కుండీలో మర్రిచెట్టు

కుండీలో మర్రిచెట్టు ఒక తెలుగు కవితల పుస్తకం. ఈ పుస్తకాన్ని విన్నకోట రవిశంకర్ వ్రాసారు. ఈ పుస్తకం ముందు మాటలో ఇస్మాయిల్ ఒక కవిత గురించి " కళకి ఇంత పర్యాప్తమైన నిర్వచనం ఎక్కడా నాకు తారసపడ లేదు. జీవితపు విలువలతోనే కదా కళకి ప్రమేయం. ఈ సత్యాన్ని ప్రవించడం కాదు ఈ కవిత చేసిన పని, ఇది మనకు అనుభూతమయేటట్లు చేసింది. అనగా, ఒక యథార్థాన్ని ఆలోచనా రూపంలో కాక అనుభవ రూపంలో మనకు ప్రసాదిం చింది. ఇదే కవిత్వసారం." అంటూ మెచ్చుకున్నారు.

మానవత్వపు సారాంశాలైన జీవితానుభవాలతో స్పందించే కవితలు ఈ పుస్తకం నిండా ఉన్నాయి. పై నుదహరించినవి కాక ' కుండీలో మర్రి చెట్టు', 'రామప్ప సరస్సు', 'జ్ఞాపకం', 'నిద్రానుభవం', 'చలనచిత్రం', 'పాపమనసు' వంటి విషా దంతో, ఆనందంతో, ఉత్సాహంతో, అనురాగంతో, పురాజ్ఞాపకాలతో మెరిసే, మండే, మిరుమిట్లు గొలిపే జీవితశకలాలెన్నో ఈ కవి మనకు సమర్పించాడు.జీవితానుభవమూ, హృదయానుభూతీ - ఈ రెండు ధృవాల్నీ కలిపి కవిత్వ విద్యుచ్చక్తిని సృష్టించాడు ఈ కవి.

పుస్తకము రవిశంకర్ మొదటి పుస్తకము. ఈ పుస్తకం 22-11-1992 న తొలి ప్రచురణ. . ఈయన విద్యుత్ ఇంజనీరూ.

మూలాలు మార్చు

బయటి లింకులు మార్చు

http://kinige.com/kbook.php?id=129 Archived 2011-07-13 at the Wayback Machine