కుందేళ్ళ పోషణలో పద్ధతులు

మన పెరడులో తక్కువ పెట్టుబడితో నిర్మించిన చిన్న గూడు (పాక) లో కుందేళ్ళను పెంచవచ్చు. వేసవి కాలం, వర్షాకాలం లాంటి వాతావరణ పరిస్థితుల నుండి, కుక్కలు, పిల్లుల నుండి రక్షించుటకు గూడులను నిర్మించుట అవసరం.[1]

కుందేళ్ళ పోషణ

కుందేళ్ళ పెంపకము రెండు విధానాలలో ఇంటి దగ్గర పెంచుకోవచ్చును మార్చు

ఎక్కువ (డీప్) కుందేళ్ళ పెంపక విధానము మార్చు

ఈ పద్ధతి, తక్కువ సంఖ్యలో కుందేళ్ళను పెంచడానికి అనుగుణమైనది. కుందేళ్ళు నేలను రంధ్రాలు చేయకుండా అరికట్టడానికి గాను నేలను కాంక్రీటుతో గచ్చు చేయించాలి. వ్యర్థపదార్థాలయిన చెక్క నలి ధాన్యపు ఊక, ఎండుగడ్డితో నేలపై నాలుగు నుండి ఆరు అంగుళాల మందంగా నింపాలి. ఈ కుందేళ్ళ పెంపక (లిట్టర్) విధానము, ముప్ఫై కంటే ఎక్కువ కుందేళ్ళ పోషణకు సరియైనదికాదు.మగ కుందేళ్ళను విడిగా ఉంచాలి.ఎక్కువ పరిమాణంలో కుందేళ్ళ పెంపకం ఈ రకమైన విధానములో పెంచకూడదు. ఈ పెంపక (లిట్టర్) విధానములో కుందేళ్ళు సులభంగా వ్యాధులకు గురి అవుతాయి. కుందేలు పిల్లల పెంపకం నిర్వాహణ కూడా ఈ పెంపక (లిట్టర్) విధానములో కష్టం.

బోను విధానము మార్చు

కుందేళ్ళను పెంచడానికి అవసరమైన నేల

  • పెద్ద మగ కుందేలు – 4 చదరపు అడుగులు
  • ఆడ కుందేలు – 5 చదరపు అడుగులు
  • పిల్ల కుందేళ్ళు – 1.5 చదరపు అడుగులు

పెద్ద కుందేలు బోను

  • పొడవు - 1.5 అడుగులు
  • వెడల్పు - 1.5 అడుగులు
  • ఎత్తు -1.5 అడుగులు

పైన చెప్పిన కొలతలుగల బోను ఒక పెద్ద కుందేలుకు గాని లేక రెండు పెరుగుచున్న కుందేళ్ళకు గాని సరిపోతుంది.

పెరుగుచున్న కుందేలు బోను

  • పొడవు – 3 అడుగులు
  • వెడల్పు- 1.5 అడుగులు
  • ఎత్తు – 1.5 అడుగులు

పైన చెప్పిన కొలతలుగల బోను 4-5 కుందేళ్ళు మూడు నెలల వయస్సు వరకు సరిపోతుంది.

పిల్ల కుందేళ్ళను సాకడానికి బోనులు
పెరుగుతున్న కుందేళ్ళను సాకడానికి ఉంచే బోనులే, పిల్ల కుందేళ్ళను సాకడానికి పనికి వస్తాయి. కాని బోను అడుగుభాగాన, చుట్టూ ఉన్న అన్ని ప్రక్కలు 1.5 X 1.5 అంగుళాల కొలతలు గల వెల్డింగుతో చేసిన వలకన్ను (మెష్) తో తయారుచేసి ఉండాలి. దీని వల్ల కుందేలు పిల్లలు బోను బయటికి రాకుండా అరికట్టబడతాయి.

గూడు పెట్టె మార్చు

కుందేలు పిల్లలను సాకే కాలంలో సురక్షితమైన ప్రశాంత వాతావరణం కల్పించడం కోసం ఈ గూడు పెట్టెలు చాలా అవసరం. ఈ గూడు పెట్టెలు జింకు పూతఉన్న ఇనుముతో గాని, చెక్కతో గాని తయారుచేయాలి. ఈ గూడు పెట్టెల పరిమాణం, బోనులో పట్టే విధంగా ఉండాలి.

గూడు పెట్టె కొలతలు

  • పొడవు – 22 అంగుళాలు
  • వెడల్పు-12 అంగుళాలు
  • ఎత్తు – 12 అంగుళాలు

గూడు పెట్టెలు పై భాగము తెరచి ఉండేలా రూపొందించాలి. గూడు పెట్టె అడుగు భాగము 1.5 X 1.5 అంగుళాల కొలతలు గల వెల్డింగుతో చేసిన వలకన్ను (మెష్) తో తయారుచేసి ఉండాలి. పదిహేను సెంటీమీటర్ల వ్యాసము కలిగిన గుండ్రని రంధ్రాన్ని గూడు పెట్టె పొడవుగా నున్నభాగంవైపు అడుగు భాగం నుండి 10 సెంటీమీటర్ల ఎత్తులో చేయాలి. ఆడ కుందేలు బోనులో నుండి గూడు పెట్టెలోనికి వెళ్ళుటకు ఈ రంధ్రం సహాయకారిగా ఉంటుంది. గూడు పెట్టె అడుగు భాగం నుండి 10 సెంటీమీటర్ల ఎత్తులో రంధ్రాన్ని రూపొందించడం ద్వారా కుందేలు పిల్లలు గూడు పెట్టెలోనుండి బయటకు రావడాన్ని నివారిస్తుంది.

పెరడులో కుందేళ్ళ పెంపకం కొరకు బోనులు
పెరడులో కుందేళ్ళ పెంపకం కొరకు నిర్మించే బోనులు నేల నుండి 3 నుండి 4 అడుగుల ఎత్తులో ఏర్పాటుచేయాలి. ఈ బోనుల అడుగుభాగము నీళ్ళు, తెమ్మ చారని పదార్థంతో తయారుచేయాలి.

ఆహారపు, నీళ్ళ తొట్టెలు
కుందేళ్ళ ఆహారపు, నీళ్ళ తొట్టెలు సాధారణంగా జింకు పూతఉన్న ఇనుముతో తయారు చేయబడి ఉంటాయి. ఆహారపు తొట్టెలు ‘J ‘ (జె) ఆకారంలో బోనులకు బయటి వైపున బిగింపబడి ఉండాలి. ఆహారానికి, నీటికి అయ్యే పెట్టుబడి ఖర్చు తగ్గించడానికి వీటిని కప్పులలో కూడా పెట్టవచ్చు.

వనరులు మార్చు

  1. ప్రగతిపీడియా జాలగూడు[permanent dead link]