కుట్టనాడు
కుట్టనాడుకేరళలోని ఆలెప్పీ, పత్తనాంతిట్ట, కోట్టయం జిల్లాలలో విస్తరించి ఉన్న ప్రదేశం. ఇక్కడి ప్రకృతి రమణీయతకూ, వరి పొలాలకూ, భౌగోళిక వింతలకూ ఇది ప్రసిద్ధి. ఇది దేశంలోనే అతి తక్కువ ఎత్తులో ఉన్న ప్రాంతాలలో ఒకటి. ఇక్కడ పంటపొలాలు సముద్రతలం కన్నా అడుగున ఉండటం విశేషం. దక్షిణ భారతదేశ చరిత్రలో ఈ ప్రదేశానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.
కుట్టనాడు
കുട്ടനാട് కుట్టనాడ్ | |
---|---|
మండలం | |
Nickname(s): భారతదేశపు అతి నిమ్న ప్రాంతం, భారత ఉపఖండంలో అతి నిమ్న ప్రాంతం | |
Country | India |
రాష్ట్రం | కేరళ |
జిల్లా | ఆలప్పుఴ |
Elevation | −2.2 మీ (−7.2 అ.) |
భాషలు | |
• అధికారిక | మలయాళం, ఆంగ్లం |
Time zone | UTC+5:30 (Indian Standard Time - IST) |
పిన్ కోడ్ | 68956896 |
ఎస్టీడీ కోడ్ | 0477 ,0479 |
Vehicle registration | KL 66 |
అతి దగ్గరలో ఉన్న నగరం | ఆలప్పుఴ |
చరిత్ర
మార్చుఈ ప్రాంతం తొలి రోజుల గురించి చారిత్రక ఆధారాలు లభ్యం లేవు. కానీ ఇక్కడి ప్రజల జానపదాలలో ఎన్నో కథలు, కథనాలు వినిపిస్తాయి. కుట్టనాడ్ గురించి మహాభారతంలో ప్రస్తావన ఉంది; వనవాస-అజ్ఞాతవాసాల సమయంలో పాండవులు ఈ ప్రదేశాన్ని సందర్శించారనీ, అప్పుడిదంతా అడివి ప్రాంతమనీతెలుస్తుంది. తరువాతి కాలంలో అది అజ్ఞికి భస్మమై చుట్టనాడ్ (అనగా కాలిపోయిన ప్రాంతమనీ) అని పిలువబడేది. కాలక్రమేణ, చుట్టనాడు కుట్టనాడయింది. నేటికీ భూమిని తవ్వగా నల్లని బూడిద బయట పడుతుంది. ఇది మహా దావానలంకి సాక్ష్యం. ఇక్కడి ప్రదేశాల పేర్లు కారి అనే పదంతో ముగుస్తాయి. ఉదాహరణకు రామన్కారి, పుత్తుక్కారి, ఊరుక్కారి, మిత్రకారి, మంపుఴకారి, కైనకారి, చతుర్థియకారి, చెన్నంకారి.[1] ఒకప్పుడు కుట్టనాడు సముద్రతలం కింద ఉండేదని కూడా ఒక నమ్మకం ఉంది. ఇక్కడ భూమిలో దొరికే గవ్వలు, చిప్పలు ఈ విషయాన్ని ధృవీకరిస్తాయి. చేర సామ్రాజ్యకాలంలో కుట్టనాడుకు ఎంతో ప్రాముఖ్యత ఉండేది. ఈ రాజవంశంలోని రాజు చేరన్ ౘెంగుత్తవన్ తన రాజ్యాన్ని కుట్టనాడు రాజధానిగా చేసుకుని పాలించాడనడానికి ఆధారాలున్నాయి. ఆ కాలంలో ఇది ప్రముఖ బౌద్ధ క్షేత్రం. ఈ విధంగా ఈ క్షేత్రం పేరు వెనుక మరో చరిత్ర ఉంది. బుద్ధనాడే కుట్టనాడయిందని మరో కథనం ప్రచారంలో ఉంది.
భౌగోళిక విభాగాలు
మార్చుకుట్టనాడును భౌగోళికంగా మూడు విభాగాలుగా చూడవచ్చు:
- దిగువ కుట్టనాడు
- ఎగువ కుట్టనాడు
- ఉత్తర కుట్టనాడు
దిగువ కుట్టనాడులో అంబాలప్పుఴ మండలం, కుట్టనాడులోని కొన్ని భాగాలు ఉంటాయి.
ఎగువ కుట్టనాడులో కార్తీకపల్లి మండలంలోని వీయపురం గ్రామం, ఎడతువ, తలవాడి, కిడంగర మర్యు కుటనాడ్ మండాంలోని ముట్టాఋ, మావెలిక్కర లోని చెన్నితల గ్రామం, మన్నార్, కురిట్టిౘేరి, బుద్ధనూర్, ఎన్నక్కాడ్ గ్రామాలు, పత్తనాంతిట్ట జిల్లాలోని పారుమల, కడప్ర, నిరనం, పులికీఴు, పెరింగర, చత్తెంకేరి, నెడుంపురం గ్రామాలు ఉంటాయి.
ఉత్తర కుట్టనాడ్ లో వైకోం మండలం, కోట్టయం మండలంలోని పశ్చిమ భాగాలు, కోట్టయం జిల్లాలోని చంగనచ్చెర్రి మండలం ఇందులో భాగాలు.
గ్రామాలు
మార్చుకుట్టనాడులోని ముఖ్య గ్రామాలు : కైనకారి, రామన్కారి, పుదుక్కారి, చెన్నంకారి, నెడుముడి, నిరమొమ్, కైపుఴ, కుమాకోం, ఎడతువ, మాంపుఴక్కారి, నీలంపెరూర్, కైనాడి, కావలం, పులిన్చున్నూ, కన్నాడి, వెలియనాడు, వీయపురం, వేఴప్ర, కున్నంకారి, కుమరంకారి, వాలాడి, కిడంగర, మిత్రకారి, ముట్టార్, నీరట్టుపురం, తలవాడి, చంగన్కారి, చంపకులం, నెడుముడి, మొన్నత్తుముఖం, మెల్పడొం, పయిప్పాడ్, కరిచాల్, అయపరంభు, అనరి, వెళ్ళంకులంగర, పిలప్పుళ, పండి, పచ్చ, చేరుత్తన, కరువట్ట, చెన్నితల, నరకతర, వేనట్టుకాడ్, కయలప్పురం, మంకొంపు, చతుర్థియకారి, మనలాడి, కొడుప్పున్న, ఊరుక్కారి, తయన్కారి, తిరువర్పు, పుల్లంగాడి, పయట్టుపాక మొదలగునవి.
మూలములు
మార్చు- ↑ "Kuttanad.info". Archived from the original on 2009-09-19. Retrieved 2013-12-30.