కుందూరు పెద్ద కొండారెడ్డి

కుందూరు పెద్ద కొండారెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మార్కాపురం నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.

కుందూరు పెద్ద కొండారెడ్డి

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1985 - 1994, 1999 - 2009
ముందు కందుల నారాయణ రెడ్డి
తరువాత జంకె వెంకట రెడ్డి
నియోజకవర్గం మార్కాపురం నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1947
మార్కాపురం, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు కుందూరు మల్లారెడ్డి
జీవిత భాగస్వామి సుబ్బమ్మ
సంతానం కుందూరు నాగార్జున రెడ్డి,[1] కృష్ణమోహన్‌ రెడ్డి

జననం, విద్యాభాస్యం మార్చు

కుందూరు పెద్ద కొండారెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లా, మార్కాపురంలో జన్మించాడు. ఆయన తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వరా యూనివర్శిటీలో బీఎస్సీ పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం మార్చు

కెపి కొండారెడ్డి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1985,లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 1989లో రెండవసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచాడు. కెపి కొండారెడ్డి 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన 1999, 2004లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాడు.[2]

మూలాలు మార్చు

  1. Sakshi (8 April 2019). "నేను ఎమ్మెల్యేనైతే..!". Archived from the original on 7 January 2022. Retrieved 7 January 2022.
  2. Sakshi (2019). "Markapuram Constituency History, Codes, MLA & MP Candidates | Andhra Pradesh Elections". Archived from the original on 8 January 2022. Retrieved 8 January 2022.