కుంచలవారిపాలెం
కుంచాలవారిపాలెం బాపట్ల జిల్లా, చెరుకుపల్లి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
కుంచలవారిపాలెం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 16°00′44″N 80°37′21″E / 16.0121534022662°N 80.62243406092975°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | గుంటూరు |
మండలం | చెరుకుపల్లి |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
గ్రామ పంచాయతీ
మార్చు2013,జులైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో కుంచాల నాగలక్ష్మి, సర్పంచిగా ఎన్నికైనారు.
గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు
మార్చుశ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివారి ఆలయంలో స్వామివారి ఆరాధనోత్సవాలు జరుగుతాయి.[1]
గ్రామంలో ప్రధాన పంటలు
మార్చుఈ గ్రామం గోంగూరసాగుకు ప్రసిద్ధి చెందినది. ఈ గ్రామ రైతులు, దశాబ్దాలుగా, సంవత్సరమంతా, 30,40 రోజులలోనే కోతకు వచ్చే ఈ గోంగూర పంట సాగుచేయుచూ జీవనం సాగించుచున్నారు. దీనిని గుంటూరు, విజయవాడ, నెల్లూరు, రాజమండ్రి, హైదరాబాదు ప్రాంతాలకు గూడా ఎగుమతి చేస్తున్నారు. ముఖ్యంగా రంజాన్ మాసంలో ఈ గ్రామ గోంగూరకు గిరాకీ ఎక్కువ. కొంతమంది మహిళలు దీనిపైనే ఆధారపడి వ్యాపారాలు చేసి, ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేయుచున్నారు. పిల్లలకు మంచి విద్యనందించగలుగుచున్నారు. మెరుగైన జీవనం సాగించుచున్నారు. గ్రామంలో మెరక నేలలు గోంగూర సాగుకు అనుకూలంగా ఉన్నాయి. విత్తనాలు గూడా తక్కువ ధరకు లభించుచున్నవి.[2]