స్వాతి తిరునాళ్

శ్రీ స్వాతి తిరునాళ్ రామవర్మ (ఏప్రిల్ 16, 1813 - డిసెంబరు 25, 1846) కేరళలోని తిరువంకూరు మహారాజు, గొప్ప భక్తుడు, రచయిత. ఇతడు మహారాజా రామవర్మకు, మహారాణి గౌరీ లక్ష్మీబాయిలకు జన్మించాడు. స్వాతి నక్షత్రాన జన్మించినందు వలన కుమారునికి స్వాతి తిరునాళ్ అని నామకరణం చేశారు. యువరాజు జన్మించిన నాలుగు నెలలలోనే (29 జూలై, 1813న) రాజ్యానికి అధిపతిగా ప్రకటించారు. తిరువాన్కూరు సంస్థానాన్ని (కేరళ) పరిపాలించిన రాణి లక్ష్మీ బాయికి లేక లేక కలిగిన కుమారుడే స్వాతి తిరునాళ్ రామ వర్మ. అది బ్రిటిష్ వారు భారత దేశంలో రాజ్య విస్తరణ చేస్తున్న కాలం. బ్రిటిష్ వారి రాజ్య విస్తరణలో భాగంలో తెచ్చిన చట్ట ప్రకారం రాణిగారి మగ సంతానమే రాజ్యాధికారానికి అర్హులగుదురు. రాణిగారికి మగ సంతానం కొరకు రాజ్యమంతా ఎదురు చూస్తున్న సమయంలో రాణి గారికి కలిగిన మగ సంతానమే స్వాతి తిరునాళ్ రామ వర్మ.

స్వాతి తిరునాళ్
Svāti Tirunāḷ‍ Rāma Varmaస్వాతి తిరునాళ్ రామ వర్మ
Maharaja of Travancore
Reign1829-1846
Coronation1813
Investiture1829
PredecessorGowri Parvati Bayi గౌరి పార్వతి బాయి
SuccessorUthram Thirunalఉత్రం తిరునాళ్
జననం(1813-04-16)1813 ఏప్రిల్ 16
Travancore తిరువాన్కూరు
మరణం1846 డిసెంబరు 27(1846-12-27) (వయసు 33)
Travancore/తిరువాన్కూరు
Names
Śrī Padmanābhādāsa Śrī Vañcipāla Śrī Rāmavarma Kulaśēkhara Kirīṭapati Mannēy Suttā Rāja Rāmarāja Bahadūr Ṣanṣēr Jang, Tiruvitāṅkūḷ Mahārājāv శ్రీ పద్మనాభదాస శ్రీవంచిపాల శ్రీ రామవర్మ కులశేఖర కిరీటపతి మన్నేసుత్త రాజ రామరాజ బహదూర్ షంషీర్ జంగ్ తిరువాన్కూర్ మహారాజ
HouseTravancore royal family తిరువాన్కూరు రాజ కుటుంబము
రాజవంశంKulasekhara కులశేఖర
తండ్రిChanganassery Laxmipuram Palace Raja Raja Varma Koil Thampuran చంగనచెర్రి లక్ష్మీపురం పాలెస్ రాజ రాజ వర్మ కోయిల్ తంపురన్
తల్లిGowri Lakshmi Bayi గౌరి లక్ష్మి బాయి
మతంHinduism హిందు
మహారాజ స్వాతీ తిరునాళ్ రామవర్మ

జననముసవరించు

తిరువాన్కూరు మహా రాణి లక్ష్మీబాయి చాలకాలం తర్వాత 1913, ఏప్రిల్ 16 వ తేదీన ఒక మగ సంతానానికి జన్మనిచ్చింది. ఆ శుభ ఘడియలకొరకు ఎదురు చూస్తున్న తిరువాన్కూరు ప్రజలంతా పండగ చేసుకున్నారు. అనాటి బ్రిటిష్ పాలకుడు లార్డ్ మింటో వారి ఆజ్ఞానుసారం రాజ్యాన్ని మగ పిల్లవాడిని రాజ్యానికి పట్టాభిషిక్తుణ్ణి చేయడమో లేక తిరువాన్కూరు రాజ్యాన్ని బ్రిటిష్ ఇండియాలో కలిపి వేయడమో చేయాల్సిన పరిస్థితి. ఆ పరిస్థితుల్లో నాలుగు నెలలు కూడా నిండని పసికందుకు స్వాతి తిరునాళ్ రామ వర్మ అని పేరు పెట్టి ఆ శిసువును ఆగస్టు 28, 1813 లో రాజ్యానికి పట్టాభిషిక్తుణ్ణి చేశారు రాణి లక్ష్మీబాయి.

విద్యాభ్యాసంసవరించు

ఇతడు గొప్ప పండితుల వద్ద సంస్కృతంలో ఇతర భాషలెన్నో నేర్చుకున్నాడు. భాషలతో పాటు సంగీతంలో కూడా ప్రతిభ ప్రదర్శించాడు. తంజావూరు సుబ్బారావు ఇతని గురువుగా, దివాన్ గా స్వాతి తిరునాళ్ అభ్యున్నతికి కారణభూతులైనాడు. ఇతడు 16 సంవత్సరాల వయసులో తిరువంకూరు మహారాజుగా (1829లో) అధిష్టించి, 1846లో మరణించే వరకు రాజ్యపాలన చేశారు. త్యాగరాజు స్వామి శిష్యుడైన కన్నయ్య భాగవతార్, మృదంగంలో ప్రవీణుడైన షట్కాల గోవిందమారర్, గాత్రశిఖామణి పరమేశ్వర భాగవతార్ మొదలైన వారు ఎందరో స్వాతి తిరునాళ్ ఆస్థానంలో నిలయ విద్వాంసులుగా ఉండేవారు.

స్వాతి తిరునాళ్ సంస్కృతంలో రచించిన గ్రంథాలు గొప్ప భక్తి ప్రబోధకాలు. వీటిలో తమ ఇలవేల్పు పద్మనాభస్వామిపై చెప్పిన 'భక్తి మంజరి' గొప్ప స్తోత్రం. నూరు పద్యాలు గల ఈ రచన పది భాగాలుగా విభజింపడినది. తొమ్మిది విధములైన భక్తి మార్గాలు, పద్మనాభుని అపురూప సౌందర్యం ఇందులో మహత్తరంగా వర్ణించబడినవి. 'శ్యానందూరపుర వర్ణన' అనే మరొక సంస్కృత గ్రంథంలో తిరువనంతపురంలోని పద్మనాభ స్వామి ఆలయ చరిత్ర వివరించబడింది. ఇతని మరొక రచన 'పద్మనాభ శతకము'. ఇందలి పద్యాలు స్వామి సన్నిదానంలో ఈనాటికీ వల్లిస్తుంటారు.

స్వాతి తిరునాళ్ సంగీతాన్ని బాగా ప్రోత్సహించేవారు. ఇతడు కర్నాటక సంగీతంలో ఇంచుమించు 400 కృతులు రచించారు.[1] ఇందులో పద్మనాభ పాహి, దేవ దేవ, సరసిజనాభ, శ్రీ రమణ విభో బాగా ప్రాచుర్యం పొందాయి. ఇతనికి సంస్కృతం, హిందీ, మలయాళం, మరాఠీ, తెలుగు, బెంగాలీ, తమిళం, ఒరియా, ఇంగ్లీషు, కన్నడ భాషలలో ప్రావీణ్యం ఉంది.[2][3] స్వాతి తిరునాళ్ తెలుగులో రచించిన కీర్తనలలో 'వలపు తాళ వశమా నా సామికి చలము సేయ న్యాయమా', 'ఇటు సాహసముల ఏల నాపై చక్కని స్వామీ' అనే జావళి మిక్కిలి ప్రసిద్ధమైనవి. తిరునాళ్ కుచేలోపాఖ్యానం, అజామీళోపాఖ్యానం సంస్కృతంలో రసవత్తరమైన హరికథగా రచించాడు.

తిరువనంతపురంలోని ఖగోళ దర్శిని, జంతు ప్రదర్శనశాల, మ్యూజియం, ప్రభుత్వ ముద్రణాలయం, ప్రధాన గ్రంథాలయం, Oriental Manuscript Library, మొదలైనవి స్వాతి తిరునాళ్ ప్రారంభించినవి.

పద్మనాభ దాససవరించు

తిరువాన్కూరు సంస్థానాదీశులందరూ తాము శ్రీ పద్మనాభ స్వామి వారి దాసులమని ప్రకటించుకొని ఆ దేవ దేవుని తరుపున మాత్రమే రాజ్యాధికారం చేస్తారు. ఈ ఆచారము రాజా మార్థాండ వర్మ కాలంనుండి వస్తున్నది. ఆ ప్రకారం శ్రీ స్వాతి తిరునాళ్ రామ వర్మకు ..... శ్రీ పద్మనాభ దాస వంశీ బలరామ కుల శేఖర కిరీటి పతి స్వాతి రామ రాజ అని పొడవాటి పేరు పెట్టారు.

పూర్తి స్థాయి రాజుసవరించు

స్వాతి తిరునాళ్ రామ వర్మకు యుక్త వయస్సు వచ్చే సరికే అన్ని విద్యల్లోను ప్రావీణ్యం సాధించాడు. సంస్కృతము, హిందూస్తాని, మరాఠి, తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, పర్షియన్ భాషలలో కూడా పాండిత్యం సంపాదించాడు. అంతే గాక రాజా వారు సంగీతంలోనూ మంచి ప్రావీణ్యం సంపాదించారు. యువరాజవారికి 16 సంవత్సరాలు నిండిన సందర్భంలో 1929 ఏప్రిల్ 20 న పూర్తి స్థాయి పాలకుడుగా పట్టాభిషిక్తుడయ్యాడు.

చేపట్టిన సంస్కరణలుసవరించు

తిరువాన్కూరు సంస్థానాన్ని ఆదర్శమైన రాజ్యంగా అతీర్చిదిద్దాలని తలచి కొత్త చట్టాలు, సంస్కరణలు చేపట్టారు. ఆ సంస్కరణలలో భాగంగా..... తన రాజ్యంలో ఇంగ్లీషు భాషను ప్రవేశ పెట్టారు. ప్రభుత్వం తరుపున ఒక అచ్చు యంత్రాన్ని స్థాపించారు. గ్రంథాలయాలను స్థాపించారు., న్యాయ వ్వవస్తలో అనేక సంస్కరణలు ప్రవేశ పెట్టారు. ఆ రోజుల్లో నేర నిరూపణకు నేరస్తుడి చేతులను సల సల కాగే నూనెలో పెట్టమనేవారు. చేతులు కాలితే నేర నిరూపణ అయినట్టు, కాలకపోతే నేర నిరూపణ కానట్టుగా భావించేవారు. అటు వంటి మూడ నమ్మకాలతో నేరస్తులను విపరీతమైన శిక్షలకు గురి చేయడాన్ని రద్దు చేశారు. కొత్త చట్టాలను ప్రవేశ పెట్టారు.

బహుబాషా కోవిదుడుసవరించు

తాళ పత్ర గ్రంథాలను సేకరించి పరిష్కరించి భద్ర పరిచారు. రాజా వారు స్వయంగా సంగీత విద్వాంశుడు అయినందున, అనేక భాషలలో పాండిత్యం వున్నందున తెలుగు, హిందూస్థాని, మరాఠి భాషలలో స్వంతంగా కీర్థనలు రచించారు. ఈ కీర్థనలు నాలుగు వందల పైగా ఉన్నాయి. ఆ కీర్థనలు ఈ నాటికి ప్రజల నోళ్ళనో ఆడుతూనే ఉన్నాయి. అదే విధంగా.. రాజావారు స్యయానంద పురవర్ణన అనే ప్రబంధాన్ని, పద్మనాభ శతకాన్ని, ముహాన అంత్య ప్రాస, కుచేలోపాఖ్యానం, ఉత్సవ వర్ణన ప్రబంధము మొదలగు గ్రంథాలను కూడా రచించారు. రాజావారు స్వయంగా గణిత శాస్త్ర ప్రవీణులైనందును తన రాజ్యంలో గణితశాస్త్రం, జ్యోతిషం, ఖగోళ శాస్త్రం వంటి శాస్త్రాలలో అనేక సంస్థలను స్థాపించారు. ఈ విధంగా రాజా వారు అన్నిరంగాలలో ప్రావీణ్యత కలిగి ఆయా రంగాలను తన ప్రజల వద్దకు కూడా తీసుకు పోవడానికి తగు కృషి చేసి తన రాజ్యంలో ప్రజలందరి మన్ననలను పొందారు.

బ్రిటిష్ వారి దాష్టీకం......సవరించు

రాజావారి పాలనలో తిరువాన్కూరు సంస్థానం ఆధునీకరించబడుతున్న వేళలో బ్రిటిష్ ఇండియా జనరల్ కులెన్ రాజా వారి అధికారాలన్నీ తీసుకున్నాడు. తన రాజ్యాన్ని ఉన్నత స్థాయికి తీసుకు పోవాలని కృషి చేస్తున్న రాజా వారు ఈ సంఘటనతో మానసిక వత్తిడికి గురై శారీరకంగా, మానసికంగా కూడా కృంగి పోయారు. అలా అదే మనో వ్యాధితో శ్రీ స్వాతి తిరునాళ్ రామ వర్మ 27-12-1846 లో పరమ పదించారు. ఆనాటికి అతని వయస్సు కేవలం 33 సంవత్సరాలే.......

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. "Gov-Music" (PDF). Archived from the original (PDF) on 2006-02-20. Retrieved 2008-05-16.
  2. Compositions of Svati Tirunal Maharaja
  3. http://www.carnaticcorner.com/articles/swathi.txt

బయటి లింకులుసవరించు

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.