కీచకుడు

కీచకుడు మహాభారతంలోని విరాట పర్వంలో వచ్చే పాత్ర.

కీచకుడు (సంస్కృతం: कीचकः ) మహాభారతంలోని విరాట పర్వంలో వచ్చే పాత్ర. కీచకునికి సింహబలుడు అనే పేరు కూడా ఉంది. కీచకుడు విరాటరాజు భార్య సుధేష్ణ తమ్ముడు.[1] కీచకుడు ద్రౌపదిని అత్యాచారం చేయడానికి ప్రయత్నించగా తరువాతి రోజు నర్తనశాలలో భీముడు కీచకుడిని చంపేస్తాడు.[2] కీచకుడు అధిక శక్తి, అపారమైన బలం కలిగివున్న వ్యక్తి. విరాట రాజ్యాన్ని శత్రువుల నుండి చాలాసార్లు రక్షించాడు. కీచకుడి సోదరి సుధేష్ణకు ఉత్తర కుమారుడు, ఉత్తర అనే అందమైన కుమార్తె ఉన్నారు. ఉత్తరను అర్జునుడి కుమారుడు అభిమన్యుడు వివాహం చేసుకున్నాడు.

కీచకుడు
Raja Ravi Varma, Keechaka and Sairandhri, Oleograph.jpg
ద్రౌపదితో కీచకుడు - రాజా రవివర్మ వర్ణచిత్రం
సమాచారం
ఆయుధంగద
కుటుంబంవిరాటుడు (బావ), సుధేష్ణ (అక్క), ఉత్తర కుమారుడు, ఉత్తర, శ్వేత, శంఖ (మేనల్లుడు, మేనకోడళ్ళు)
భీముడు కీచకుడిని చంపడం (ఆర్టిస్టు: ధను)

విరాటరాజు రాజ్యం (విరాటగర్) ఇప్పుడు తూర్పు నేపాల్ లోని మొరాంగ్ జిల్లాలో ఉంది. కీచకుడు చంపబడిన ప్రదేశాన్ని కీచక్‌బాద్ అని పిలుస్తారు. ఇది బీరత్‌నగర్ నుండి తూర్పున కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న ఝాపా జిల్లాలో ఉంది. ఝాపాలో అర్జుంధర అనే స్థలం కూడా ఉంది. విరాటరాజు పశువులను పాండవులు కాపాడి తిరిగి వచ్చేటప్పుడు పశువులకు దాహం వేయగా, అర్జునుడు తన గాండీవం చేత ఒక చెరువు (ధార) తవ్వి వాటికి నీరు అందించాడు.

మహాభారతంలోసవరించు

పాండవులు ఒక సంవత్సరం పాటు విరాట రాజు రాజ్యభవనంలో పనివాళ్ళుగా చేరినప్పుడు పాండవుల భార్య ద్రౌపది, మహిళా సేవకురాలు (మాలిని) వేషంలో విరాట రాజు భార్య సుధేష్ణకి సేవలు చేయడానికి వెళ్ళింది. కీచకుడు మాలిని చూసి ఆమె అందాన్ని ఆస్వాదించాలని కోరగా దానికి ఆమె నిరాకరించింది. కీచకుడు మాలిని పట్ల తనకున్న కోరికును రాణి సుధేష్ణకు తెలిపి, తనకు మధువు పోయడానికి ఆమెను పంపమని కోరాడు. మాలిని మధువు పోస్తుండగా, కీచకుడు మాలినిని కౌగిలింత చేసుకోవడానికి ప్రయత్నించగా మాలిని ఏడుస్తూ అతన్ని కిందకు తోసేస్తుంది. దాంతో కీచకుడు మాలినిని వెంబడించగా, మాలిని సభా వేదిక గదిలోకి వెళ్తుంది. అక్కడ ఆమెను వెంట్రుకలతో పట్టుకుని, నేలమీద పడవేసి, మారువేషంలో ఉన్న భర్త యుధిష్ఠిరుడు, విరాటరాజుతో సహా సభికులందరి ముందు కాలితో తన్నాడు. ఆ సంఘటనను చూసి ఎవరూ స్పందించలేరు. కోపంతో పళ్ళు కొరుకుతున్న భీముడిని యుధిష్ఠిరుడు ప్రతీకారం తీర్చుకోవాలని ఆజ్ఞాపించాడు.

ఆ రోజు రాత్రి మాలిని, వంటవాడిగా ఉన్న భీముడిని కలుస్తుంది. వారిద్దరూ కలిసి కీచకుడిని చంపడానికి ప్రణాళికను రూపొందిస్తారు. రాత్రి సమయంలో కీచకుడిని నర్తనశాలకు రమ్మని మాలిని చెబుతుంది. దాంతో కీచకుడు నర్తనశాలకు వస్తాడు. చీకట్లో మారువేషంలో ఉండి నిద్రపోతున్న భీముడిని చూసి మాలిని అనుకొని, ముందుకు రాగానే భీముడు ఒక్కసారిగా లేచి కీచకుడిపై పడతాడు. ఇద్దరి మధ్య యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో భీయుడి చేతిలో కీచకుడు మరణిస్తాడు.[3]

మూలాలుసవరించు

  1. SRIKRISHNA The Lord Of The Universe By SHIVAJI SAWANT. ISBN 9789386888242. Retrieved 1 July 2020.
  2. కీచకులు, పురాణనామ చంద్రిక, యెనమండ్రం వెంకటరామయ్య, ప్రాచీ పబ్లికేషన్స్, హైదరాబాదు, 1879 & జూన్ 1994, పుట. 49.
  3. "Virata parva". Sacred text. Retrieved 1 July 2020.
మహాభారతం - ఆంధ్ర మహాభారతం - వ్యాసుడు - కవిత్రయం

పర్వాలు

ఆది పర్వము  • సభా పర్వము  • వన పర్వము లేక అరణ్య పర్వము  • విరాట పర్వము  • ఉద్యోగ పర్వము  • భీష్మ పర్వము  • ద్రోణ పర్వము  • కర్ణ పర్వము  • శల్య పర్వము  • సౌప్తిక పర్వము  • స్త్రీ పర్వము  • శాంతి పర్వము  • అనుశాసనిక పర్వము  • అశ్వమేధ పర్వము  • ఆశ్రమవాస పర్వము  • మౌసల పర్వము  • మహాప్రస్ధానిక పర్వము  • స్వర్గారోహణ పర్వము  • హరివంశ పర్వము

పాత్రలు
శంతనుడు | గంగ | భీష్ముడు | సత్యవతి | చిత్రాంగదుడు | విచిత్రవీర్యుడు | అంబ | అంబాలిక | విదురుడు | ధృతరాష్ట్రుడు | గాంధారి | శకుని | సుభద్ర | పాండు రాజు | కుంతి | మాద్రి | యుధిష్ఠిరుడు | భీముడు | అర్జునుడు | నకులుడు | సహదేవుడు | దుర్యోధనుడు | దుశ్శాసనుడు | యుయుత్సుడు | దుస్సల | ద్రౌపది | హిడింబి | ఘటోత్కచుడు | ఉత్తర | ఉలూపి | బభృవాహనుడు |అభిమన్యుడు | పరీక్షిత్తు | విరాటరాజు | కీచకుడు | ద్రోణుడు | అశ్వత్థామ | ఏకలవ్యుడు | కృతవర్మ | జరాసంధుడు | సాత్యకి | దుర్వాసుడు | సంజయుడు | జనమేజయుడు | వేదవ్యాసుడు | కర్ణుడు | జయద్రధుడు | శ్రీకృష్ణుడు | బలరాముడు | ద్రుపదుడు | | దృష్టద్యుమ్నుడు | శల్యుడు | శిఖండి | సుధేష్ణ
ఇతర విషయాలు
పాండవులు | కౌరవులు | హస్తినాపురం | ఇంద్రప్రస్థం | రాజ్యాలు | కురుక్షేత్ర యుద్ధం | భగవద్గీత
"https://te.wikipedia.org/w/index.php?title=కీచకుడు&oldid=2984310" నుండి వెలికితీశారు