజా సోదరి ఆమె కుమారులు, రామవర్మ, రాఘవ వర్మ,కి లిమనూరులో స్థిరపడ్డారు. ఇత్తమ్మర్ రాజా సోదరి కుమారులు,రామవర్మ,రాఘవవర్మ, వేనాడ్ రాజ గృహంలోకి దత్తత తీసుకున్న సోదరీమణులనువివాహంచేసుకున్నారు.ట్రావెన్‌కోర్ రాజ్య స్థాపకుడుమార్తాండ వర్మ,రాఘవవర్మ కుమారుడు. రాఘవ వర్మ మేనల్లుడు[3] రవివర్మ కోయిల్ తంపురాన్, మార్తాండవర్మ సోదరిని వివాహం చేసుకున్నాడు. వారి కుమారుడు ధర్మరాజ కార్తీక తిరున్నాళ్ రామవర్మగా ప్రసిద్ధి చెందాడు.
1740లో దేశింగనాడు రాజుకు మద్దతుగా డచ్‌మాన్ కెప్టెన్ హాకర్ట్ నేతృత్వంలోని మిత్రదళం వేనాడ్‌పైదాడిచేసినప్పుడు, కిలిమనూరు[4] వచ్చిన సైన్యం ప్రతిఘటించి వారిని ఓడించింది. ఒక చిన్న విజయం అయినప్పటికీ, భారతీయ సైన్యం యూరోపియన్ శక్తిని ఓడించడం ఇదే మొదటిసారి.1753లో ఈ ఘనతకుగుర్తింపుగా మార్తాండ వర్మ కిలిమనూరు రాజభవనం [5] నియంత్రణలోఉన్న ప్రాంతాలను పన్నుల నుండి మినహాయించి, వాటికి స్వయంప్రతిపత్తి హోదాను కల్పించాడు.[6] ప్రస్తుతం ఉన్న రాజగృహంసముదాయం అయ్యప్ప ఆలయంతో పాటు ఆ సమయంలో, వారి కుటుంబ దేవత అయిన [7]శస్త్రా లేదా అయ్యపన్ కోసం నిర్మించారు.[8]
బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు ప్రణాళికలు చేస్తున్న సమయంలో వేలు తంపి దలవ కిలిమనూరు ప్యాలెస్‌లో సమావేశాలు నిర్వహించాడు. బ్రిటీష్ వారిపై తన ఆఖరియుద్ధానికి వెళ్లే ముందు అతను తన ఖడ్గాన్ని ప్యాలెస్‌లో అప్పగించాడు. భారతదేశ మొదటిరాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్ ఈ ఖడ్గాన్ని రాజగృహం నుండి అందుకున్నాడు. దానిని ఢిల్లీలోని జాతీయ సంగ్రహశాలలో ఉంచారు. అనంతరం కత్తిని త్రివేండ్రంలోని నేపియర్ సంగ్రహశాలకు తరలించారు.
వ్యక్తిత్వాలు
మార్చు- రాజా రవివర్మ,చిత్రకారుడు
- కరీంద్రన్ తంపురాన్,కవి,స్వరకర్త, స్వాతి తిరునాల్ చిన్ననాటి స్నేహితుడు
- రాజా రాజ వర్మ, రాజా రవివర్మ మేనమామ.
- సి. రాజా రాజ వర్మ కోయిల్ తంపురాన్, చిత్రకారుడు,రాజా రవివర్మ సోదరుడు
- మాధవన్ వైద్యాన్ (కిలిమనూరు రాయల్ ఫిజిషియన్)
మూలాలు
మార్చు- ↑ Mheshwari, S Uma. Thrippadidaanam. Mathrubhumi Books. pp. 41–53. ISBN 978-81-8265-947-6.
- ↑ (See page 4 in Madras Presidency Records, 1915, Supt, Government Press, Madras.)
- ↑ Sister's son. According to the matrilineal system prevalent at that time children born of the female members only belonged to that house.
- ↑ The forces were from Kochi, Thekkumkoor, Deshinganad (present kollam) and Purakkad who had enmity towards Marthanda Varma
- ↑ Most of the area under the present Kilimanoor and Pazhayakunnummel panchayats.
- ↑ Although under his kingdom
- ↑ It is also said[by whom?] Shaastha and Ayyappa are different
- ↑ The original temple being at Nerumkaithakotta, near Kozhikode